Home
News

లగేజీ సమస్యలకు చెక్‌ పెట్టేలా ఆపిల్‌ షేర్ ఐటెం లొకేషన్‌ ఫీచర్‌.. ఎలా పనిచేస్తుంది?

ఆపిల్‌ నుంచి ఇటీవల iOS 18.2 పబ్లిక్‌ బీటా వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. ఈ వెర్షన్‌లో భాగంగా అనేక ఫీచర్‌లను పొందవచ్చు. షేర్‌ ఐటెమ్‌ లొకేషన్‌ పేరుతో (Apple Share Item Location Feature) కొత్త ఫీచర్‌ను లాంచ్ చేసింది. ఐఫోన్‌ XS సహా కొత్త వెర్షన్‌ మోడళ్లు ఈ ఫీచర్‌ను సపోర్టు చేస్తాయి. ఉచితంగానే వినియోగించుకోవచ్చు. ఈ ఫీచర్‌ ద్వారా ఎయిర్‌ట్యాగ్‌ లొకేషన్‌ను ఎయిర్‌లైన్స్‌ సహా థర్డ్‌ పార్టీలకు షేర్‌ చేయవచ్చు. ఫలితంగా మీరు పొగొట్టుకున్న లేదా మర్చిపోయిన లగేజీని తిరిగి పొందే అవకాశం ఉంటుంది.

ఇటీవలే ఆపిల్ iOS 18.1 వెర్షన్‌ను యూజర్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అనంతరం iOS 18.2 పబ్లిక్ బీటా వెర్షన్‌ను విడుదల చేసింది. ఈ వెర్షన్‌లో భాగంగా అందుబాటులోకి వచ్చిన షేర్‌ ఐటెం లొకేషన్‌ ఫీచర్‌ను కలిగి ఉన్న ఐఫోన్‌, ఐప్యాడ్‌, మ్యాక్‌ యూజర్‌లు ఫైండ్‌ మై యాప్‌ ద్వారా ప్రత్యేక లింక్‌ను క్రియేట్‌ చేసేందుకు అవకాశం ఉంది.

apple share item location feature

ఈ లింక్‌ ద్వారా వస్తువులు ఉన్న లొకేషన్‌ను ట్రాక్‌ చేయవచ్చు. అయితే మీకు సంబంధించిన లగేజీని ట్రాక్‌ చేసిన అనంతరం ఆ ట్రాకింగ్‌ లింక్‌ ఆటోమేటిక్‌గా డియాక్టివేట్‌ కానుంది. అయితే సాధారణంగా ఈ లింక్‌ను 7 రోజుల్లో డియాక్టివేట్‌ అయ్యేలా రూపొందించారు. ఫలితంగా యూజర్ల భద్రతకు ఎంటువంటి ముప్పు ఏర్పడే అవకాశం ఉండదు.

ప్రయాణికుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఆపిల్‌ ఈ ఫీచర్‌ను రూపొందించింది. ఇందుకోసం అనేక ఎయిర్‌లైన్స్‌తో జతకట్టింది. షేర్‌ ఐటెం లొకేషన్‌ ఫీచర్‌ను 15 ప్రముఖ ఎయిర్‌లైన్స్‌ కస్టమర్‌ కేర్‌ సర్వీస్‌తో ఇంటిగ్రేట్‌ చేశారు ఫలితంగా విమాన ప్రయాణికుల లగేజీ కష్టాలకు చెక్‌ పెట్టే అవకాశం కలిగింది. ఈ సంవత్సరం చివరి నాటికి ఫైండ్‌ మై లొకేషన్‌ డేటాను సపోర్టు చేయనున్నాయి.

ఆపిల్‌ షేర్‌ ఐటెం లొకేషన్‌ ఫీచర్‌ ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ ను కలిగి ఉంటుంది. భద్రత విషయంలో ఎక్కడా రాజీపడలేదని తెలిపింది. సంబంధిత వ్యక్తులు మినహా ఈ లింక్‌ను ఎవరూ ట్రాక్‌ చేసేందుకు అవకాశం లేదని తెలిపింది. విమాన ప్రయాణికుల సౌకర్యం కోసం ఈ ఫీచర్‌ను మరింత విస్తరించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఆపిల్ యూజర్‌లు iOS 18.2 పబ్లిక్‌ బీటా వెర్షన్‌ను ఎలా డౌన్‌లోడ్ చేయాలి?
ఈ OS అప్‌డేట్‌ కోసం యూజర్‌లు తొలుత ఐఫోన్ బ్రౌజర్‌ నుంచి ఆపిల్ బీటా సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రాం వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. ఆ వెబ్‌సైట్‌లో ఆపిల్‌ ఐడీ సాయంతో లాగిన్ కావాలి. బీటా ప్రోగ్రాంలోకి లాగిన్ అయిన తర్వాత iOS 18.2 పబ్లిక్‌ బీటా వెర్షన్ కోసం iOS ట్యాబ్‌ పైన క్లిక్‌ చేయాల్సి ఉంటుంది.

అనంతరం అక్కడ కనిపించిన బ్లూ లింక్‌ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఐఫోన్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అనంతరం జనరల్‌ సెట్టింగ్స్‌ > సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ > బీటా అప్‌డేట్‌ ను క్లిక్‌ చేయాలి. చివరిగా iOS 18.2 పబ్లిక్‌ బీటాను సెలక్ట్‌ చేసుకోవాలి. చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మరోసారి ఐఫోన్‌ సెట్టింగ్స్‌ ఆప్షన్‌లోకి వెళ్లాలి.

సెట్సింగ్స్‌ అనంతరం జనరల్‌ > సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ పైన క్లి్క్‌ చేయాలి. ఆ తర్వాత iOS 18.2 వెర్షన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. సాఫ్ట్‌వేర్‌ పూర్తిగా డౌన్‌లోడ్‌ అయ్యాక... మీ ఐఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. ఈ విధానం ద్వారా iOS 18.2 వెర్షన్‌ ద్వారా అందుబాటులోకి వచ్చిన ఫీచర్‌లను వినియోగించుకోవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
You can track your misplaced or lost luggage with apple share item location feature
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X