రానున్న రోజుల్లో ఫ్రీ ఇన్ కమింగ్ కాల్స్ అనే మాటను మర్చిపోండి

|

దేశీయ టెలికాం రంగంలో రోజురోజుకు ఆసక్తి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.లైఫ్ లాంగ్ ఇన్ కమింగ్ కాల్స్ ఉచిత సదుపాయానికి టెలికాం సంస్థలు రద్దు చేయబోతున్నాయి. రాబోయే రోజుల్లో అవుట్ గోయింగ్ తో పాటు ఇకపై ఇన్ కమింగ్ కాల్స్ రావాలంటే ప్రత్యేక రీఛార్జ్ ప్యాక్ వేసుకునేలా కంపెనీలు ప్రణాళికలను రూపొందిస్తున్నాయి. కనిష్టంగా రూ.35తో రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల పాటు ఇన్ కమింగ్ కాల్స్ వచ్చేలా ప్యాక్లను విడుదల చేస్తున్నాయి.ఎయిర్టెల్ ఇప్పటికే ఈ దిశగా అడుగులు వేసి రూ.35,రూ.65,రూ.95 ప్యాక్లను విడుదల చేసింది.

Neighbourly యాప్‌తో మీరు కూడా పక్కా లోకల్ అయిపోతారు!

రూ.35 ప్లాన్...
 

రూ.35 ప్లాన్...

ఈ రూ.35 ప్లాన్ ను రీఛార్జి చేసుకుంటే వినియోగదారుడికి 100MB డేటా తో పాటు 26.6 టాక్ టైమ్ లభిస్తుంది.అలాగే ఇన్ కమింగ్ కాల్స్ కి 1p/sec పడుతుంది.ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే

రూ.65 ప్లాన్...

రూ.65 ప్లాన్...

ఈ రూ.65 ప్లాన్ ను రీఛార్జి చేసుకుంటే వినియోగదారుడికి 200MB డేటా తో పాటు 65 టాక్ టైమ్ లభిస్తుంది.అలాగే ఇన్ కమింగ్ కాల్స్ కి 1p/sec పడుతుంది.ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే

రూ.95 ప్లాన్...

రూ.95 ప్లాన్...

ఈ రూ.95 ప్లాన్ ను రీఛార్జి చేసుకుంటే వినియోగదారుడికి 500MB డేటా తో పాటు 95 టాక్ టైమ్ లభిస్తుంది.అలాగే ఇన్ కమింగ్ కాల్స్ కి 1p/sec పడుతుంది.ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే.

ఎయిర్టెల్ లేటెస్ట్ గా ఏడాది పాటు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉచితంగా ఇస్తుంది...
 

ఎయిర్టెల్ లేటెస్ట్ గా ఏడాది పాటు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉచితంగా ఇస్తుంది...

ఎయిర్‌టెల్ ఈ మధ్యనే పోస్ట్ పెయిడ్ యూజర్ల కోసం అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందించిన సంగతి అందరికీ తెలిసిందే. యూజర్లు రూ.499 ప్లాన్ వేసుకోవడం ద్వారా ఈ ఆఫర్ ని పొందవచ్చు. అయితే ఇప్పుడు అదే ఊపులో యూజర్ల కోసం ఎంట్రీ లెవల్ ప్లాన్లో కూడా అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌ను ఏడాది పాటు ఉచితంగా అందించేందుకు రెడీ అయింది. యూజర్లు రూ.399 ప్లాన్ ద్వారా ఈ ఉచిత ఆఫర్ పొందవచ్చు. వొడాఫోన్, బీఎస్‌ఎన్‌ఎల్ తరహాలోనే ఎంట్రీ లెవల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌తో అదనపు డేటా బెనిఫిట్స్‌తో పాటు రూ.999 విలువ గల అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌ను వినియోగదారుల కోసం ప్రకటించింది.

రూ.399తో రీఛార్జ్ చేసుకుంటే...

రూ.399తో రీఛార్జ్ చేసుకుంటే...

అదనపు బెనిఫిట్స్‌లో భాగంగా పోస్ట్‌పెయిడ్ కస్టమర్లు రూ.399తో రీఛార్జ్ చేసుకుంటే నెలకు 40జీబీ హైస్పీడ్ 3జీ/4జీ డేటా పొందడంతో పాటు 200జీబీ వరకు డేటా కూడా రోల్‌ఓవర్ అవుతుంది.

ఎయిర్‌టీవీ సబ్‌స్క్రిప్షన్, వింక్ మ్యూజిక్‌ను...

ఎయిర్‌టీవీ సబ్‌స్క్రిప్షన్, వింక్ మ్యూజిక్‌ను...

అపరిమిత కాల్స్, ఎస్సెమ్మెస్‌లతో పాటు ఎయిర్‌టీవీ సబ్‌స్క్రిప్షన్, వింక్ మ్యూజిక్‌ను ఎయిర్‌టెల్ ఉచితంగా ఆఫర్ చేస్తోంది. చివరగా సబ్‌స్ర్కైబర్లు రూ.51 విలువ గల అమెజాన్ పే గిఫ్ట్ కార్డ్‌ను కూడా పొందుతారు.

బిల్లులపై రూ.50 డిస్కౌంట్....

బిల్లులపై రూ.50 డిస్కౌంట్....

తొలి ఆరు నెలల పాటు చెల్లించే బిల్లులపై రూ.50 డిస్కౌంట్ కూడా ఇస్తోంది. దీంతో ఈ ప్లాన్‌లో భాగంగా చెల్లించే మొత్తం కేవలం 349 రూపాయలు మాత్రమేనని సంస్థ వెల్లడించింది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Your free incoming calls facility may stop soon, telcos all set to shock you.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X