ఇంటర్నెట్ కనక్షన్ లేకుండా ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ చేయడం ఎలా ?

By Gizbot Bureau
|

మీరు అర్జంట్ గా ఎవరికైనా మనీ ట్రాన్స్‌ఫర్ చేయాలి. అయితే మీరు ఎక్కడో ఉన్నారు. మీరున్న ప్రాంతంలో ఇంటర్నెట్ కనెక్టివిటీ లేదు. కాని అత్యవరంగా డబ్బు పంపాలి. అలాంటి సమయంలో ఎక్కడ లేని కోపం విసుగు వస్తూ ఉంటుంది. సమయానికి డబ్బు పంపలేదనే భాద ఉంటుంది. ఒక్కొసారి పేరు కూడా పోయే ప్రమాదం ఉంది. అయితే ఇప్పడు అలాంటి బాధలకు కాలం చెల్లిపోయింది.

ఇంటర్నెట్ కనక్షన్ లేకుండా ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ చేయడం ఎలా ?

 

ఇప్పుడు మీ మొబైల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకున్నా డబ్బులు పంపవచ్చు. అయితే ఇది కేవలం మీ బ్యాంకు లావాదేవీలకు అనుసంధానమైన రిజిస్టర్ మొబైల్ నంబర్ ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది. అదెలాగో చూద్దాం.

అసలేంటిది

అసలేంటిది

ఈ సదుపాయాన్ని NUUP (National Unified USSD Platform) కల్పిస్తోంది. సర్వీసును National Payments Corp. of India (NPCI) 2012వ సంవత్సరంలో లాంచ్ చేసింది. 2014లో ఇది లైవులోకి వచ్చింది. ఈ సర్వీసు USSD (Unstructured Supplementary Service Data) ద్వారా పనిచేస్తుంది. ఈ కమ్యూనికేషన్ టెక్నాలజీ ద్వారా మీరు మీ మొబైల్ నంబర్ నుండి ఈ అప్లికేషన్ పోగ్రాం సహాయంతో ఎసెమ్మెస్ ద్వారా సేవలను పొందవచ్చు.

ఎలా పనిచేస్తుంది.

ఎలా పనిచేస్తుంది.

Unified Payments Interface (UPI) కలిగిన అని బ్యాంకులతో ఇది అనుసంధానమై పనిచేస్తుంది. మీరు మీ మొబైల్ నంబర్ నుండి *99#కి డయల్ చేయడం ద్వారా ఈసేలవు పొందవచ్చు. ఈ ఆప్సన్ ద్వారా మీరు మీ మొబైల్ నంబర్ సహాయంతో UPI ID, IFSC and bank account number లాంటి అన్నీ పనులు చేయవచ్చు. అలాగే మీకు డబ్బు అత్యవసరం అనుకుంటే రిక్వెస్ట్ పెట్టవచ్చు. దీంతో పాటు మీరు మీ బ్యాంక్ బ్యాలన్స్ చెక్ చేసుకోవచ్చు.

లావాదేవీలు
 

లావాదేవీలు

అయితే ఈ సర్వీసులో మీరు రూ. 5 వేల కన్నా ఎక్కువ పంపుకునే అవకాశం లేదు. Reserve Bank of India (RBI) గైడ్ లైన్ ప్రకారం మీరు అంతకుమించి ఎక్కువ లావాదేవీలు ఈ సర్వీసులో పొందలేరు. మీరు చేసే లావాదేవీల్లో end-to-end encryption ఆప్సన్ ఉంటుంది కాబట్టి మూడో వ్యక్తి ప్రమేయం ఉండదు. ఈ లావాదేవీల కోసం ఏ బ్యాంకు మీ నుంచి ఎటువంటి ఛార్జీలు వసూలు చేయదు. అయితే మీ మొబైల్ ఆపరేటర్ మాత్రం *99#కు డయల్ చేసినందుకు యాభై పసలు ఛార్జీ వసూలు చేస్తుంది. Telecom Regulatory Authority of India (TRAI) గైడ్ లైన్స్ ప్రకారం మ్యాగ్జిమమ్ రూ.1.50 వరకు సర్వీసు ఛార్జీ వసూలు చేసే అవకాశం ఉంది.

 గుర్తుపెట్టుకోవాల్సిన అంశం

గుర్తుపెట్టుకోవాల్సిన అంశం

అయితే ఇక్కడ మీరు ఓ విషయం గుర్తించుకోవాలి. మీ ఫోన్ నంబర్ పోగోట్టుకున్నట్లయితే అవతలి వారు మీ ఫోన్ నుంచి లావాదేవీలు నడపాలని చూస్తే వారికి తప్పనిసరిగా UPI PIN అవసరం అవుతుంది. కాబట్టి మీరు మీ ఫోన్ నంబర్ పోయిన వెంటనే బ్యాంకును సంప్రదించి మొబైల్ బ్యాకింగ్ ను డీయాక్టివేట్ చేసుకోవడం మంచిది. లేకుంటే మీ బ్యాంకు వివరాలను తస్కరించే అవకాశం ఉంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
You can transfer funds from your phone without internet connection

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more
X