Home
News

ఫేస్‌బుక్ ఫోటోలతో నీలి చిత్రాల రంజు

By Hazarath

ఫేస్‌బుక్ ఫోటోలతో నీలి చిత్రాల రంజు..టైటిల్ కొత్తగా ఉందనుకుంటున్నారా..టైటిలే కాదు..స్టోరీ కూడా కొత్తగానే ఉంటుంది. ఫేస్ బుక్ లో అందమైన ఫోటోలు కనిపిస్తే చాలు వాటిని నీలిచిత్రాలకు వాడుకుంటున్నారట..ముఖ్యంగా అందమైన అమ్మాయిల ఫోటోలను పోర్న్ మూవీస్ సైట్లు కష్టమర్ల కోసం పెడుతున్నాయని సర్వేలో తేలింది. మరి ఫేస్‌బుక్‌లో ఇప్పటికే చాలా మంది తమ ఫోటోలను అప్‌లోడ్ చేస్తున్నారు. అవన్నీ నీలి చిత్రాలవైపే వెళుతున్నాయని సర్వే చెబుతోంది.

సోషల్ మీడియా ఫేస్‌బుక్‌లో చక్కని ఫొటోలు

సోషల్ మీడియా ఫేస్‌బుక్‌లో చక్కని ఫొటోలు

సోషల్ మీడియా ఫేస్‌బుక్‌లో చక్కని ఫొటోలు పోస్టు చేయడం చాలామందికి ఆనందాన్ని కలిగిస్తుంది. నిత్యం సెల్ఫీలతోపాటు ఆనందకరమైన అనుభూతులకు సంబంధించిన ఎన్నో ఫొటోలను ఈ మధ్య అమ్మాయిలు కూడా ఫేస్‌బుక్‌లో పోస్టు చేస్తున్నారు.

 ఫేస్‌బుక్‌లో యువతులు పెడుతున్న అందమైన ఫొటోలను

ఫేస్‌బుక్‌లో యువతులు పెడుతున్న అందమైన ఫొటోలను

అయితే, ఫేస్‌బుక్‌లో యువతులు పెడుతున్న అందమైన ఫొటోలను కొందరు నీచులు దారుణంగా దుర్వినియోగం చేస్తున్నారు. వారి ఫొటోలను కాపీ చేసుకొని.. మార్ఫింగ్ చేసి.. ఆన్‌లైన్‌ సెక్స్ చాటింగ్, పోర్నోగ్రఫీ (బూతు సినిమాల) ప్రమోషన్స్ కోసం ఉపయోగించుకుంటున్నారు.

ఓ ఆంగ్ల దినపత్రిక నిర్వహించిన పరిశోధనలో

ఓ ఆంగ్ల దినపత్రిక నిర్వహించిన పరిశోధనలో

ఓ ఆంగ్ల దినపత్రిక నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. అయితే, ఈ నీచ గ్రూపుల ఆట కట్టించడానికి ఎథికల్ హ్యాకర్స్ కూడా తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. భారత్‌లో అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్ చేసి దుర్వినియోగం చేస్తున్న చాలా అకౌంట్లకు ఎథికల్‌ హ్యాకర్స్ ఇప్పటికే చెక్ పెట్టారు.

స్మార్ట్‌ఫోన్లతో బహిరంగ ప్రదేశాల్లో కనిపించే అమ్మాయిల ఫొటోలు

స్మార్ట్‌ఫోన్లతో బహిరంగ ప్రదేశాల్లో కనిపించే అమ్మాయిల ఫొటోలు

సోషల్ మీడియాలో అమ్మాయిల ఫొటోలు కాపీ చేయడమే కాదు.. ఈ కిరాతక మూకలు కెమెరాలు, స్మార్ట్‌ఫోన్లతో బహిరంగ ప్రదేశాల్లో కనిపించే అమ్మాయిల ఫొటోలు తీసి.. వాటిని ఆన్‌లైన్‌లో తమ పోర్న్ సైట్ల కోసం వాడుకుంటున్నారు.

ఇప్పటికే భారత్‌లో 40 మంది మహిళా యూజర్లు

ఇప్పటికే భారత్‌లో 40 మంది మహిళా యూజర్లు

ఇప్పటికే భారత్‌లో 40 మంది మహిళా యూజర్లు ఈ ఇలాంటి సైబర్‌ నేరాల బారిన పడినట్టు నిపుణులు వెల్లడించారు. 'ఆన్‌లైన్‌లో ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద ముప్పు ఇదే. సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియాలోని మహిళా యూజర్ల ఫొటోలు కాపీ చేసుకొని భద్ర పరుచుకుంటున్నారు.

సెక్స్ చాటింగ్‌కు నెటిజన్లను ఆకర్షించడం కోసం

సెక్స్ చాటింగ్‌కు నెటిజన్లను ఆకర్షించడం కోసం

సెక్స్ చాటింగ్‌కు నెటిజన్లను ఆకర్షించడం కోసం అందమైన యువతుల ఫొటోలు వారు వాడుతున్నారు. ఇలాంటి పేజీలెన్నో సోషల్ మీడియాలో క్రియాశీలంగా ఉన్నాయి. అయినా పోలీసులు పెద్దగా చర్యలు తీసుకున్నట్టు కనిపించడం లేదు' అని ఢిల్లీ, నోయిడా పోలీసులతో కలిసి పనిచేసిన ఓ సైబర్ నిపుణుడు తెలిపారు.

అందమైన యువతుల ఫొటోలను కొన్నిసార్లు

అందమైన యువతుల ఫొటోలను కొన్నిసార్లు

అందమైన యువతుల ఫొటోలను కొన్నిసార్లు మార్ఫింగ్ చేయడం లేదా ఒరిజినల్ చిత్రాలను వాడుకొని ఈ గ్రూపులు సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు సృష్టిస్తున్నారు. వీటిద్వారా పెయిడ్‌ పోర్న్‌ సైట్లలో యూజర్లు చేరేవిధంగా ప్రోత్సహిస్తున్నారు.

కొన్ని సందర్భాల్లో ఈ ఫొటోలతో బాధిత మహిళలను

కొన్ని సందర్భాల్లో ఈ ఫొటోలతో బాధిత మహిళలను

కొన్ని సందర్భాల్లో ఈ ఫొటోలతో బాధిత మహిళలను బెదరించి డబ్బు వసూలు చేయడం కూడా చోటుచేసుకుంటోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఫొటోలు పెట్టే విషయంలో మహిళలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని నిపుణులు సూచిస్తున్నారు.

ఫోటోలను చూసి అప్ లోడ్ చేసుకోవడం

ఫోటోలను చూసి అప్ లోడ్ చేసుకోవడం

సో ఎవరైనా ఫోటోలను చూసి అప్ లోడ్ చేసుకోవడం చాలా మంచిది. దీని వల్ల వారి నుంచి మనం మన ఫోటోల్ని కాపాడుకోవచ్చని నిపుణులు తెలుపుతున్నారు.

Best Mobiles in India

English summary
Here Write your facebook photos could be used to promote online porn
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X