లేటెస్ట్ ఐఫోన్ 11ని రూ. 51,700కి సొంతం చేసుకోవడం ఎలా ?

By Gizbot Bureau
|

దిగ్గజ సాఫ్ట్‌వేర్ సంస్థ ఆపిల్ ఇటీవలే విడుదల చేసిన ఐఫోన్ 11, 11ప్రొ, 11ప్రొ మ్యాక్స్ ఫోన్లకు భారత్‌లో ప్రి-ఆర్డర్లు షురూ అయ్యాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, పేటీఎం మాల్ సహా ఆపిల్ ఆథరైజ్డ్ రీసెల్లర్లు ప్రి-ఆర్డర్లను రిసీవ్ చేసుకుంటున్నారు. కాగా వినియోగదారులు హెచ్‌డీఎఫ్‌సీ కార్డులను ఉపయోగించి ఐఫోన్ 11, 11ప్రొ ఫోన్లను కొంటే రూ.6వేల వరకు, 11 ప్రొ మ్యాక్స్‌ను కొనుగోలు చేస్తే రూ.7వేల డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ఐఫోన్ 11 ప్రారంభ ధర రూ.64,900 ఉండగా, 11 ప్రొ ప్రారంభ ధర రూ.99,900గా ఉంది. అలాగే ఐఫోన్ 11 ప్రొ మ్యాక్స్‌ను రూ.1,09,900 ప్రారంభ ధరకు విక్రయిస్తున్నారు. ఇక ఈ నెల 27వ తేదీ నుంచి ఐఫోన్ 11 ఫోన్ల‌తోపాటు ఆపిల్ వాచ్ సిరీస్ 5 వాచ్‌లు వినియోగ‌దారుల‌కు ల‌భ్యం కానున్నాయి. మరీ ఈ ఫోన్ ని తక్కువ ధరకు ఎలా సొంతతం చేసుకోవాలో చూద్దాం.

తగ్గింపు ఈ విధంగా పొందండి
 

తగ్గింపు ఈ విధంగా పొందండి

iPhone 11, the iPhone 11 Pro and the iPhone 11 Pro Max ఫ్రీ ఆర్డర్ స్వీకరిస్తున్నారు. మీరు ఫ్రీ ఆర్డర్ చేసే సమయంలో మీ పాత ఫోన్ మీద రూ. 7, 200 వరకు ఎక్స్చేంజ్ సదుపాయం ఉంది. ఇది మీరు అందించే పోన్ కండీషన్, మోడల్ మీద ఆధారపడి ఉంటుంది. దీంతో పాటుగా మీరు హెచ్‌డీఎఫ్‌సీ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేస్తే రూ.6వేల వరకు, 11 ప్రొ మ్యాక్స్‌ను కొనుగోలు చేస్తే రూ.7వేల డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో మినిమం 2000 రూపాయల ట్రాన్సిక్షన్ చేస్తే 5 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అలాగే ఇతర కంపెనీల కార్డుల మీద కూడా 5 శాతం వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు.

ఐఫోన్ 11 ప్రత్యేకతలు

ఐఫోన్ 11 ప్రత్యేకతలు

ఐఫోన్ 11లో 6.1 ఇంచుల ఎల్ఆర్ డిస్‌ప్లే ఉంది. 64/256/512 GB స్టోరేజ్ ఆప్షన్స్ కలిగి ఉంది. 12, 12 మెగాపిక్సల్ సామర్ష్యంతో ఈ బ్యాక్ సైడ్ రెండు కెమెరాలు కలిగి ఉంటాయి. ఫోటోలు, వీడియోల కోసం అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి. ఫ్రంట్‌లో 12 మెగా ఫిక్సల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఇందులో 4GB రామ్‌తో పాటు 3110 Mah కెపాసిటీ కలిగిన బ్యాటరీని ఏర్పాటు చేసారు. దీంతో ఐఫోన్ 11 బ్యాటరీ బ్యాకప్ గత ఐఫోన్ల కంటే ఎక్కువ వస్తుంది. శబ్దనాణ్యత కోసం డోల్బీ అట్మాస్ విధానం ఉపయోగించారు. బ్లాక్, గ్రీన్, ఎల్లో, పర్పుల్, వైట్, రెడ్ కలర్లలో లభిస్తుంది. ఇఫ్పటి వరకు ఐఫోన్‌లో లేని అత్యధిక స్పష్టమైన వీడియోలు తీయవచ్చు. అత్యంత వేగంతో పని చేసే ఏ13 బయోనిక్ సీపీయూ, వేగంగా పని చేసే జీపీయూ, ఐఫోన్ టెన్ఆర్ కంటే గంట అదనపు బ్యాటరీ. అత్యంత వేగంగా ముఖం గుర్తించే కెమెరా. 64GB ఐఫోన్ 11 ధర 699 డాలర్లు.

ఐఫోన్ 11ప్రో ప్రత్యేకతలు
 

ఐఫోన్ 11ప్రో ప్రత్యేకతలు

ఐఫోన్ 11ప్రోలో 5.8 ఇంచుల డిస్ ప్లే. మిడ్ నైట్ గ్రీన్, స్పేస్ గ్రే, సిల్వర్/వైట్, గోల్డ్ రంగుల్లో ఇది లభ్యమవుతుంది. 40 శాతం తక్కువ విద్యుత్ వినియోగం, ఐఫోన్ టెన్ఎస్ కంటే 4 గంటల అదనపు బ్యాటరీ. వెనుకవైపు సింగిల్ పీస్ గ్లాస్, స్టెయిన్‌లెస్ స్టీల్. 3 బ్యాక్ కెమెరాలు. డోల్బీ అట్మోస్ శబ్దం, సెకనుకు లక్ష కోట్ల ఆపరేషన్లు జరిపే సీపీయూ. 128GB ఐఫోన్ 11ప్రో ధర 999 డాలర్లు.

హువాయి దెబ్బకు తగ్గిన ఆపిల్ అమ్మకాలు 

హువాయి దెబ్బకు తగ్గిన ఆపిల్ అమ్మకాలు 

ఇదిలా ఉంటే అమెరికా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం ఆపిల్‌కు చైనా స్మార్ట్‌ఫోన్‌ కంపెనీల సెగ బాగా తగులుతోంది. ఆపిల్‌ ఐఫోన్‌ హువాయి రాకతో కాస్త తడబడినట్లు తెలుస్తోంది.చైనీస్‌ మార్కెట్లో విడుదలయిన ఐఫోన్‌11 అమ్మకాలలో కాస్త వెనుకంజ వేసినట్లు తెలుస్తోంది. చైనా చవక బ్రాండ్లయిన వివో, ఒప్పోలు ప్రపంచ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో ప్రభావం చూపుతున్నా ఆపిల్‌ అమ్మకాలు పడిపోవడానికి హువాయి ముఖ్యకారణంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే, న్యూషిప్‌మెంట్‌ రిపోర్ట్‌ 2019 ప్రకారం మొదటి క్వార్టర్‌లో ఆపిల్‌ అమ్మకాలు చైనాలో 30శాతం మేర తగ్గినట్లు నివేదిక స్పష్టం చేస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Your New Apple iPhone 11 Could Cost As Little as Rs 51,700 With Amazon Preorder Offers

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X