Just In
- 55 min ago ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- 55 min ago మరో వ్యక్తిని కాపాడిన ఆపిల్ స్మార్ట్‌వాచ్ ఫాల్ డిటెక్షన్ ఫీచర్.. ఏంటీ ఫీచర్.. ఎలా పనిచేస్తుంది?
- 2 hrs ago ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- 3 hrs ago Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్‌టాప్‌లు! ధర,స్పెసిఫికేషన్లు
Don't Miss
- News ఏపీ, తెలంగాణలో అత్యంత ధనవంతురాలు ఆమే
- Finance Elon Musk: ఎలోన్ మస్క్ పర్యటన వాయిదా..ఎందుకంటే..!
- Movies ‘సీరియల్స్‌లో తెలుగు వాళ్లను నీచంగా.. కన్నడ యాక్టర్ల ముందు పని వాళ్లకంటే హీనంగా’
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
డిసెంబరు 1, 2018 నుంచి ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు బంద్, SBI అలెర్ట్
ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్లు వెంటనే తమ మొబైల్ నెంబరును రిజిస్టర్ చేసుకోకపోతే డిసెంబరు 1, 2018 నుంచి ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు నిలిపివేయబడుతుంది అని ఎస్బీఐ తన వినియోగదారులను అలెర్ట్ చేసింది.
ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్లు వెంటనే తమ మొబైల్ నెంబరును రిజిస్టర్ చేసుకోకపోతే డిసెంబరు 1, 2018 నుంచి ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు నిలిపివేయబడుతుంది అని ఎస్బీఐ తన వినియోగదారులను అలెర్ట్ చేసింది. దీనికి సంబంధించిన ప్రకటనను వినియోగదారుల కోసం వెబ్సైట్లో పొందుపరిచింది. ఖాతాదారుల బ్యాంకింగ్ లావాదేవీలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్, ఈ మెయిల్ అలర్ట్‌ల ద్వారా యూజర్లకు తప్పనిసరిగా తెలియజేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) జులై 6, 2017లో అన్ని బ్యాంకులకు సర్క్యులర్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఎస్బీఐ నెట్‌బ్యాంకింగ్‌కు మొబైల్ నెంబరును రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా ఖాతాదారులకు సూచించింది.
వాహనదారులకు శుభవార్త... ఇప్పుడు సరికొత్త ఫీచర్లతో డ్రైవింగ్ లైసెన్స్
రిజిస్ట్రేషన్ ఇలా చెక్ చేసుకోండి ...
- ఎస్బీఐ అకౌంట్‌తో మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయి ఉందో తెలుసుకోవడానికి మొదటి నెట్ బ్యాంకింగ్‌లోకి లాగిన్ కావాలి.
- లాగిన్ అయిన తర్వాత బ్యాంకింగ్ హోంపేజీలో ‘My Account and Profile' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- అక్కడ ఉండే ప్రొఫెల్ ఆప్షన్స్‌పై క్లిక్ చేసి.. ‘Personal Details/Mobile' పై క్లిక్ చేయాలి.
- అప్పుడు ప్రొఫైల్ పాస్వర్డ్ ఎంటర్ చేయమని అగుడుతారు. ప్రొఫైల్ పాస్వర్డ్ నమోదుచేసిన తర్వాత మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడీ వివరాలు స్క్రీన్సై కనిపిస్తాయి. ఒకవేళ ఫోన్ నెంబరు కనిపించకపోతే సంబంధిత బ్యాంకును సంప్రదించి మోబైల్ నెంబరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
నెట్ బ్యాంకింగ్ ఎక్కువ చేసే వారు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు...
దేశంలో డిజిటల్ పేమెంట్స్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అనేక మంది నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్‌ను వినియోగించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. బ్యాంకుల్లో నగదు నిల్వలు తక్కువ కావడంతో నేరుగా ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ చేయడానికే చాలామంది మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ బ్యాంకులన్నీ మొబైల్ బ్యాంకింగ్ కోసం ప్రత్యేకంగా యాప్స్‌ను రూపొందించి ఖాతాదారులకు అందుబాటులో కి తెచ్చాయి. అయితే ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ ద్వారా గా నీ మొబైల్ ద్వారా కానీ నెట్ బ్యాకింగ్‌ను ఉపయోగించే వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఓ సారి చూద్దాం
షాపింగ్ సమయంలో...
షాపింగ్‌లు చేసినప్పుడు కనబడిన ప్రతీ సైట్ల మీద లాగిన్ కాకుండా పేరొందిన వెబ్‌సైట్స్‌లోనే షాపింగ్ చేయడం మంచిది. ఏదైనా సైట్లో షాపింగ్ చేసినప్పుడు ఆ పేమెంట్ గేట్వేకి మనం వెళ్లిన తర్వాత బ్యాంక్లాగిన్, పాస్వర్డ్ వేసే ముందు ఆ సైట్ అడ్రస్ హెచ్‌టీటీపీ://లో మొదలవుతోందా లేదా అనేది చూసుకోవాలి. ఇలా లేకపోతే ఆ సైట్లో షాపింగ్ చేయకండి. అటువంటి సైట్స్ సేఫ్ కాదనేది గుర్తించుకోండి.
స్పామ్ కాల్స్....
బ్యాంక్ వివరాలను తెలియజేయమని వచ్చే కాల్స్, ఈ -మెయిల్స్, ఎస్ఎంఎస్లకు స్పందించకండి. ఎందుకంటే బ్యాంక్ సంబంధించిన వారు అటువంటి వివరాలను అడగరు. ఆన్లైన్, మొబైల్ బ్యాంకింగ్‌లకు వాడే ఈ-మెయిల్స్, ఫోన్ నెంబర్లను ఎవరికీ చెప్పకుండా ఉండటం మంచిది.
బ్యాంక్ వెబ్సైట్....
ఆన్లైన్ బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించాలంటే సంబంధిత బ్యాంక్ వెబ్‌సైట్‌ను ఇంటర్నెట్ బ్రౌజర్లో టైపు చేసి మాత్రమే ఓపెన్ చేయాలి. వేరే వెబ్సైట్లలో ఉండే లింక్‌ల ద్వారా ఓపెన్ చేస్తే బ్యాంక్ సమాచారం ఇతరుల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది.
పాస్వర్డ్....
మొబైల్, ఆన్లైన్ బ్యాంకింగ్ పాస్‌వర్డులను కనీసం మూడు నెలలకొకసారి అయినా మారుస్తుండాలి. ఎవరెనా మీ ఫోన్ నెటవర్క్ బాగాలేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి అని చెబితే వెంటనే జాగ్రత్త పడండి. ఒక వేళ అటువంటి ఫోన్ కాల్స్ వస్తే అప్పుడు మీ మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, అకౌంట్లను లాక్ చేయండి. పాస్వర్డ్లు, ఈ-మెయిల్స్, మొబైల్ నెంబర్‌ను మార్చండి.
స్టేట్మెంట్స్....
మీకు సంబంధించిన బ్యాంక్ లావాదేవీలను ఎప్పుడూ పరిశీలించుకోవాలి. ఎప్పటికప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్స్ చూసుకోవడం మంచిది. బ్యాంక్ గానీ మొబైల్ సేవలకు సం బంధించి ఎలాంటి అంతరాయమున్నా వాటిని గమనించినట్లయితే వెంటనే సంబంధిత కంపెనీని సంప్రదించి వివరాలు తెలుసుకోవడం మర్చిపోవద్దు.
ఈ-మెయిల్ లో వివరాలు వద్దు
కొన్ని బ్యాంకులు నెట్ బ్యాంకింగ్‌కి ఏటీ ఎంకి లింక్ పెడతాయి. ఇటువంటి పరిస్థితులలో ఏటీఎం కార్డుని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. అలాగే క్రెడిట్ కార్డు ఇతర బ్యాంకు వివరాలను ఈ-మెయిల్ ద్వారా పంపడం ఏ మాత్రం శ్రేయస్కరం కాదు.
పరిచయం లేని వ్యక్తుల సాయం వద్దు....
ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేసేటప్పుడు పరిచయం లేని వ్యక్తుల నుంచి సాయాన్ని కోరడం మంచిది కాదు. నెట్ బ్యాంకింగ్ చేస్తున్నారని తెలిసే కొందరు హెల్ప్ చేస్తామంటూ ముందుకొస్తారు. అటువంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
రక్షణ వ్యవస్థ....
యాంటీ వైరస్ రక్షణ లేని పీసీలను నెట్ బ్యాంకింగ్‌లకు వాడకపోవడం మంచిది. ఎందుకంటే సరైన రక్షణ వ్యవస్థ లేని సిస్టమ్‌లను హ్యాకర్లు సులువుగా వారీ అధీనంలోకి తీసుకోగలరు. వాడుతున్న బ్రౌజర్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుండాలి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470