యూట్యూబ్ ప్రకటనల ద్వారా గూగుల్ కు వచ్చిన ఆదాయం ఎంతో తెలుసా?

|

2020 మూడవ త్రైమాసికంలో యూట్యూబ్ యొక్క ప్రకటనల ద్వారా మాత్రమే సుమారు 5 బిలియన్ డాలర్ల ఆదాయం గూగుల్ కు లభించినట్లు తెలిపింది. గూగుల్ మరియు యూట్యూబ్ సంస్థలు రెండు కూడా ప్రకటనల ఆదాయంలో రోజు రోజుకీ పుంజుకుంటున్నాయి. యూట్యూబ్‌లో ఇప్పుడు సుమారు 30 మిలియన్లకు పైగా మ్యూజిక్ మరియు ప్రీమియం పేమెంట్ చందాదారులు ఉన్నారు. అలాగే ఉచిత ట్రయల్స్‌తో కలుపుకొని సుమారు 35 మిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్నారు. యూట్యూబ్ టీవీలో ఇప్పుడు 3 మిలియన్లకు పైగా పేమెంట్ చందాదారులు ఉన్నారు.

 

యూట్యూబ్‌లో ట్యుటోరియల్స్ వీడియోల ప్రకటనల ఆదాయం

యూట్యూబ్‌లో ట్యుటోరియల్స్ వీడియోల ప్రకటనల ఆదాయం

2020 సంవత్సరం మార్చి మధ్య నుండి యూట్యూబ్‌లో గైడెడ్ ధ్యాన వీడియోల వీక్షణలు దాదాపుగా 40 శాతం వరకు పెరిగాయి. అయితే DIY ఫేస్ మాస్క్ ట్యుటోరియల్స్ వీక్షణలు ఈ మధ్య కాలంలో 1 బిలియన్ వరకు దాటాయి అని ఆల్ఫాబెట్ మరియు గూగుల్ సిఇఒ సుందర్ పిచాయ్ సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం యూట్యూబ్ ప్రకటనల ఆదాయం సంవత్సరానికి 32 శాతం పెరిగి 5 బిలియన్ డాలర్లకు చేరుకొని గణనీయమైన వృద్ధిని సాధించింది అని తెలిపారు. ప్రస్తుతం ప్రకటనదారుల ఖర్చు నుండి బ్రాండ్ ప్రకటనలలో పుంజుకుంది అని కూడా తెలిపారు.

 

Also Read: ఇన్‌స్టాగ్రామ్‌లో హర్రర్ హాలోవీన్ వీడియోలను సృష్టించడం ఎలా?Also Read: ఇన్‌స్టాగ్రామ్‌లో హర్రర్ హాలోవీన్ వీడియోలను సృష్టించడం ఎలా?

యూట్యూబ్‌ వీడియోల వీక్షణల మెరుగుదలలు
 

యూట్యూబ్‌ వీడియోల వీక్షణల మెరుగుదలలు

లాక్ డౌన్ సమయంలో ప్రజలు వినోదం, విలువైన కొత్త సమాచారం మరియు క్రొత్తదాన్ని నేర్చుకునే అవకాశాల కోసం యూట్యూబ్ వైపు ఎక్కువగా మగ్గు చూపుతున్నారు అని పిచాయ్ గురువారం కాన్ఫరెన్స్ కాల్ సందర్భంగా చెప్పారు. ఆల్ఫాబెట్ మరియు గూగుల్ యొక్క సిఎఫ్ఓ రూత్ పోరాట్ మాట్లాడుతూ వినియోగదారులు ప్రస్తుతం యూట్యూబ్‌లో తెలియని వాటిని తెలుసుకోవడానికి బలమైన డిమాండ్ను కలిగి ఉన్నారు.

యూట్యూబ్‌లో ప్రకటనల ద్వారా గూగుల్ ఆదాయం

యూట్యూబ్‌లో ప్రకటనల ద్వారా గూగుల్ ఆదాయం

గూగుల్ యొక్క ప్రకటనల విభాగం కింద ఇప్పుడు 37.1 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. గత సంవత్సరం 34 బిలియన్ డాలర్ల నుండి ఇది మంచి పెరుగుదలను సాధించింది. యూట్యూబ్ ప్రకటనల ఆదాయం 2019 మూడవ త్రైమాసికంలో 3.8 బిలియన్ డాలర్ల నుండి 30 శాతం పెరిగింది. యూట్యూబ్ యొక్క సబ్స్క్రిప్షన్ ఆదాయంలో దాని వివిధ సమర్పణలలో చందాదారుల పెరుగుదల నుండి కూడా మంచి లాభం పొందాము అని పోరాట్ చెప్పారు.

Best Mobiles in India

English summary
YouTube Advertising Revenue Increase 40 Percent in Q3 2020

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X