Home
News

ఐఫోన్ ధరకే ఈ నాలుగూ తీసుకెళ్లండి.. Xiaomi సంచలన ఆఫర్

అమెరికా టెక్ దిగ్గజం ఆపిల్ (Apple), 2018కి గాను సరికొత్త ఐఫోన్ మోడల్స్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన విషయం తెలిసిందే.

అమెరికా టెక్ దిగ్గజం ఆపిల్ (Apple), 2018కి గాను సరికొత్త ఐఫోన్ మోడల్స్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఐఫోన్ ఎక్స్ఎస్ (iPhone Xs), ఐఫోన్ ఎక్స్ఎస్ మాక్స్ (iPhone Xs Max), ఐఫోన్ ఎక్స్ఆర్ (iPhone XR) మోడల్స్‌లో కొత్త ఐఫోన్‌లు అందుబాటులో ఉంటాయి.

చైనా మార్కెట్లో కొత్త ఐఫోన్‌ల ధరలు..

చైనా మార్కెట్లో కొత్త ఐఫోన్‌ల ధరలు..

చైనా మార్కెట్లో ఈ ఫోన్‌లకు సంబంధించిన ధరలను RMB 8699 (రూ.91,680), RMB 9599 (రూ.1,01,341) RMB 6499 (రూ.68,613)లుగా యాపిల్ ఫిక్స్ చేసింది. వీటి అమ్మకాలు త్వరలోనే ప్రారంభం కాబోతోన్న నేపథ్యంలో ఆపిల్ కాంపిటీటర్స్‌లో ఒకరమైన షియోమి (Xiaomi) కొత్త ప్లాన్‌తో ముందుకొచ్చింది.

కొత్త ఐఫోన్ ధరకే నాలుగు ఎలక్ట్రానిక్ వస్తువులు...

కొత్త ఐఫోన్ ధరకే నాలుగు ఎలక్ట్రానిక్ వస్తువులు...

అంత ధర వెచ్చించి కొత్త ఐఫోన్‌ను కొనుగోలు చేసే బుదులు తాము ఆఫర్ చేస్తున్న ప్యాకేజీలో భాగంగా ఐఫోన్ ధరకే స్మార్ట్‌‌ఫోన్, ల్యాప్‌టాప్, స్మార్ట్‌వాచ్ ఇంకా బ్లుటూత్ హెడ్‌సెట్‌లను సొంతం చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.

వివిధ కాంభినేషన్స్‌లో..

వివిధ కాంభినేషన్స్‌లో..

కొనుగోలుదారుడు కొత్త ఐఫోన్‌ను కొనుగోలు చేసే ఖర్చుతో (షియోమి ఎంఐ 8, ఎంఐ నోట్‌బుక్ ఎయిర్, ఎంఐ బ్యాండ్ 3, ఎంఐ బ్లుటూత్ హెడ్‌సెట్), (షియోమి ఎంఐ 8 ఎస్ఈ, ఎంఐ నోట్‌బుక్ ఎయిర్, ఎంఐ బ్యాండ్ 3, ఎంఐ బ్లుటూత్ హెడ్‌సెట్), (ఎంఐ మిక్స్ 2, ఎంఐ నోట్ బుక్ ఎయిర్, ఎంఐ బ్యాండ్ 3, ఎంఐ బ్లుటూత్ హెడ్‌సెట్), (షియోమి ఎంఐ 8, ఎంఐ నోట్‌బుక్ ప్రో,ఎంఐ బ్యాండ్ 3, ఎంఐ బ్లుటూత్ హెడ్‌సెట్), (షియోమి ఎంఐ 8 ఎస్ఈ, ఎంఐ నోట్‌బుక్ ప్రో, ఎంఐ బ్యాండ్ 3, ఎంఐ బ్లుటూత్ హెడ్‌సెట్), (ఎంఐ మిక్స్ 2, ఎంఐ నోట్ బుక్ ప్రో, ఎంఐ బ్యాండ్ 3, ఎంఐ బ్లుటూత్ హెడ్‌సెట్) కాంభినేషన్‌లో స్మార్ట్‌‌ఫోన్, ల్యాప్‌టాప్, స్మార్ట్‌వాచ్ ఇంకా బ్లుటూత్ హెడ్‌సెట్‌లను సొంతం చేసుకోవచ్చని షియోమి తెలిపింది.

వాళ్లకు ఈ ఆఫర్ ఓ జాక్‌పాట్..

వాళ్లకు ఈ ఆఫర్ ఓ జాక్‌పాట్..

పైన పేర్కొన్న షియోమి డీల్స్ ఆసక్తికరంగానే ఉన్నప్పటికి ఇండియా వంటి దేశాల్లో ఇటువంటి ఆఫర్స్ వర్క్‌ అవుట్ అవుతాయా, లేవా అన్నది ప్రశ్నార్థకమే. అయితే కొత్త ఐఫోన్‍‌ను కొనుగోలు చేద్దామానుకుంటోన్న సగటు చైనా యూజర్‌కు మాత్రం షియోమి ఆఫర్ చేస్తోన్న డీల్ మాత్రం ఓ జాక్‌పాట్ లాంటిది.

 

 

Best Mobiles in India

English summary
You can get a Xiaomi smartphone, laptop, Mi Band 3, and headphones at the cost of an iPhone.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X