Home
News

మీరు ఎక్కడున్నా మొబైల్‌లో మీ సేవ 2.0 ఉంటే చాలు

ఆహార భద్రత కార్డు, భూమికి సంబంధించిన ఆర్‌వోఆర్‌, పహాణి తదితర పత్రాలు పొందాలంటే మీ సేవలో దరఖాస్తు చేసుకుని సంబంధిత కార్యాలయం చుట్టూ నెలల తరబడి తిరగాల్సిన పరిస్థితి. విద్యా సంవత్సరం మొదలైందంటే విద్యార్థులు వివిధ పాఠశాలలు, కాలేజీల్లో ప్రవేశానికి కులం, ఆదాయం, నివాసం తదితర ధ్రువీకరణ పత్రాల కోసం పరుగులు తీస్తారు.

మీరు ఎక్కడున్నా మొబైల్‌లో మీ సేవ 2.0 ఉంటే చాలు

వీటి కోసం మీ సేవ కేంద్రానికి, తహసీల్దార్‌ కార్యాలయానికి చెప్పులరిగేలా తిరుగుతుంటారు. హైదరాబాద్ కంటోన్మెంట్‌ ప్రాంతంలోని ఆయా వార్డుల ప్రజలకు ఏదైనా ధృవపత్రం అవసరముంటే ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పుడు ఆ సమస్యలు లేకుండా వెంటనే మీసేవా ద్వారా పొందవచ్చు.

 37 రకాల సేవలకు దరఖాస్తు

37 రకాల సేవలకు దరఖాస్తు

ఆహార భద్రత కార్డు, కులం, ఆదాయం, నివాసం తదితర ధ్రువీకరణ పత్రాలను మీ సేవ కేంద్రానికి వెళ్లకుండానే పొందవచ్చు. వీటితోపాటు కరెంట్ బిల్లు, మీటరు దరఖాస్తు, జనన, మరణ ధృవీకరణ పత్రాలను పొందవచ్చు. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు 37 రకాల సేవలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రభుత్వం మీ సేవ 2.0 వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.రోజురోజుకు సాంకేతికత పెరుగుతుండటంతో పౌరసేవలు ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో ఇంట్లో నుంచే కావాల్సిన ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తులు సమర్పించి సేవలు పొందేలా మీ సేవ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసింది.

ఇలా వినియోగించుకోవాలి

ఇలా వినియోగించుకోవాలి

మీ సేవ 2.0ను సులభంగా వినియోగించుకొనేలా ప్రభుత్వం ఐటీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసింది. స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్‌లో గానీ మీ సేవ వెబ్‌సైట్‌లోకి వెళ్లి 2.0 సిటిజన్ సర్వీస్‌ను ఎంపిక చేసుకోవాలి. అనంతరం వ్యక్తి పేరు, తండ్రిపేరు, చిరునామా, సెల్ నంబర్, ఆధార్, మెయిల్ ఐడీ తదితర వివరాలు నమోదు చేయాలి. తర్వాత ఐడీ, పాస్‌వర్డ్ ద్వారా లాగిన్ అయ్యి పౌరసేవలను పొందవచ్చు. మీ సేవ 2.0 ద్వారా రెవెన్యూ, విద్యుత్, పురపాలక, పోలీస్, ఆర్టీఏ తదితర శాఖలు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా ప్రజలకు కులం, ఆదాయం, నివాస ధ్రువీకరణ, కరెంట్ బిల్లు, మీటరు దరఖాస్తు, జనన, మరణ ధ్రువపత్రాలను పొందవచ్చు.

స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు

స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు

ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చే మీసేవ 2.0లో పౌరసేవలు పొందాలంటే స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు 37 రకాల సేవలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సేవల్లో ఏవైనా సమస్యలుంటే పరిష్కారానికి కాల్ సెంటర్‌కు ఫోన్ చేయొచ్చు. సెంటర్ నంబర్ 1100, టోల్ ఫ్రీ నంబర్ 1800-4251110ను సంప్రదించి అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చు.

ఏపీ రాష్ర్టంలో సేవలు పొందడం ఎలా ?

ఏపీ రాష్ర్టంలో సేవలు పొందడం ఎలా ?

‘మీ సేవా' కేంద్రాల వద్ద గంటల తరబడి క్యూలో నించోవాల్సిన అవసరం లేకుండా ఫోన్లలోనో ఈ సేవలు పొందే అవకాశాన్ని ఏపీ ప్రభుత్వం కల్పిస్తోంది. ఈ దిశగా రాష్ట్ర ఐటీ శాఖ ఇప్పటికే కొంత కసరత్తు చేసి.. 17 రకాల సేవలు ఫోన్ల ద్వారా పొందే ఏర్పాటు చేసింది. ప్రస్తుతం 170 రకాల సేవలను ‘మీ సేవా' కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తోంది. ప్రజలు ప్రభుత్వ కార్యాల యాలకు వెళ్లాల్సిన అవసరాన్ని తగ్గిస్తే.. అవినీతి తగ్గు తుందని ప్రభుత్వం భావించింది.

దేశంలోనే తొలి స్థానంలో ఏపీ

దేశంలోనే తొలి స్థానంలో ఏపీ

అందుకే ప్రజలకు అందుబాటులో ఉన్న కేంద్రాల్లో ఈ సేవలు లభ్యమైతే వారికి సౌలభ్యం తగ్గుతుందన్న అంచనాతో.. పెద్దసంఖ్య లో కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఏపీలోని పదమూడు జిల్లాల్లో ప్రస్తుతం 4700 మీ-సేవా కేంద్రాలు ఉన్నాయి. వీటి ద్వారా కోట్ల మంది సేవలు పొందుతున్నారు. మీ-సేవా కేంద్రాల ద్వారా ఆనలైన సేవలు అందించడం లో దేశంలోనే తొలి స్థానంలో ఏపీ ఇప్పుడు నిలిచింది. వీటి విజయాన్ని గుర్తించిన కేంద్రం ఇదే నమూనాను దేశవ్యాప్తంగా అమలు చేయాలని సంకల్పించింది.
ఇతర రాష్ట్రాల్లోనూ ఇలా ఆన్లైన్ సేవలు అందించే వ్యవస్ధలున్నా ఇక్కడ ఉన్నంత సమగ్రంగా లేవు. దీంతో ఏపీలో అమలవుతున్న నమూనాను ఆదర్శంగా తీసుకొని కేంద్రం కసరత్తు ప్రారంభించింది. ఇతర రాష్ట్రాలు ప్రస్తుతం ఉన్న నమూనానా అనుసరించే ప్రయత్నంలో ఉంటే ఏపీ మరో అడుగు వేసేందుకు సిద్ధమైంది. ఫోన్లు విస్తృతంగా వ్యాప్తిలోకి రావడంతో వాటి ద్వారానే ‘మీ-సేవ' కేంద్రాల్లోని సేవలను అందించడంపై ఐటీ శాఖ దృష్టి పెట్టింది.

More from GizBot

Best Mobiles in India

English summary
mee seva services on mobile app all you need to know
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X