ఆ ఇద్దరు...!

Posted By: Staff

ఆ ఇద్దరు...!

ఇండియా యువ అప్లికేషన్ డెవలపర్లుగా గుర్తింపుతెచ్చుకున్నఅన్నదమ్ములు సంజయ్, శ్రావణ్‌లు త్వరలో తమ సొంత పరిజ్ఞానంతో రూపొందించబడిన టాబ్లెట్ పీసీని ఆవిష్కరించనున్నారు. వీళ్లు స్థాపించిన గోడైమెనిషన్ సంస్థకు 12ఏళ్ల శ్రావణ సహ వ్యవస్థాపకుడు మరియు అధ్యక్షడు కాగా, 10ఏళ్ల సంజయ్ సహ వ్యవస్థాపకుడు మరియు సీఈవోగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికి వీరు వృద్ధి చేసిన మూడు అప్లికేషన్‌లను ఆపిల్ ఎంపిక చేసి.. ఐప్యాడ్, ఐఫోన్‌లలో డౌన్‌లోడింగ్‌కి పెట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ అప్లికేషన్‌లను ఇప్పటి వరకు 10,000 మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు.

పర్యావరణం అదేవిధంగా వయసుమళ్లిన వారికి ఉపయోగపడే విధంగా మరిన్ని లైఫ్‌స్టైల్ అప్లికేషన్‌లను వృద్ధిచేస్తున్నట్లు ఈ యువకిరణాలు పేర్కొన్నారు. స్టీవ్‌జాబ్స్, బిల్‌గేట్స్ వంటి టెక్ దిగ్గజాలను ఆదర్భంగా తీసుకుని దూసుకుపోతున్న ఈ బాల మేధావులు గోషీట్ (GoSheet)పేరుతో ఉత్తమ శ్రేణి టాబ్లెట్ పీసీని వృద్ధి చేస్తున్నారు. రెండు వైపులా స్ర్కీన్‌లను కలిగి ఉండే ఈ కంప్యూటింగ్ గ్యాడ్జెట్ టచ్ ఆధారితంగా స్పందిస్తుందని వీరు వెల్లడించారు.

తండ్రి కుమారన్ ఐటీ నిపుణుడు:

వీరి తండ్రి అయిన కుమారన్ వృత్తిరిత్యా ఐటీ నిపుణులు కావటంతో తన పిల్లలకు చిన్నతనం నుంచే కంప్యూటర్ పట్ల అవగాహన కల్పించాడు. దింతో కంప్యూటింగ్‌ను హబీగా ఎంచుకున్న ఈ యువ హిరోలు టెక్నాలజీ విభాగంలో రాణించగలుగుతున్నారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting