దిమ్మతిరిగేలా కొత్త టెక్నాలజీ , మీ చెమటే మీ పాస్‌వర్డ్ !

Written By:

టెక్నాలజీ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్ననేపథ్యంలో కొత్త కొత్త ఐడియాలు బయటకు వస్తున్నాయి. ఊహకందని సరికొత్త విషయాలతో టెక్ ప్రపంచం ముందుకు దూసుకెళుతుందనడానికి ఈ స్టోరీనే నిదర్శనం. మీ చెమటనే మీ ఫోన్ పాస్‌వర్డ్‌గా పెట్టుకునే విధంగా పరిశోధకులు తమ ప్రయత్నాలకు పదును పెట్టారు.

వొడాఫోన్ 28 రోజుల ప్లాన్, కేవలం 38 రూపాయలకే..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పరిశోధకులు తమ మెదళ్లకు..

స్మార్ట్‌ఫోన్‌లోని డేటా భద్రత కోసం పాస్‌వర్డ్‌, ప్యాటర్న్‌ లాంటి సెక్యూరిటీ లాకింగ్‌‌తో పాటు ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌, ఐరిష్‌, ఫేషియల్‌ రికగ్నిషన్‌ లాంటి బయోమెట్రిక్‌ ఆధారిత అన్‌లాకింగ్‌ సదుపాయాలు కూడా అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో పరిశోధకులు తమ మెదళ్లకు పనిపెట్టారు.

మనిషి చెమటతో..

భవిష్యతులో మనిషి చెమటతో కూడా ఫోన్లను అన్‌లాక్‌ చేసుకునే విధంగా టెక్నాలజీని పరుగులు పెట్టిస్తున్నారు అమెరికాలోని కొందరు పరిశోధకులు దీనిపై ప్రస్తుతం వారు అధ్యయనాలు చేపట్టారు.

అల్బానీ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు..

అమెరికాలోని అల్బానీ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు సరికొత్త ప్రతిపాదనకు తెరలేపారు. మనిషి చెమటతో స్మార్ట్‌ఫోన్‌ లేదా ఇతర వేరబుల్‌ పరికరాలను అన్‌లాక్‌చేసుకునేలా వీరు పరిశోధనలు సాగించనున్నారు.

చెమటతో ఎమినో యాసిడ్‌ ప్రొఫైల్‌ను..

చెమటతో ఎమినో యాసిడ్‌ ప్రొఫైల్‌ను తయారుచేసి దాని ద్వారా సదరు స్మార్ట్‌ఫోన్‌ యజమానికి ఫోన్‌ గుర్తించేలా వీరు అధ్యయనాలు చేస్తున్నారు. ఈ ప్రొఫైల్‌ స్మార్ట్‌ఫోన్‌లో స్టోర్‌ అయి ఉంటుంది. దీని ద్వారా యూజర్‌ అన్‌లాక్‌ చేసుకోవచ్చట.

ఒక రోజులోని వివిధ సమయాల్లో..

అయితే ఇందులో ఎమినో యాసిడ్‌ ప్రొఫైల్‌ను స్మార్ట్‌ఫోన్‌లో కొంతకాలం పాటు అభివృద్ధి చేయాల్సి ఉంటుందని వారు చెబుతున్నారు. ఇది ఒక రోజులోని వివిధ సమయాల్లో ఫోన్‌ యజమాని చెమటను లెక్కిస్తుంది.

ప్రొఫైల్‌ డెవలప్‌ అయిన తర్వాత..

ఒకసారి ప్రొఫైల్‌ డెవలప్‌ అయిన తర్వాత అన్‌లాక్‌ సిస్టమ్‌ పనిచేస్తుంది. యూజర్‌ ఫోన్‌ను పట్టుకున్నప్పుడు అతడి చెమటను ప్రొఫైల్‌లో ఉన్న చెమటతో సరిపోల్చి ఫోన్‌ అన్‌లాక్‌ అవుతుంది.

అమల్లోకి వచ్చేందుకు చాలా సమయం..

అయితే ఇది అమల్లోకి వచ్చేందుకు చాలా సమయం పడుతుందని ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నామని త్వరలోనే పరీక్షించి అమలు చేసే యోచనలో ఉన్నట్లు అల్బానీ యూనివర్శిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ జాన్‌ హలామెక్‌ అన్నారు. అంతే కుండా ఈ వ్యవస్థ వల్ల హ్యాకింగ్‌ జరిగే అవకాశం ఉండదని వారు చెప్పారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Your sweat may be more secure password to your smartphone! Read more News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot