ఆఫ్‌లైన్‌లోనూ ఓలా క్యాబ్ బుకింగ్

Written By:

సిటిలో చాలామంది ఉద్యోగులు ఎక్కువగా క్యాబ్‌లను ఆశ్రయిస్తుంటారు. ఆఫీసు నుంచి ఇంటికి వచ్చే సమయంలో గాని అలాగే ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్లే సమయంలో గాని క్యాబ్ బుక్ చేసుకుని వెళుతుంటారు. అయితే ఈ క్యాబ్ బుక్ చేయాలంటే మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్ ఉండి తీరాల్సిందే. అయితే ఇప్పుడు ఇంటర్నెట్ లేకుండానే క్యాబ్ బుక్ చేయవచ్చు. అదెలాగూ చూద్దాం.

హోమ్ ధియేటర్లపై భారీ తగ్గింపు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆఫ్‌లైన్ ఫీచర్‌

క్యాబ్ అగ్రిగేటర్ ఓలా తాజాగా ఆఫ్‌లైన్ ఫీచర్‌ను జోడించింది. దీనితో ఇంటర్నెట్ లేనప్పటికీ స్మార్ట్‌ఫోన్ నుంచి క్యాబ్‌ను బుక్ చేయవచ్చు.

బుక్ వయా ఎస్‌ఎంఎస్

బుక్ వయా ఎస్‌ఎంఎస్ అన్న ఆప్షన్‌పై క్లిక్ చేయగానే కస్టమర్ మొబైల్ నుంచి లొకేషన్‌తో కూడిన వివరాలతో ఒక మెసేజ్ ఓలాకు వెళ్తుంది.

మైక్రో, మినీ, ప్రైమ్, లగ్జరీ క్యాబ్‌ల వివరాలతో

వెంటనే కస్టమర్‌కు సమీపంలో ఉన్న మైక్రో, మినీ, ప్రైమ్, లగ్జరీ క్యాబ్‌ల వివరాలతో ఒక ఎస్‌ఎంఎస్ వస్తుంది. కస్టమర్ తనకు నచ్చిన క్యాబ్‌ను ఎంచుకోవచ్చు.

డ్రైవర్, క్యాబ్ వివరాలతో మరో ఎస్‌ఎంఎస్

ఎంపిక చేసుకోగానే డ్రైవర్, క్యాబ్ వివరాలతో మరో ఎస్‌ఎంఎస్ వస్తుంది. అటు డ్రైవర్‌కూ కస్టమర్ సమాచారం, జీపీఎస్ లొకేషన్ సైతం ఎస్‌ఎంఎస్ ద్వారా వెళ్తుంది.

ఇంటర్నెట్ ఉంటే

ఇంటర్నెట్ ఉంటే రైడ్ వివరాలు, జీపీఎస్ ట్రాకింగ్, ఎస్‌వోఎస్ బటన్ వంటి ఫీచర్లు వినియోగించుకోవచ్చు.

ప్రస్తుతం ప్రధాన నగరా

ఓలా ఆఫ్‌లైన్ బుకింగ్ సౌకర్యం ప్రస్తుతం ప్రధాన నగరాల్లో ఉంది. దశలవారీగా మొత్తం 102 నగరాలు, పట్టణాలకు విస్తరిస్తామని ఓలా ఒక ప్రకటనలో తెలియజేసింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
You Can Now Book An Ola Cab Even Without Internet Access read more gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot