కేవ‌లం రూ.11,099కే Google Pixel 6a పొందండి.. ఎలాగో చూడండి!

|

దేశంలో దీపావ‌ళి పండ‌గ సీజ‌న్ నేప‌థ్యంలో Flipkart లో నిర్వ‌హిస్తున్న ప్ర‌త్యేక సేల్‌లో భాగంగా అనేక గాడ్జెట్ల‌పై అద్భుత‌మైన ఆఫ‌ర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ క్ర‌మంలో భార‌త్‌లో కొద్ది నెల‌ల క్రితం లాంచ్ అయిన Google Pixel 6a మొబైల్‌పై భారీ డిస్కౌంట్‌ ఆఫ‌ర్‌ అందుబాటులో ఉంది. ఈ Google Pixel 6a మొబైల్‌ రూ.43,999 ప్రారంభ ధరతో భార‌త్‌లో లాంచ్ అయింది. కాగా, ఈ స్మార్ట్‌ఫోన్ ప్ర‌స్తుతం ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్‌లో భాగంగా రూ.10,000 కంటే ఎక్కువ తగ్గింపుతో అందుబాటులో ఉంది. Google Pixel మొబైల్‌కు మారాల‌ని భావించే వారికి ఇదే స‌రైన స‌మ‌యం అని చెప్పొచ్చు.

 
కేవ‌లం రూ.11,099కే Google Pixel 6a పొందండి.. ఎలాగో చూడండి!

రూ.34,199కు జాబితా చేయ‌బ‌డింది:
Flipkart Big Diwali Saleలో, Google Pixel 6a యొక్క 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ గొప్ప తగ్గింపుతో అందుబాటులో ఉంది. దీని లాంచ్ ధర రూ.43,999, కానీ ఇది ప్ర‌స్తుతం ధర తగ్గింపు కింద రూ.34,199కి జాబితా చేయబడింది. ఇది కాకుండా, ఫోన్‌పై ఇతర ఆఫర్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. వాట‌న్నిటినీ యాడ్ చేయ‌డం ద్వారా మొబైల్ ధ‌ర‌ను ఇంకా త‌గ్గించ‌వ‌చ్చు.

Flipkart లో Google Pixel 6aపై బ్యాంక్ ఆఫర్:
ఫ్లిప్‌కార్ట్‌లో, కొటక్ బ్యాంక్ మరియు SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను వినియోగించ‌డం ద్వారా కొనుగోలుదారులు 10 శాతం తక్షణ తగ్గింపును పొందవచ్చు. అలాగే, మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌పై రూ.16,900 వరకు తగ్గింపు పొందవచ్చు. Google Pixel 6aపై చాలా మంచి Exchange ఆఫర్ అందించబడుతోంది. ఇత‌ర ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా కస్టమర్ మొత్తం రూ.16,900 తగ్గింపును పొందగలుగుతారు. అలాగే, బ్యాంక్ ఆఫర్‌ను స్వీకరించడం వల్ల రూ.6,200 తగ్గింపు కూడా లభిస్తుంది. వీటన్నింటి తర్వాత, మీరు Google Pixel 6a మొబైల్‌ని రూ.34,199కి కాకుండా రూ.11,099కి పొందుతారు.

కేవ‌లం రూ.11,099కే Google Pixel 6a పొందండి.. ఎలాగో చూడండి!

Google Pixel 6a ఫీచ‌ర్లు తెలుసుకుందాం:
గూగుల్ పిక్సెల్ 6a స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌తో రన్ అవుతూ 20:9 యాస్పెక్ట్ రేషియో మరియు 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.1-అంగుళాల ఫుల్-HD+(1,080 x 2,400 పిక్సెల్‌లు) OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ను కలిగి ఉంది. ఇది ఆక్టా-కోర్ గూగుల్ టెన్సర్ SoC మరియు టైటాన్ M2 సెక్యూరిటీ కోప్రాసెసర్‌తో రన్ అవుతూ గరిష్టంగా 6GB LPDDR5 RAMతో జత చేయబడి ఉంటుంది.

గూగుల్ పిక్సెల్ 6a స్మార్ట్‌ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే కెమెరా యూనిట్‌లో 12.2-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ మరియు 12-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 8-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ కెమెరాను కలిగి ఉంది. చిత్రాన్ని తీసిన తర్వాత, ఫ్రేమ్ నుండి ఏదైనా అదనపు అంశాలు లేదా వస్తువులను తొలగించడానికి ఇది సహాయపడుతుంది. రూ.30,000లోపు ల‌భించే కొన్ని ప్రసిద్ధ మధ్య-శ్రేణి ఫోన్‌ల కంటే ఇది తక్కువ-కాంతి చిత్రాలను బాగా క్యాప్చర్ చేయగలదు. ఈ మొబైల్ 128GB అంతర్నిర్మిత స్టోరేజ్ తో ప్యాక్ చేయబడి వస్తుంది. అలాగే యాక్సిస్ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. చివరిగా ఈ స్మార్ట్‌ఫోన్ 4,410mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇలా ఈ మొబైల్ అనేక గొప్ప ఫీచ‌ర్ల‌ను క‌లిగి ఉంది. కాబ‌ట్టి, ఈ మొబైల్‌ను రాబోయే సేల్‌లో ల‌భించే అతి త‌క్కువ ధ‌ర‌కు కొనుగోలు చేయ‌డం ప్ర‌యోజ‌న‌క‌రం అనే చెప్పొచ్చు.

Best Mobiles in India

English summary
You can get Google pixel 6A smartphone for Rs.11,099 in flipkart big Diwali sale 2022

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X