Home
News

Mobikwikలో కరెంటు బిల్లు కడితే రూ.300 క్యాష్‌బ్యాక్

By Bommu Sivanjaneyulu

డిజిటల్ వాలెట్స్ విభాగంలో పెరుగిపోతోన్న పోటీ వాతవరణాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ ప్లాట్‌ఫామ్ Mobikwik సరికొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది. తమ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకుని కరెంటు బిల్లులు చెల్లించే వారికి ప్రతినెలా రూ.300 వరకు క్యాష్‌బ్యాక్ ఇస్తామని కంపెనీ తెలిపింది.

You can now get up to Rs. 300 cash back on electricity bills using Mobikwik

ఢిల్లీకి చెందిన పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ BSES ఈ క్యాష్‌బ్యాక్ స్కీమ్‌ను అనౌన్స్ చేసింది. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించటంతో, బిల్లులను సకాలంలో చెల్లించే దిశగా ప్రజలను ముందుకు నడింపే లక్ష్యంతో Mobikwikతో ఒప్పందం కుదుర్చుకన్నట్లు BSES తెలిపింది.

ఈ క్యాష్‌బ్యాక్‌ను పొందాలనుకునే యూజర్లు Mobikwik వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా కరెంట్ బిల్స్ పే చేయవల్సి ఉంటుందని BSES ఒక ప్రకటనలో తెలిపింది. దక్షిణ, పశ్చిమ, తూర్పు ఇంకా మధ్య ఢిల్లీ ప్రాంతాల్లోని BSES వినియోగదారులకు సెప్టంబర్ 30, 2018 వరకు నెెలనెలా 10 శాతం వరకు లాయల్టీ క్యాష్‌బ్యాక్ వర్తిస్తుందని BSES తెలిపింది.

తమ చందాదారులు ఇ-వాలెట్స్ ద్వారానే కాకుండా BSES డ్రాప్ బాక్సెస్, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, నెట్ బ్యాంకింగ్, ఆటో డెబిట్, బిల్ పేమెంట్ కియోస్క్స్, చెక్ ఇన్ మెయిల్ ఫెసిలిటీ ఇంకా RTGS/NEFT ద్వారా కూడా కరెంటు బిల్లులను చెల్లించవచ్చని BSES అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.

టెక్నాలజీ పరంగా మరింత ముందంజలో ఉన్న పలు దేశాల్లో డిజిటల్ చెల్లింపు వినియోగం ఇప్పటికే విస్తరించింది. అభివృద్థి చెందుతోన్న దేశాల్లో ఈ ట్రెండ్ ఇప్పుడిప్పుడే విస్తరిస్తోంది. డిజిటల్ వ్యాలెట్స్ ఎన్క్రిప్షన్ టెక్నాలజీ పై ఆధారపడి పనిచేస్తాయి.

అయితే, ఇవి ఎంత వరకు శ్రేయస్కరం అనే దాని పై ఇప్పటికి పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్‌సీ) టెక్నాలజీతో విడుదలైన మొట్టమొదటి ఫోన్ 2006లో విడుదలైంది. ఈ ఫోన్‌ను నోకియా విడుదల చేసింది. భవిష్యత్‌లో తమకు ఎదురయ్యే పోటీని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత క్రెడిట్ కార్డ్ కంపెనీలు డిజిటల్ వ్యాలట్‌లను తయారు చేస్తున్నాయి.

Best Mobiles in India

English summary
Consumers can now save up to Rs. 300 per month if they pay their electricity bills through the digital payment platform Mobikwik.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X