హైటెక్ రైల్వేస్టేషన్‌లు..త్వరలో!!

Posted By: Prashanth

హైటెక్ రైల్వేస్టేషన్‌లు..త్వరలో!!

 

ఆధునిక హంగులతో కూడిన హైటెక్ రైల్వే స్లేషన్‌లను త్వరలో చూడబోతున్నాం.. దేశంలోని ప్రముఖ రైల్వే స్టేషన్లకు మహర్థశ రానుంది.. వీటికి పటిష్టమైన భద్రతతో పాటు పరిపూర్ణమైన సాంకేతికతను అనుసంధానించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ చర్యల్లో భాగంగా ఎంపిక చేసిన 76 స్టేషన్‌లలో ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ సిస్టం (ఐఎస్ఎస్)ను ఏర్పాటు చేసే ప్రక్రియను ఇండియన్ రైల్వే శాఖ ప్రారంభించనుంది.

దేశంలోని రైల్వే స్టేషన్‌లను ఉన్నత స్థాయి సాంకేతిక ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు సుమారు రూ.350కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ అభివృద్ధి కార్యక్రమంతో దేశ రైల్వే వ్యవస్థ మరింత బలోపేతమవటంతో పాటు సెక్యూరిటీ వ్యవస్థ కట్టుదిట్టమవుతుంది.

ఈ ఆధునీకరణలో భాగంగా రైల్వే స్టేషన్‌లలో అప్‌గ్రేడెడ్ సీసీ కెమెరాలు, భారీ పరిమాణం కలిగిన X-రే మెషీన్లతో పాటు బాంబు తనిఖీ వాటి నిర్మూలనా వ్యవస్థలను ఏర్పాటు చేయునున్నారు. దింతో రైల్వే ప్రయాణం మరింత సురక్షితం కానుంది. ఇవే కాకుండా ప్రయాణీకుల సౌకర్యార్ధం వై-ఫై, బ్లూటూత్ ఇతర ఇంటర్నెట్ అనుసంధానానిక వ్యవస్థలను ఏర్పాటు చేయునున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot