మీ స్మార్ట్‌ఫోనే మీ పాస్‌పోర్ట్

Written By:

పుస్తకం పై ప్రింట్ అయివచ్చే పాస్‌పోర్ట్‌లను ఇక మీకు మర్చిపోవచ్చు. పేపర్ పాస్‌పోర్ట్‌లకు ప్రత్యామ్నాయంగా స్మార్ట్‌ఫోన్‌లలో స్టోర్ చేసుకోగలిగే పేపర్‌ రహిత పాస్‌పోర్ట్‌లను అభివృద్థి చేసేందుకు ఓ బ్రిటన్ కంపెనీ ముందుకొచ్చింది. De La Rueగా పేర్కొనబడుతోన్న ఈ కంపెనీ ఇప్పపటికే కమర్షియల్ బ్యాంక్‌నోట్ ప్రింటర్లతో పాటు పాస్‌పోర్ట్‌లను తయారుచేస్తోంది.

Read More : కొత్త ఫోన్‌లు వచ్చేస్తున్నాయ్.. మీరు సిద్ధమేనా!

మీ స్మార్ట్‌ఫోనే మీ పాస్‌పోర్ట్

త్వరలో అందుబాటులోకి రాబోయే ఈ కొత్త టెక్నాలజీ ద్వారా ప్రయాణీకులు ఎయిర్‌పోర్ట్‌కు ఏ విధమైన పేపర్ డాక్యుమెంట్‌లను తీసుకువెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇమిగ్రేషన్ అధికారులకు డిజిటల్ ఫార్మాట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయబడిన ఫోన్ ఆధారిత పాస్‌పోర్ట్‌ సమాచారాన్ని చూపిస్తే సరిపోతుంది.

Read More : దిగొచ్చిన స్మార్ట్‌ఫోన్ ధర, రూ.3000కే

మీ స్మార్ట్‌ఫోనే మీ పాస్‌పోర్ట్

ఇండియాను డిజిటల్ ఇండియాగా తీర్చిదిద్దే క్రమంలో ప్రభుత్వ సర్వీసులు ఆన్‌లైన్ బాట పడుతున్నాయి. ఈ క్రమంలో పాస్‌పోర్ట్ సేవలు ఆన్‌లైన్‌లోకి అందుబాటులోకి వచ్చేసాయి. పాస్‌పోర్ట్ ధరఖాస్తును సమర్పించేందుకు గంటల తరబడి క్యూలో నిల్చోవల్సిన అవసరం లేకుండా నెట్ కనెక్షన్ ఉన్న కంప్యూటర్ ముందు కూర్చుని సంబంధిత వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే చాలు, ఆన్‌లైన్‌లో పాస్‌పోర్ట్ అప్లికేషన్‌ను పూర్తి చేయవచ్చు. అది ఏలాగో ఇప్పుడు చూద్దాం...

Read More : రూ. 200కే రిలయన్స్ జియో సిమ్ : 75 GB 4G డాటా, 4500 మినిట్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆన్‌లైన్‌లో Passportకు Apply చేయటం ఏలా..?

ముందుగా పాస్‌పోర్ట్ సేవా ఆన్‌లైన్ పోర్టల్‌లో రిజిస్టర్ కావల్సి ఉంటుంది.

ఆన్‌లైన్‌లో Passportకు Apply చేయటం ఏలా..?

పాస్‌పోర్ట్ సేవా వెబ్‌సైట్‌ హోమ్ పేజీలోని Apply సెక్షన్‌‌‌లో కనిపించే రిజిష్టర్ (Register) లింక్ పై క్లిక్ చేయటం ద్వారా రిజిష్ట్రేషన్ ప్రకియను ప్రారంభించవచ్చు.

ఆన్‌లైన్‌లో Passportకు Apply చేయటం ఏలా..?

రిజిస్ట్ర్రేషన్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత ఐడీ ఇంకా పాస్‌వర్డ్‌లతో పాస్‌పోర్ట్ సేవా ఆన్‌లైన్ పోర్టల్‌లో లాగిన్ అవ్వాలి.

ఆన్‌లైన్‌లో Passportకు Apply చేయటం ఏలా..?

ఆ తరువాత పాస్‌పోర్ట్ దరఖాస్తుకు సంబంధించిన ఫారమ్‌ను పూర్తి చేసి సబ్మిట్ చేయాలి.

ఆన్‌లైన్‌లో Passportకు Apply చేయటం ఏలా..?

సబ్మిట్ చేసిన అప్లికేషన్‌కు సంబంధించి అపాయింట్‌మెంట్‌ను పొందేందుకు "Pay and Schedule Appointment" అనే లింక్ పై క్లిక్ చేయండి.

ఆన్‌లైన్‌లో Passportకు Apply చేయటం ఏలా..?

బుకింగ్ అపాయింట్‌మెంట్‌‌లకు ఆన్‌లైన్ చెల్లింపు తప్పనిసరి కాబట్టి మీ పాస్‌పోర్ట్ దరఖాస్తుకు సంబందించి ఆన్‌లైన్ చెల్లింపును క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చేపట్టిండి.

ఆన్‌లైన్‌లో Passportకు Apply చేయటం ఏలా..?

మీ దరఖాస్తుకు సంబంధించి ఆన్ లైన్ చెల్లింపు ప్రక్రియ పూర్తి అయిన తరువాత "Print Application Receipt" లింక్ పై క్లిక్ చేయండి. మీరు పొందే ఈ రిసిప్ట్‌లో అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్ పొందుపరచబడి ఉంటుంది.

ఆన్‌లైన్‌లో Passportకు Apply చేయటం ఏలా..?

పొందిన అప్లికేషన్ రిసిప్ట్‌ తో పాటు ఒరిజినల్ డాక్యుమెంట్‌లను తీసుకుని అపాయింట్‌మెంట్ బుక్ కాబడిన సమాయానికి సంబంధింత పాస్‌పోర్ట్ సేవ కేంద్రానికి హాజరు కావటం వల్ల ఆన్‌లైన్ పాస్‌పోర్ట్ బుకింగ్ ప్రక్రియ పూర్తవుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Your smartphone to be your passport soon. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot