ముగస్తున్న జియో ప్రైమ్ గడువు, మరో మ్యాజిక్ దిశగా జియో !

Written By:

దేశీయ టెలికాం రంగంలోకి దూసుకొచ్చిన అనతి కాలంలోనే టాప్ స్థాయికి దూసుకొచ్చిన రిలయన్స్ జియో సరికొత్త ఆఫర్లతో మార్కెట్లోని మిగతా దగ్గజాలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. జియో నుంచి వచ్చే ప్రతి ఆఫర్ కి కౌంటర్ వేస్తూ టెలికాం దిగ్గజాలు తమ వినియోగదారులను చేజారిపోకుండా కాపాడుకుంటున్నాయి. అయినప్పటికీ జియ తన సంఖ్యను రోజురోజుకు పెంచుకుంటూనే పోతోంది. ఇప్పటికే 160 మిలియన్లకు పైగా కస్టమర్లతో దూసుకుపోతున్న జియో ఈ సంఖ్యను ఇంకా పెంచేందుకు కసరత్తు చేస్తోంది. అయితే ఇప్పుడు జియో ప్రైమ్ మెంబర్ షిప్ గడువు ఈ నెలాఖరుతో ముగిసిపోతుండటంతో యూజర్లు సందిగ్ధావస్థలో పడ్డారు. మరి జియో తరువాత మ్యాజిక్ చేస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

రూ. 2 వేలకే 4జీ స్మార్ట్‌ఫోన్, ఆ యూజర్లకి మరో బంపరాఫర్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సరిగ్గా ఏడాది పాటు..

గతేడాది జియో ప్రైమ్ మెంబర్‌షిప్‌ను రూ.99కి వినియోగదారుల ముందుకు తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. సరిగ్గా ఏడాది పాటు దీనిపై పలు ప్రయోజనాలు అందించనున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం జియో ప్రకటించిన ఆ ఏడాది గడువు పూర్తి కావొస్తోంది. మరికొన్ని రోజుల్లో అంటే ఈ నెల చివరికి ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ గడువు తీరిపోతుంది.

ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ను పొడిగిస్తారా..

దీంతో ఇప్పుడు యూజర్లు అయోమయంలో పడినట్లు తెలుస్తోంది. తరువాత కూడా ఈ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ను పొడిగిస్తారా లేదా మరేదైనా ప్లాన్‌ తీసుకొస్తారా అని జియో యూజర్లందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

రూ.10వేల విలువైన జియో యాప్స్ కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌ను..

కాగా ఇప్పటి వరకు జియో ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ ఉన్నవారికి అదనపు మొబైల్ డేటాతోపాటు రూ.10వేల విలువైన జియో యాప్స్ కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌ను రిలయన్స్‌ జియో ఏడాది పాటు ఉచితంగా అందిస్తూ వచ్చింది .

160 మిలియన్‌కు పైగా కస్టమర్లు

ప్రస్తుతం జియో కంపెనీకి 160 మిలియన్‌కు పైగా కస్టమర్లున్నారు. వారిలో 80 శాతం మంది జియో ప్రైమ్‌ను సబ్‌స్క్రైబ్‌ చేసుకున్న వారే. మరింత మంది కస్టమర్లను ఆకట్టుకోవడానికి ముఖేష్‌ అంబానీ మరేదైనా మ్యాజిక్‌ చేయనున్నారా? అని కూడా టెలికాం వర్గాలు చర్చించుకుంటున్నాయి.

రూ.99కే మరో ఏడాదిపాటు పొడిగించే అవకాశం

అయితే జియో కంపెనీ, పార్టనర్ల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం జియో ప్రైమ్ మెంబర్‌షిప్ గడువును రూ.99కే మరో ఏడాదిపాటు పొడిగించే అవకాశముందని తెలుస్తోంది. ఇప్పటి వరకు జియో ప్రైమ్‌ కింద అందిస్తున్న ప్రయోజనాలను మరో ఏడాది పాటు అందిస్తుందని చెబుతున్నారు.

ఎలాంటి సమాచారం లేనప్పటికీ..

ఇంకా దీనిపై ఎలాంటి సమాచారం లేనప్పటికీ, మార్చి చివరి వారంలో బిగ్‌ సర్‌ప్రైజే ఉండొచ్చని జియో వర్గాలంటున్నాయి. జియో ట్రాక్‌ రికార్డును పరిశీలిస్తే, తన ప్రైమ్‌ మెంబర్లకు ఎప్పడికప్పుడు కంపెనీ సర్‌ప్రైజింగ్‌ ఆఫర్లనే ప్రవేశపెట్టిందని, కస్టమర్లను కాపాడుకోవడానికి ఈ సారి అలానే సర్‌ప్రైజ్‌ చేయొచ్చని జియో పార్టనర్లు, స్టోర్లు అభిప్రాయ వ్యక్తంచేస్తున్నాయి.

ప్రైమ్ మెంబర్‌షిప్‌పై ..

మరికొందరు జియో ప్రైమ్ మెంబర్‌షిప్ గడువు పెంపు ఏమీ ఉండదని, కానీ జియో యాప్స్‌ను వాడితే చార్జి వసూలు చేసే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ప్రైమ్ మెంబర్‌షిప్‌పై జియో మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Your Jio Prime Expires This Month, What To Expect Next More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot