ఈ రోజు నుంచి పేటీఎమ్ Mobikwik పనిచేయవు, ఎందుకో తెలుసా..?

మీరు పేటీఎమ్, Mobikwikలో లావాదేవీలు జరుపుతున్నారా..అయితే అవి పనిచేస్తున్నాయా లేదా అని చెక్ చేసుకుని లావాదేవీల కోసం ప్రయత్నించడం మంచిది.

|

మీరు పేటీఎమ్, Mobikwikలో లావాదేవీలు జరుపుతున్నారా..అయితే అవి పనిచేస్తున్నాయా లేదా అని చెక్ చేసుకుని లావాదేవీల కోసం ప్రయత్నించడం మంచిది. ఎందుకంటే ఆర్‌బిఐ కఠిన రూల్స్ అమల్లోకి తీసుకొచ్చింది. ఫుల్‌ కేవైసీ(నో యువర్ కస్టమర్) విధివిధానాలను పూర్తి చేసయని కస్టమర్లకు లావాదేవీలుజరిపే అవకాశం లేదని చెబుతోంది. కేవలం ఫుల్‌ కేవైసీ(నో యువర్ కస్టమర్) విధివిధానాలను పూర్తి చేసిన కస్టమర్లకు మాత్రమే ఇది సాధ్యపడుతుందట. నేటి నుంచి రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా విధించిన కేవైసీ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. దీంతో వాలెట్‌ యూజర్లు తమ లావాదేవీలపై ఆర్‌బీఐ విధించే పలు నిబంధనలు ఎదుర్కోవాల్సి వస్తోంది. కాగా డిజిటల్‌ పేమెంట్స్‌ ఇండస్ట్రీకి గట్టి ఎదురుదెబ్బని టెక్ విశ్లేషకులు భావిస్తున్నారు.

జియోఫై మీద బంపరాఫర్, రూ. 3500 వరకు ప్రయోజనాలు..జియోఫై మీద బంపరాఫర్, రూ. 3500 వరకు ప్రయోజనాలు..

ఫిబ్రవరి 28 వరకు..

ఫిబ్రవరి 28 వరకు..

ఫిబ్రవరి 28 వరకు వాలెట్‌ యూజర్ల నుంచి కేవైసీ వివరాలను పొందాలని డిజిటల్‌ వాలెట్‌ కంపెనీలకు రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఆదేశించింది. కాగా ఈ గడువును మరింతగా పొడిగించాలని డిజిటల్‌ వాలెట్‌ కంపెనీలు కోరాయి.

కంపెనీల ప్రతిపాదనను

కంపెనీల ప్రతిపాదనను

కానీ కంపెనీల ప్రతిపాదనను ఆర్‌బీఐ తోసిపుచ్చింది. మరోసారి తుది గడువును పొడిగించేది లేదంటూ తేల్చిచెప్పింది. ప్రస్తుతం నిన్నటితో ఆ గడువు ముగియడంతో, కేవైసీ వివరాలను సమర్పించని కస్టమర్లను వాలెట్‌ ప్రొవైడర్లు కోల్పోతున్నారు.

ఫుల్‌ కేవైసీ వివరాలు లేకుండా..

ఫుల్‌ కేవైసీ వివరాలు లేకుండా..

అయితే ఫుల్‌ కేవైసీ వివరాలు లేకుండా 10 వేల రూపాయల వరకు ఆపరేట్‌ చేసుకునేలా డిజిటల్‌ వాలెట్లకు అనుమతి ఇ‍వ్వాలంటూ ఇండస్ట్రి బాడీ పేమెంట్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, రిజర్వు బ్యాంకును కోరుతోంది. కానీ ప్రతి పేమెంట్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ కేవైసీ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిదేనంటూ ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

ప్రభుత్వం ఆమోదించిన డాక్యుమెంట్లను..

ప్రభుత్వం ఆమోదించిన డాక్యుమెంట్లను..

ఆర్‌బీఐ నిబంధనలు ప్రకారం, ప్రభుత్వం ఆమోదించిన డాక్యుమెంట్లను వాలెట్‌ ప్రొవైడర్లకు సమర్పించిన కస్టమర్లు, తాజాగా ఫండ్స్‌ను తమ వాలెట్లలోకి వేసుకోవడం కుదరదు. అంతేకాక ఇతర వాలెట్లకు ఫండ్స్‌ ట్రాన్సఫర్‌ చేయలేరు. అయితే వాలెట్‌లో ఉన్న ఫండ్స్‌ను కొనుగోళ్లకు మాత్రమే ఉపయోగించుకోవచ్చు.

వాలెట్‌ నగదును కోల్పోకుండా

వాలెట్‌ నగదును కోల్పోకుండా

వాలెట్‌ నగదును కోల్పోకుండా.. వాటిని బ్యాంకులకు ట్రాన్సఫర్‌ చేసుకునేలా కూడా ఆర్‌బీఐ వీలు కల్పించింది. ప్రీపెయిడ్‌ వాలెట్‌ సర్వీసులను వినియోగిస్తున్న 90 శాతం కస్టమర్లు ఇప్పటి వరకు కేవైసీ వివరాలను వాలెట్‌ ప్రొవైడర్లకు సమర్పించలేదు. దీంతో నేటి నుంచి వీరిపై వాలెట్ల వాడక నిషేధం పడబోతుంది. ఈ చర్యలతో వాలెట్‌ ప్రొవైడర్లు భారీగా కస్టమర్లు కోల్పోనున్నారు.

చ్చే కొన్ని నెలల్లో..

చ్చే కొన్ని నెలల్లో..

ఈ నిబంధనలతో వచ్చే కొన్ని నెలల్లో కస్టమర్ల కూడా భారీగా ప్రభావితం కానున్నారని ది మొబైల్‌ వాలెట్‌ ఫౌండర్‌ వినయ్‌ కలాంత్రి అన్నారు. అయితే ఇది దీర్ఘకాలానికి మంచి ఫలితాలనే ఇస్తుందని చెప్పారు. క్వాలిటీ కస్టమర్లను వాలెట్లు పొందుతాయన్నారు.

Best Mobiles in India

English summary
Mobile wallets may not work from Thursday if KYC details have not been updated More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X