డెబిట్, క్రెడిట్ కార్డులను వెంటనే వాడండి, లేకుంటే పనిచేయవు

By Gizbot Bureau
|

మీకు డెబిట్‌, క్రెడిట్‌ కార్డులున్నాయా? అయితే వాటిని వెంటనే ఆన్‌లైన్‌ లావాదేవీల కోసం ఉపయోగించండి. లేకపోతే ఇకపై మీరు ఈ కార్డులతో ఆన్‌లైన్‌ లావాదేవీలు చేసే అవకాశం ఉండదు. ఒక్కసారి కూడా ఆన్‌లైన్‌ లావాదేవీల కోసం కార్డులను వినియోగించుకోకపోతే మార్చి 16 నుంచి ఆన్‌లైన్‌, కాంటాక్ట్‌లెస్‌ లావాదేవీలకు ఈ కార్డులు (Credit And Debit Cards Alert) పని చేయవు. డెబిట్‌/క్రెడిట్‌ (Credit, Debit cards) లావాదేవీల భద్రత పెంపులో భాగంగా ఇటీవల రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (Reserve Bank of India) ఈ ఏడాది జనవరి 20న ఓ నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే.

ఆన్‌ లైన్‌ లావాదేవీల కోసం
 

ఆన్‌ లైన్‌ లావాదేవీల కోసం

ఈ క్రమంలోనే వాడకంలోలేని డెబిట్/ క్రెడిట్ కార్డులను బ్లాక్ చేయనున్నట్లు తెలిపింది. ఆన్‌ లైన్‌ లావాదేవీల కోసం మీ దగ్గరున్న డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డులను ఇప్పటి దాకా వాడకపోయినట్లైతే ఈనెల 16 నుంచి అవి పనిచేయవని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది.

మార్చి 16లోగా వినియోగించని కార్డులను

మార్చి 16లోగా వినియోగించని కార్డులను

మార్చి 16లోగా వినియోగించని కార్డులను నిరుపయోగం చేయాలని బ్యాంకర్లను కార్డు మంజూరుదారులను ఆదేశించింది. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌(RFID) టెక్నాలజీ ఆధారంగా డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డుల లావాదేవీలు పెరిగిపోతుండగా..ఈ సేవల్లో ఎలాంటి మోసాలకు తావులేకుండా వినియోగదారుల కోసం RBI అనేక సెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకుంటున్నది.

పేమెంట్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007

పేమెంట్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007

ఇందులో భాగంగా ఈ నెల 16 నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వాడని కార్డులు పనిచేయవని మరోసారి రిజర్వ్ బ్యాంక్ తెలిపింది.పేమెంట్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007లోని సెక్షన్ 10 (2) ప్రకారం ఆర్ బిఐ ఈ నోటిఫికేషన్ జారీ చేసింది.

వైఫై సింబల్
 

వైఫై సింబల్

ఇదిలా ఉంటే ఈ మధ్య క్రెడిట్ కార్డులు వైఫై సింబల్ తో వస్తున్నాయి. ఈ స్మార్ట్ కార్డులను స్వైసింగ్ మిషన్లలో గీకాల్సిన అవసరం లేకుండా జస్ట్ పైన పెట్టి స్కాన్ చేస్తే చాలు, రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా పేమెంట్ పూర్తి అవుతుంది. కొన్ని చోట్ల క్యూఆర్ స్కాన్ లాంటి మెషిన్ తో కూడా లావాదేవీలు జరిపే వీలుంది. వీటినే కాంటాక్ట్ లెస్ లావాదేవీలు అంటారు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Never used your credit/debit cards for online purposes? They'll be disabled by 16 March

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X