మొబైల్ వీడియో బ్లాగర్స్ కోసం కొత్త అప్లికేషన్స్

Posted By: Prashanth

మొబైల్ వీడియో బ్లాగర్స్ కోసం కొత్త అప్లికేషన్స్

 

చైనా ఇంటర్నెట్ టెలివిజన్ కంపెనీ 'యోకు' వీడియా బ్లాగర్స్(యోకు పైకీ) సపోర్టు చేసే ఐవోఎస్, ఆండ్రాయిడ్ అప్లికేషన్స్‌ని విడుదల చేసింది. ఈ కొత్త అప్లికేషన్స్ ప్రస్తుతం యోకు అనుసంధాన మొబైల్ క్లయింట్స్‌ ఉపయోగించుకునే విధంగా రూపొందిచారు. సోషల్ మీడియాకు వీడియో బ్లాగింగ్‌ని అనుసంధానం చేస్తే ప్రయోజాలు ఎలా ఉంటాయనే దానిని దృష్టిలో పెట్టుకోని.. సినా వెబియో మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌ని హైలెట్ చేస్తూ వీటిని రూపొందించారు.

ఆన్‌లైన్‌ వీడియో బ్లాగర్స్ తమకి నచ్చిన మరో వీడియో బ్లాగర్స్‌ని ఫాలో అయ్యేందుకు గాను కొత్తగా పైకీ అప్లికేషన్స్‌ని విడుదల చేసింది. కేవలం ఒకే ఒక్క టచ్ షేరింగ్‌తో సినా వెబియో మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ అయిన పైకీ వీడియోలో యూజర్స్ వీడియోస్‌ని అప్ లోడ్ చేయవచ్చని యోకు ఛీప్ టెక్నాలజీ ఆఫీసర్ 'జియన్ యో' తెలిపారు.

టెక్నాలజీ వేగంగా అభివృద్ది చెందుతుండడంతో స్మార్ట్ ఫోన్స్ మరింత పాపులర్ అవుతుండడం, ప్రతి ఒక్కరు కూడా హెచ్‌డి వీడియో కెమెరాలను వారియొక్క జేబులలో ఉండాలని కోరుకుంటున్నారు. దీంతో ఎవరైతే యోకు కస్టమర్స్ ఉన్నారో వారికి ది బెస్ట్ వీడియో చూసేటటువంటి అనుభవాన్ని ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే ఈ కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టామని అన్నారు. దీనితో పాటు మొబైల్ వీడియో షూటింగ్, అప్ లోడింగ్, షేరింగ్ యూజర్స్‌కు సాధ్యమైనంత సులభతరం చేయాలనే ఆలోచనలో ఉన్నామని తెలిపారు.

యూజర్స్ పర్సనల్ కంప్యూటర్స్‌కి తమయొక్క కెమెరాలతో కనెక్ట్ అవ్వకుండానే వారియొక్క వీడియో బ్లాగర్స్ సమాచారాన్ని ఇతరులతో పంచుకోవడానికి మొబైల్ పైకీ అప్లికేషన్స్ ఉపయోగపడతాయన్నారు. యోకు మొబైల్ క్లయింట్ అప్లికేషన్స్ మాదిరే యూజర్స్‌కు బెస్ట్ వీడియో ఎక్స్ పీరియన్స్‌ని అందించనున్నాం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot