త్వరలో చిప్‌తో కూడిన ఈ-పాస్ పోర్టులు,పుస్తకాలు కనపడవు

By Gizbot Bureau
|

పాస్‌పోర్టు అంటే ఇప్పటివరకు పుస్తకాల రూపంలోనే చూస్తున్నాం. ఇకపై పుస్తకాలు కనిపించవు. త్వరలోనే ఈ-పాస్ పోర్టులు రానున్నాయి. చిప్ రూపంలో వీటిని తీసుకురానున్నారు. సమీప భవిష్యత్‌లో అధునాతన భద్రతా అంశాలు కలిగిన పాస్‌పోర్టులు అందించేందుకు గాను ఈ-పాస్‌పోర్టుల తయారీని తమ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిందని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌. జైశంకర్‌ సోమవారం తెలిపారు.

 
 Your next passport may have chip inside

7వ పాస్‌పోర్టు సేవా దివాస్‌ సందర్భంగా ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పౌరులకు చిప్‌తో కూడిన ఈ-పాస్‌పోర్టులు జారీ చేసేందుకు సంబంధిత ప్రాజెక్టుపై ''ఇండియా సెక్యూర్టీ ప్రెస్‌''తో మంత్రిత్వ శాఖ చర్చించను న్నదని తెలిపారు.ఆధునిక భద్రతా ప్రయోజనాలతో కూడిన పాస్ పోర్టులు అందుబాటులోకి తేవాలన్నదే లక్ష్యమన్నారు.

 ఇండియా సెక్యూర్టీ ప్రెస్‌

ఇండియా సెక్యూర్టీ ప్రెస్‌

జూన్ 25,2019న 7వ పాస్‌పోర్టు సేవా దివస్ కార్యక్రమంలో చిప్‌తో కూడిన ఈ-పాస్‌పోర్టులు జారీ చేసేందుకు సంబంధిత ప్రాజెక్టుపై ''ఇండియా సెక్యూర్టీ ప్రెస్‌''తో మంత్రిత్వ శాఖ చర్చించనున్నదని మంత్రి జైశంకర్ వెల్లడించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్స్‌తో కూడిన పాస్‌పోర్టు బుక్‌లెట్ సమీప భవిష్యత్తులోనే అందుబాటులోకి రానుందని ఆయన చెప్పారు.

కొత్త పోస్టాఫీస్ పాస్‌పోర్టు సేవా కేంద్రాలు

కొత్త పోస్టాఫీస్ పాస్‌పోర్టు సేవా కేంద్రాలు

ప్రభుత్వం గత దఫా పాలన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్స్‌తో కూడిన పాస్‌పోర్టు బుక్‌లెట్ సమీప భవిష్యత్తులోనే అందుబాటులోకి రానుందని ఆయన చెప్పారు. అలాగే కొత్త పోస్టాఫీస్ పాస్‌పోర్టు సేవా కేంద్రాలు (పీఓపీఎస్‌కే) ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్న విధానాన్ని సైతం ప్రభుత్వం కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి అవసరమైన లాంఛనాలన్నింటినీ కేంద్ర విదేశీ మంత్రిత్వ శాఖ, సమాచార మంత్రిత్వ శాఖ సమన్వయంతో పూర్తి చేస్తున్నాయని, ఇప్పటికే ప్రకటించిన చోట్ల పీఓపీఎస్‌కేలను ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు.

412 పీఓపీఎస్‌కేలు
 

412 పీఓపీఎస్‌కేలు

గత ఐదేళ్లలో పాస్‌పోర్టు విధానంలో ఓ సమగ్ర ఉద్యమాన్నే తీసుకువచ్చామన్నారు. మంచి పాలనతోబాటు పారదర్శకత, నిపుణత, సమయపాలన, నమ్మకం, హామీ, బాధ్యతతో కూడిన పౌర సేవలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. 2017 నుంచి ఇప్పటి వరకు 412 పీఓపీఎస్‌కేలు ఏర్పాటు చేసినందుకు కేంద్ర సమాచార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

 పోలీస్ వెరిఫికేషన్ సమయం

పోలీస్ వెరిఫికేషన్ సమయం

93 కొత్త పాస్‌పోర్టు కేంద్రాలను సైతం ఏర్పాటు చేయగా అవి ప్రస్తుతం సేవలందిస్తున్నాయన్నారు. పాస్‌పోర్టుకు పోలీస్ వెరిఫికేషన్ సమయం సైతం 2018లో 19 రోజులకు తగ్గిందన్నారు. పనితీరులో జలంధర్ పాస్‌పోర్టు కార్యాలయం ప్రథమ బహుమతిని, కొచ్చిన్, కోయంబత్తూర్ పాస్‌పోర్టు కార్యాలయాలు ద్వితీయ, తృతీయ బహుమతులను గెలుచుకున్నాయని మంత్రి జైశంకర్ వివరించారు.

ఏడాదికి కోటికి పైగా పాస్ ‌పోర్టులు

ఏడాదికి కోటికి పైగా పాస్ ‌పోర్టులు

ఏడాదికి కోటికి పైగా పాస్ ‌పోర్టులు జారీ చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. పిఓపిఎస్‌కెలను త్వరగా ప్రారంభించేందుకు విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్‌ మంత్రిత్వ శాఖలు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నాయన్నారు.

Best Mobiles in India

English summary
Your next passport may have chip inside

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X