జియో ఫీచర్ ఫోన్ కొనుగోలు చేసేవారికి గుడ్ న్యూస్

Written By:

జియో నుంచి త్వరలో దూసుకొస్తున్న ఫీచర్ ఫోన్ తో టెల్కోలకు వణుకుపుడుతున్న సంగతి తెలిసిందే. అయితే రిలయన్స్‌ జియో మోస్ట్‌ ఎవైటెడ్‌ 4జీ ఫీచర్‌కు సంబంధించి ఓ ఆసక్తికర న్యూస్‌​ సోషల్ మీడియాలో చక‍్కర్లు కొడుతోంది. ఎకనామిక్స్ టైం ఈ ఫోన్ కి సంబంధించి ఓ ఆసక్తికర సమాచారాన్ని వెల్లడించింది.

మనోళ్ల దెబ్బకు తుస్సుమన్న చైనా ఫోన్లు, కొనేవారే కరువు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నిర్దేశిత కాలం కంటే ముందుగానే

సెప్టెంబర్‌ నుంచి జియో వినియోగదారుల చేతుల్లో మెరవనున్న జియో 4 ఫీచర్‌ ఫోన్‌ సెక్యూరిటీ డిపాజిట్‌లో నిర్దేశిత కాలం కంటే ముందుగానే పాక్షికంగా చెల్లించనుందట జియో.

కస్టమర్లు చెల్లించే సెక్యూరిటీ డిపాజిట్‌

ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం జియో 4 జీ పీచర్‌ ఫోన్‌ కొనుగోలు సందర్భంగా కస్టమర్లు చెల్లించే సెక్యూరిటీ డిపాజిట్‌ మూడు సంవత్సరాల కంటే ముందే చెల్లించేందుకు రిలయన్స్ జియో యోచిస్తోంది.

త్వరలోనే అధికారికంగా జియో ప్రకటన

దీనిపై త్వరలోనే అధికారికంగా జియో ప్రకటన చేయనుంది. ఈ పథకం నియమ నిబంధనలను కూడా త్వరలోనే ప్రకటించనున్నట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది.

సెక్యూరిటీ డిపాజిట్‌ కింద రూ. 1500

కాగా ఇండియాస్‌ స్మార్ట్‌ఫోన్‌గా పిలుస్తున్న, పూర్తిగా ఉచితమైన దీనికోసం వినియోగదారులు సెక్యూరిటీ డిపాజిట్‌ కింద రూ. 1500 చెల్లించాల్సి ఉంటుంది.

మూడు సంవత్సరాల తరువాత

మూడు సంవత్సరాల తరువాత ఈ నగదును కస్టమర్లకు పూర్తిగా వెనక్కి చెల్లించనున్నట్టు జియో ఫోన్‌ ఆవిష్కరణ సందర్భంగా రిలయన్స్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ ప్రకటించారు. 

జియో అంచనాలను అందుకోవడం

మరోవైపు బహుళ-సిమ్ ఫోన్ల ప్రాబల్యం ఉన్న భారతదేశంలో ఈ ఫోన్ల అమ్మకాల్లో జియో అంచనాలను అందుకోవడం అంత ఈజీకాదని జేపీ మోర్గాన్‌ అభిప్రాయపడింది. మల్టీ సిమ్‌, ప్రీ పెయిడ్‌ సిమ్‌ల వృద్ధి నెలవారీగా 5శాతంగా ఉందని వాదిస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
You may get part refund for Jio 4G phone before 3 years. Here's why Read more At Gizbot Telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting