ఫోన్ కోసం ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగిని చంపేసాడు

స్మార్ట్‌ఫోన్ కోసం ఓ యువకుడు ఫ్లిప్‌కార్ట్ డెలివరీ బాయ్‌ను హత్య చేసిన ఘటన బెంగళూరులో కలకలం రేపుతోంది. ఓ ప్రముఖ మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం ఈ దారుణమైన సంఘటన డిసెంబర్ 9, 2016న చోటుచేసుకుంది. 22 సంవత్సరాల వరుణ్ కుమార్ ఫ్లిప్‌కార్ట్‌లో ఓ ఫోన్ ఆర్డర్ చేసాడు.

ఫోన్ కోసం ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగిని చంపేసాడు

Read More : మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో, సొంతంగా లాక్ స్ర్కీన్ క్రియేట్ చేసుకోవటం ఎలా..?

తాను పనిచేస్తున్న జిమ్‌ సెంటర్ అడ్రస్‌కు ఆ ఫోన్‌ను డెలివరీ చేయవల్సిందిగా అతను ఫ్లిప్‌కార్ట్‌లో డెలివరీ సిబ్బందిని కోరాడు. దీంతో ఫ్లిప్‌కార్ట్ డెలివరీ మ్యాన్ నంజుండస్వామి, ఆ ఫోన్‌ను నేరుగా వరుణ్ కుమార్ తెలిపిన చిరునామాకు తీసుకువచ్చాడు. పథకం ప్రకారం ముందుగానే కాచుకుని కూర్చున్న వరుణ్ కుమార్ ఇనుప రాడ్డుతో నంజుండస్వామి పై దాడి చేసాడు. దీంతో నంజుండస్వామి స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో అతని గొంతునులిమి చంపేశాడు. శవాన్ని బేస్‌మెంట్ సెల్లార్ లోకి ఈడ్చేసి అతని వద్ద ఉన్న ఫోన్‌లతో పాటు నగదును తీసుకుని పరారయ్యాడు.

Read More : మీ క్రెడిట్,డెబిట్ కార్డు వివరాలను ఎలా దొంగిలిస్తారో తెలుసా..?

ఫోన్ కోసం ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగిని చంపేసాడు

నంజుండస్వామి కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు డెలివరీ లిస్ట్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేయగా అతని మృతదేహం జిమ్ బేస్‌మెంట్ సెల్లార్‌లో కనిపించింది. దీంతో వరుణ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరపగా, ఉచితంగా స్మార్ట్‌ఫోన్‌ను పొందాలన్న ఉద్దేశ్యంతోనే తాను ఈ దారుణానికి పాల్పడినట్లు వరుణ్‌ వెల్లడించాడని పోలీసులు తెలిపారు.

English summary
Youth kills Flipkart delivery man for Rs 12,000 smartphone. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot