Home
News

ప‌బ్‌జి అభిమానులకు షాకింగ్ న్యూస్, ఇకపై లిమిట్

ప‌బ్‌జి అభిమానులకు షాకింగ్ న్యూస్, ఇకపై లిమిట్ ఆండ్రాయిడ్ మొబైల్ కాని డెస్క్ టాప్ వాడుతున్న ప్రతి ఒక్కరూ ముందుగా అందులో గేమ్స్ ఇన్ స్టాల్ చేసుకుంటారు. ఈ మధ్య కంపెనీలు కూడా వీరిని దృష్టిలో పెట్టుకున

ఆండ్రాయిడ్ మొబైల్ కాని డెస్క్ టాప్ వాడుతున్న ప్రతి ఒక్కరూ ముందుగా అందులో గేమ్స్ ఇన్ స్టాల్ చేసుకుంటారు. ఈ మధ్య కంపెనీలు కూడా వీరిని దృష్టిలో పెట్టుకుని సరికొత్త గేమ్స్ ని అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఈ నేపథ్యంలో మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన గేమ్ ఏదైనా ఉందంటే అది ప‌బ్‌జి మొబైల్ గేమ్‌నే చెప్పవచ్చు.

ప‌బ్‌జి అభిమానులకు షాకింగ్ న్యూస్, ఇకపై లిమిట్

24 గంటల దాని మీదపడి ఆడుతున్న వారు నేటికీ కోకొల్లలుగా ఉన్నారు. ఇంకా విషాదకరం ఏంటంటే చావు అంచులదాకా పోయినవారు కూడా ఉన్నారు. వారిని దృష్టిలో పెట్టుకుని కంపెనీ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఈ గేమ్ పై అలర్ట్ మెసేజ్ ని జారీ చేసింది.

6 గంట‌ల‌కు పైగా నిరంత‌రాయంగా ఆడుతుంటే

6 గంట‌ల‌కు పైగా నిరంత‌రాయంగా ఆడుతుంటే

ఇక‌పై ఎవ‌రైనా ఈ గేమ్‌ను 6 గంట‌ల‌కు పైగా నిరంత‌రాయంగా ఆడుతుంటే గ‌న‌క వారికి హెల్త్ రిమైండ‌ర్ పంప‌నుంది. 6 గంట‌లు దాటితే గేమ్ ప్లే దానంత‌ట అదే ఆగిపోతుంది.ఇక మ‌రుస‌టి రోజు వ‌ర‌కు గేమ్ ఆడ‌డం కుద‌ర‌దు. అయితే ఈ ఫీచ‌ర్ ఇప్ప‌టికే ప‌లువురు యూజ‌ర్ల‌కు అందుబాటులోకి వ‌చ్చింద‌ని స‌మాచారం. అయితే కొంద‌రికి కేవ‌లం 2 గంట‌ల పాటు ఆడితేనే ఈ రిమైండ‌ర్ వ‌స్తుంద‌ని సమాచారం.

18 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు లోపు వారు

18 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు లోపు వారు


18 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు లోపు వారు ప‌బ్‌జి మొబైల్ గేమ్‌ను 6 గంట‌ల క‌న్నా ఎక్కువ సేపు ఆడితే వారికి హెల్త్ రిమైండ‌ర్ వ‌స్తోంది. దీంతో వారు ఆ రోజుకు ఇంక గేమ్ ఆడ‌డం కుద‌ర‌డం లేద‌టని. మ‌రుస‌టి రోజే గేమ్ ఆడుకోవాలని రిమైండ‌ర్‌లో చెబుతోంది.మ‌రికొంద‌రికి 18 సంవ‌త్సరాల క‌న్నా ఎక్కువ వ‌యస్సు ఉన్న‌ప్ప‌టికీ వారికి కూడా గేమ్‌లో హెల్త్ రిమైండ‌ర్ వ‌స్తుంద‌ని, దీంతో గేమ్‌ను ఆడ‌లేక‌పోతున్నామ‌ని ప‌లువురు చెబుతున్నారు. దీనిపై టెన్సెంట్ గేమ్స్ ప‌బ్‌జి ప్రియుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గేమ్‌ను బ్యాన్ చేయాల్సిన అవ‌స‌రం రాకుండా ఇలాంటి అలర్ట్ ఇస్తున్నామని చెబుతోంది.

సృష్టిక‌ర్త టెన్సెంట్ గేమ్స్

సృష్టిక‌ర్త టెన్సెంట్ గేమ్స్

మ‌రో వైపు ప‌బ్‌జి మొబైల్ గేమ్ సృష్టిక‌ర్త టెన్సెంట్ గేమ్స్ మాత్రం ఈ గేమ్‌ను ఆరోగ్య‌క‌రమైన రీతిలో అనుభూతి చెందేలా నూత‌న ఫీచ‌ర్‌ను ఇందులో అందుబాటులోకి తెచ్చేందుకు య‌త్నిస్తున్న‌ది.

జగిత్యాల‌కు చెందిన ఓ యువ‌కుడు

జగిత్యాల‌కు చెందిన ఓ యువ‌కుడు

ఇటీవలే జగిత్యాల‌కు చెందిన ఓ యువ‌కుడు అదే ప‌నిగా గంటల త‌ర‌బ‌డి ప‌బ్‌జి గేమ్ ఆడుతూ మెడ కండ‌రాలు ప‌ట్టేసి అనంత‌రం ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా గ‌తంలోనూ ఈ గేమ్ వ‌ల్ల మాన‌సిక స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొన్న వారు చాలా మందే ఉన్నారు. ఇప్పుడీ గేమ్‌ను మ‌న దేశంలో నిషేధించాల‌ని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Best Mobiles in India

English summary
PUBG Mobile is testing a 6-hour per day limit in India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X