Home
News

రానున్న రోజుల్లో వైఫై నెట్‌వర్క్ నుంచే ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు..

నెట్‌వర్క్ సరిగ్గా లేనపుడు కాల్స్ చేసుకోవటనేది దాదాపుగా కష్టతరంగా మారిపోతుంది.

By Bommu Sivanjaneyulu

నెట్‌వర్క్ సరిగ్గా లేనపుడు కాల్స్ చేసుకోవటనేది దాదాపుగా కష్టతరంగా మారిపోతుంది. ఇటువంటి సందర్భాల్లో వై-ఫై కనెక్టువిటీ అందుబాటులో ఉన్నప్పటికి కేవలం వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ కాల్స్ మాత్రమే చేసేకునే వీలుంటుంది. ఈ సౌకర్యాన్ని వాట్సాప్, టలిగ్రామ్ వంటి ఇన్‌స్టెంట్ మెసేజింగ్ సర్వీసులు ఆఫర్ చేస్తున్నప్పటికి అవతలి వ్యక్తి వద్ద ఇవి అందుబాటులోలేకపోయినట్లయితే వై-ఫై కనెక్టువిటీ ఉన్నప్పటికి ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాల్ డ్రాపింగ్ సమస్యలు దేశవ్యాప్తంగా ఎక్కువవుతోన్న నేపథ్యంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికామ్ 2018కిగాను నేషనల్ టెలికామ్ పాలసీని రిలీజ్ చేసింది. ఈ డ్రాఫ్ట్‌లో ప్రతిపాదించిన గైడ్‌లైన్స్ ప్రకారం ఎయిర్‌టెల్, ఐడియా, రిలయన్స్ జియో, వొడాఫోన్ వంటి లైసెన్సుడ్ టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్లు వై-ఫై ఆధారంగా స్పందించగలిగే యాప్-ఆధారిత వాయిస్ కాలింగ్ సర్వీసులను ప్రొవైడ్ చేయవల్సి ఉంటుంది.

వాయిస్ కాల్స్‌ను

వాయిస్ కాల్స్‌ను

ఈ విధమైన వాయిస్ కాల్స్‌ను కూడా రెగ్యులర్ వాయిస్ కాల్స్ మాదిరిగానే ఆపరేటర్లు ట్రీట్ చేయవల్సి ఉంటుందని టెలికమ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా సూచించింది. ఉదాహరణకు మీరు వొడాఫోన్ సిమ్‌ను వినియోగించుకుంటున్నట్లయితే వై-ఫై కనెక్టువిటీ పై కాల్ చేసే సమయంలో ఆ కంపెనీకి సంబంధించిన ఇంటర్నెట్ టెలీఫోనీ యాప్‌ను మీ డివైస్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవల్సి ఉంటుంది.

 

మీ ఫోన్ సిగ్నల్ బలహీనంగా ఉంటుందా..?

మీ ఫోన్ సిగ్నల్ బలహీనంగా ఉంటుందా..?

ఈ రోజుల్లో ప్రతిఒక్కరి చేతిలోనూ మొబైల్ ఫోన్ అనేది కనిపిస్తోంది. దీంతో మొబైల్ నెట్‌వర్క్ అనేది చాలా కీలకంగా మారిపోయింది. ఫోన్ నెట్‌వర్క్ సిగ్నల్ వీక్‌గా ఉన్నప్పుడు కాల్స్‌ కనెక్ట్ కాకపోవటం, ఒకవేళ కనెక్ట్ అయినా కాల్ వెంట‌నే డ్రాప్ అయిపోవ‌డం, మాట్లాడుతూ ఉండ‌గానే సిగ్న‌ల్ స‌రిగ్గా అంద‌క కాల్ కట్ అవ‌డం వంటి స‌మ‌స్య‌ల‌ు కామన్‌గా ఎదురవుతూనే ఉంటాయి. ఇటువంటి సమస్యను మీరు కూడా ఫేస్ చేస్తున్నట్లయితే ఈ సింపుల్ ట్రిక్స్‌ను పాటించటం ద్వారా సమస్యను కొంత మేర పరిష్కరించుకోవచ్చు..

 ఫోన్‌ సిగ్న‌ల్

ఫోన్‌ సిగ్న‌ల్

మీ ఫోన్‌ సిగ్న‌ల్ బలహీనంగా ఉంటున్నట్లయితే ఒకసారి డివైస్‌ను ఆఫ్ చేసి మ‌ళ్లీ ఆన్ చేయండి. దీంతో ఫోన్ కొత్త ట‌వ‌ర్ సిగ్న‌ల్ కోసం వెదుకుతుంది. ఈ క్ర‌మంలో సిగ్న‌ల్ కొంత మెరుగ‌య్యేందుకు ఆస్కారం ఉంది. సాధార‌ణంగా ఏ ఫోన్‌కైనా దాని సిగ్న‌ల్ యాంటెన్నా వెనుక భాగంలో పైన ఉంటుంది. కొన్నింటికి వెనుక భాగంలో దిగువ‌న ఉంటుంది. క‌నుక ఈ రెండు ప్ర‌దేశాల‌ను వీలైనంత వ‌ర‌కు చేతులతో క‌వ‌ర్ చేయ‌కూడ‌దు. ఓపెన్‌గా ఉంచి, మిగ‌తా ప్రాంతంలో ఫోన్‌ను ప‌ట్టుకోవాలి. దీంతో ఫోన్‌కు సిగ్న‌ల్ స‌రిగ్గా అందుతుంది.

నాలుగు గోడ‌లు, బిల్డింగ్‌లు,

నాలుగు గోడ‌లు, బిల్డింగ్‌లు,

నాలుగు గోడ‌లు, బిల్డింగ్‌లు, చెట్లు ఎక్కువగా ఉన్న‌ప్పుడు వాటి మ‌ధ్య సిగ్న‌ల్ త‌క్కువ‌గా వ‌స్తుంది. క‌నుక వీలైనంత వ‌ర‌కు ఓపెన్ ప్ర‌దేశంలో ఉండి కాల్స్ చేసుకోవ‌డానికి య‌త్నించండి. బిల్డింగ్‌లైతే వాటి పైకి వెళ్తే సిగ్న‌ల్ ఎక్కువ‌గా వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. ఒకే ప్రాంతంలో నిల‌బ‌డి ఉండి మాట్లాడ‌డం క‌న్నా, అటు, ఇటు తిరుగుతూ కాల్ మాట్లాడుతున్నట్లయితే సిగ్నల్ శాతం పెరిగేందుకు ఆస్కారం ఉంది.

Best Mobiles in India

English summary
National Telecom Policy draft is out. Under the proposed guidelines, licensed telecom service providers such as Airtel, Idea, Reliance Jio, Vodafone and others will now be able to provide app-based voice calling services over Wi-Fi.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X