పర్యావరణాన్ని నాశనం చేస్తున్న స్మార్ట్‌ఫోన్లు,ఈ-మెయిల్స్, ఎంతలా అంటే..?

|

మీ స్మార్ట్‌ఫోన్లు ఇప్పుడు పర్యావరణానికి పెనుముప్పుగా పరిణమించాయి. మెసేజ్, కాల్స్‌, డౌన్‌లోడ్‌ లేదా అప్‌లోడ్‌ చేసే వీడియోలు, వీడియో కాల్స్, ఇంటర్నెట్‌ వినియోగం వీటన్నిటి వల్ల పర్యావరణానికి తీవ్ర హాని జరుగుతోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఎందుకంటే వీటిని ప్రాసెస్‌ చేయడానికి పెద్దఎత్తున డేటా కేంద్రాలు, కమ్యూనికేషన్‌ వ్యవస్థలు నిరంతరాయం పనిచేస్తుంటాయి. దీంతో ఈ కేంద్రాల నుంచి భారీగా వెలువడే కర్బన ఉద్గారాల వల్ల పర్యావరణానికి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతోందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. 2040 నాటికి పర్యావరణానికి జరిగే నాశనంలో స్మార్ట్‌ఫోన్స్, డేటా సెంటర్లదే అధిక భాగం ఉంటుందని హెచ్చరించారు. దీనిలో భాగంగా స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్‌టాప్స్, ట్యాబ్లెట్స్, డెస్క్‌టాప్స్, డేటా సెంటర్లు, ఇతర కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్స్‌లో వినియోగించే కర్బన ఉద్గారాలపై వారు పరిశోధన చేపట్టారు. ప్రస్తుతం ఈ రంగం నుంచి వెలువడే కర్బన్‌ ఉద్గారాల శాతం 1.5 గా ఉందని.. 2040 నాటికి 14 శాతానికి చేరుకుంటుందన్నారు.

 

ఈ మధ్య కాలంలో ధర భారీగా తగ్గిన స్మార్ట్‌ఫోన్ల పూర్తి వివరాలు !ఈ మధ్య కాలంలో ధర భారీగా తగ్గిన స్మార్ట్‌ఫోన్ల పూర్తి వివరాలు !

ఈ-మెయిల్ పర్యావరణానికి అత్యంత ప్రమాదకరం

ఈ-మెయిల్ పర్యావరణానికి అత్యంత ప్రమాదకరం

రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా భారీ సంఖ్యలో ఈ-మెయిల్స్ పంపుతున్నారా? ఇతరులకు సమాచారాన్ని చేరవేయడం పక్కన పెడితే.. మనం పంపే ఈ-మెయిల్ పర్యావరణానికి అత్యంత ప్రమాదకరంగా మారుతున్నదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

4 గ్రాముల కార్బన్ డై ఆక్సైడ్..

4 గ్రాముల కార్బన్ డై ఆక్సైడ్..

మనం పంపే ఈ-మెయిల్ నాలుగు గ్రాముల (0.14 ఔన్సుల) కార్బన్ డై ఆక్సైడ్ (సీవో2) వాతావరణంలోకి విడుదల చేస్తుందట.

ఓ భారీ అటాచ్‌మెంట్ ఉన్న ఈ-మెయిల్ పంపితే..

ఓ భారీ అటాచ్‌మెంట్ ఉన్న ఈ-మెయిల్ పంపితే..

ఇక ఓ భారీ అటాచ్‌మెంట్ ఉన్న ఈ-మెయిల్ పంపితే.. దాదాపు 50 గ్రాముల సీవో2ను గాలిలోకి విడుదల చేస్తున్నదని మెకాఫీ సంస్థకు చెందిన పరిశోధకులు తాజా అధ్యయనంలో గుర్తించారు.

ఓ కారు కిలో మీటరు దూరం ప్రయాణించడం ద్వారా..
 

ఓ కారు కిలో మీటరు దూరం ప్రయాణించడం ద్వారా..

ప్రతీ రోజు ఓ వ్యక్తి 65 ఈ-మెయిల్ పంపడం, ఓ కారు కిలో మీటరు దూరం ప్రయాణించడం ద్వారా వెలువడే కార్బన్ డై ఆక్సైడ్‌కు సమానమని పరిశోధకులు వెల్లడిస్తున్నారు.

స్పామ్ ఈ-మెయిల్ లో 0.3 గ్రాముల సీవో2

స్పామ్ ఈ-మెయిల్ లో 0.3 గ్రాముల సీవో2

మనం ఓపెన్ చేయనటువంటి స్పామ్ ఈ-మెయిల్ కూడా 0.3 గ్రాముల సీవో2 విడుదల చేస్తున్నదనే అంశాన్ని పరిశోధకులు వెల్లడించారు.ఏడాదికి స్పామ్ ఈ-మెయిల్స్ వల్ల వెలువడే గ్రీన్‌హౌజ్ వాయువులు.. 31 లక్షల మంది కారు యజమానులు వినియోగించే రెండు వందల కోట్ల గ్యాలన్ల చమురుకు సమానమని తెలిపారు. అలాగే ప్రతీ ప్లాస్టిక్ బ్యాగ్‌తో 10గ్రాముల కర్బనం విడుదలవుతుందని పేర్కొన్నారు.

కంప్యూటర్లు, సర్వర్లు..

కంప్యూటర్లు, సర్వర్లు..

కంప్యూటర్లు, సర్వర్లు, రూటర్లుతోపాటు కారు డ్రైవింగ్, వెలుతురు కోసం లైట్ స్విచ్ వేయడం, చిన్న ఎస్సెమ్మెస్ పంపడం లాంటి పనుల వల్ల పెద్ద మొత్తంలో కర్బన ఉద్గారాలు వెలువడుతున్నాయని మెకాఫీ పరిశోధకులు వెల్లడించారు.

రెండు గంటలపాటు..

రెండు గంటలపాటు..

కాలక్షేపం కోసం రెండు గంటలపాటు 24 అంగుళాల ప్లాస్మా టెలివిజన్ చూడటం ద్వారా 440 గ్రాముల కార్బన్ డై ఆక్సైడ్ విడుదలవుతుందని పరిశోధకులు తెలిపారు.

Best Mobiles in India

English summary
Your smartphone is damaging the environment, says study More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X