శామ్‌సంగ్ అపూర్వ సృష్టి!!

Posted By: Prashanth

శామ్‌సంగ్ అపూర్వ సృష్టి!!

 

దిగ్గజ బ్రాండ్ శామ్‌సంగ్ ఫ్లెక్సిబుల్ ఆమోల్డ్ డిస్‌ప్లేలను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో వేదికగా ప్రదర్శించబడిన వీటిని ఈ ఏడాది క్వార్టర్ -2 నుంచి ఉత్పత్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఫ్లెక్సిబుల్ ఆమోల్డ్ డిస్‌ప్లేలుగా పిలవబడుతున్న వీటిని YOUM అనే బ్రాండ్ నేమ్‌తో శామ్‌సంగ్ ట్రేడ్‌మార్క్ చేసింది. ఇవే కాకుండా TAMOLED, PAMOLED, FAMOLED, WAMOLED అనే ట్రేడ్‌మార్క్ పేర్లను కంపెనీ ఫైల్ చేసింది.

శామ్‌సంగ్ రూపొందిస్తున్న ఆమోల్డ్ డిస్‌ప్లే స్ర్కీన్‌లలో గ్లాస్ ఉండదు. దానికి బదులుగా టీఎఫ్టీ ఫిల్మ్, ఎన్‌క్యాప్ ఫిల్మ్, ఆర్గానిక్ లేయర్, పోలరైసర్ పదార్థాలను ఉపయోగిస్తారు. YOUM డిస్‌ప్లేలు పల్చటి, తేలికపాటి ఇంకా అన్బ్రేకబుల్ తత్వాన్ని కలిగి ఉంటాయి. రాబోతున్న శామ్‌సంగ్ గ్యాడ్జెట్‌లలో ఈ డిస్‌ప్లేలను మనం చూడొచ్చు.

ఎల్‌జీ రూపకల్పన ఎలక్ట్రానిక్ పేపర్ డిస్‌ప్లే:

పల్చని పొరతో కూడిన LCDలను రూపొందించటంలో ఎల్‌జీడి (ఎల్‌జీ డిస్‌ప్లే) సంస్థ క్రియాశీలక పాత్రపోషిస్తోంది. తాజాగా ఈ బ్రాండ్ తొలి ప్లాస్టిక్ ఎలక్ట్రానిక్ పేపర్ డిస్‌ప్లే (ఇపీడీ)లను ఇ-బుక్స్ కోసం తయారు చేసింది. ఈ – ఇంక్ ఆధారిత ఎలక్ట్రానిక్ పేపర్ డిస్‌ప్లే పరిమాణం 6 అంగుళాలు. రిసల్యూషన్ 1024 x 768పిక్సల్స్. ఈ సరికొత్త ప్లాస్టిక్ ఎలక్ట్రానిక్ డిస్‌ప్లే ఈ-బుక్ మార్కెట్లో విప్లవాత్మక మార్పులు తేనుందని విశ్లేషకుల అంచనా. ఈ ఫ్లెక్సిబుల్ డిస్‌ప్లేలను రానున్న ఈ-బుక్ రీడర్లలో ఉపయోగించనున్నారు. ఈ డిస్‌ప్లే ఆధారిత గ్యాడ్జెట్‌లు వచ్చే నెల నుంచి యూరప్‌లో లభ్యం కానున్నాయి. ఈ సరికొత్త డిస్‌ప్లే పేపర్‌లో చదివిన అనుభూతిని మీకు కలిగిస్తుంది. ఈ ఫ్లెక్సిబుల్ డిస్‌ప్లే‌ను 40డిగ్రీల వరకు వంచవచ్చు. అంతేకాదండోయ్. ఈ డిస్‌ప్లే కిందపడినా పెద్ద ప్రమాదమేమి ఉండదు. కంటి రుగ్మతలను తగ్గిస్తుంది. తక్కువ విద్యుత్‌ను ఖర్చుచేస్తుంది. ధర కూడా తక్కువే.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot