రద్దైన పెద్ద నోట్లతో మొబైల్ ఫోన్స్ కొనేందుకు ఛాన్స్..?

రద్దైన పెద్ద నోట్ల ద్వారా ఆఫ్‌లైన్ మార్కెట్లో మొబైల్ ఫోన్‌లను కొనుగోలు చేసేందుకు అనుమతించాలంటూ ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. మోదీ సర్కార్ ఈ అభ్యర్థనను అమోదించినట్లయితే పనికిరాకుండా పోయిన రూ.500, రూ.1000 నోట్లతో మొబైల్ ఫోన్‌లను కొనుగోలు చేసే వీలుంటుంది.

Read More : ఇప్పటి వరకు 45 లక్షలు , ఎగబడి కొంటున్న ఫోన్స్ ఇవే!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఓ సర్వే ప్రకారం...

నోట్ల రద్దు తరువాత ప్రముఖ రిసెర్చ్ సంస్థ ఐడీసీ నిర్వహించిన ఓ సర్వే ప్రకారం స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలు 50 శాతానికి పడిపోయినట్లు తెలుస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మొబైల్ ఫోన్ మార్కెట్ మరింత పతనమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్ జాతియ అధ్యక్షుడు పంకజ్ మోహింద్రో తెలిపారు.

 

ఐడీప్రూఫ్‌ను సబ్మిట్ చేయటం ద్వారా..?

రద్దైన నోట్లతో స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే వ్యక్తి తన ఐడీప్రూఫ్‌ను సబ్మిట్ చేయవల్సి ఉంటుందని, అంతేకాకుండా సక్రమమైన IMEI నెంబర్ తో ఉన్న ఫోన్ లు మాత్రమే విక్రయించేందుకు వీలుంటుందని ఐసీఏ అభిప్రాయపడుతోంది. ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్ అభ్యర్థన పై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జీరో డౌన్ పేమెంట్ ఆఫర్లు

పెద్ద నోట్ల రద్దుతో మొబైల్ వ్యాపారులు వినియోగదారులను ఆకర్షించేందుకు జీరో డౌన్ పేమెంట్ ఆఫర్లు మొదలు పెట్టారు. దీంతో కొన్ని మొబైల్ షాపుల వద్ద క్యూలైన్లు కనిపిస్తున్నాయి.

సంగీతా మొబైల్స్‌లో..

సంగీతా మొబైల్స్‌లో ఎలాంటి ముందస్తు చెల్లింపు లేకుండా మొబైల్ ఫోన్ కొనుగోలు చేసే ఆఫర్ ను ప్రారంభించారు. తర్వాత 12 నెలల పాటు వాయిదా పద్ధతిలో డబ్బు చెల్లించవచ్చుని సంగీత మొబైల్స్ ఎండీ సుభాష్ చంద్ర చెబుతున్నారు.

ఏమి చెల్లించకుండానే నచ్చిన ఫోన్

సాధారణంగా అయితే ఫోన్ ధరలో కొంత భాగం చెల్లించిన తరువాత మిగతా మొత్తాన్ని వడ్డీతో సహా విడతల వారీ చెల్లించాల్సి ఉంటుంది. కాని ఇప్పుడు మీరు ఏమి చెల్లించకుండానే నచ్చిన ఫోన్ తీసుకోవచ్చని మిగతా మొత్తం వాయిదాల్లో చెల్లించాలని చెబుతున్నారు.

ముందస్తు చెల్లింపులు లేకుండా..

మాములుగా అయితే క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, నగదు రూపంలో చెల్లింపులు స్వీకరిస్తారు. అయితే రూ .500, రూ .1000 నోట్ల రద్దు కారణంగా అమ్మకాలు తగ్గటంతో ముందస్తు చెల్లింపులు లేకుండా రిటైలర్లు ఫోన్ల అమ్మకాలు చేపట్టారు.

హెచ్‌పీ ఇండియా సరికొత్త ఆఫర్‌తో ...

పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో హెచ్‌పీ ఇండియా సరికొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది. తమ ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేసే యూజర్లకు స్పెషల్ జీరో వడ్డీ ఈఎమ్ఐ స్కీమ్ క్రింద 50 రోజల పేమెంట్ హాలీడేను ప్రకటించింది. 2016లో లాంచ్ అయిన హెచ్‌పీ నోట్‌బుక్‌ల పై మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.

 

డౌన్‌పేమెంట్ చెల్లించకుండా హెచ్‌పీ ల్యాప్‌టాప్‌..

ఈ స్పెషల్ స్కీమ్‌లో భాగంగా ఏ విధమైన డౌన్‌పేమెంట్ చెల్లించకుండా హెచ్‌పీ ల్యాప్‌టాప్‌లను సొంతం చేసుకునే వీలుంటుంది. రూ.23,000 ధరట్యాగ్ నుంచి ప్రారంభమయ్యే హెచ్‌పీ ల్యాప్‌టాప్‌ల పై కూడా ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుందని హెచ్‌పీ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. నవంబర్ 30 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న 1100 హెచ్‌పీ స్టోర్‌లలో ఈ స్కీమ్‌ను పొందవచ్చు.

లేటెస్ట్ ల్యాప్‌టాప్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
You Might Soon be Able to Buy Mobiles With Old Rs. 500, Rs. 1000 Notes!.Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot