వీడియోలను ఎడిట్ చేయడం మరింత సులభం

Posted By: Staff

వీడియోలను ఎడిట్ చేయడం మరింత సులభం

 

సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ అధీకృత వీడియో షేరింగ్ వెబ్‌సైట్ యూట్యూబ్ వినియోగదారుల కోసం కొత్త ఫీచర్‌ని ప్రవేశపెట్టింది. యూట్యూబ్ ప్రవేశపెట్టిన కొత్త ఫీచర్ ఏంటంటే యూజర్స్ వారు పోస్టు చేసిన వీడియోలను ఎడిట్ చేసే వెసులుబాటుని కూడా కల్పించింది. ఒకే ఒక క్లిక్‌తో వీడియో విజువల్ క్వాలిటీని లెవల్స్‌ని పెంచవచ్చు. ఏయే వీడియోలకు వన్ క్లిక్ ఎడిటింగ్ అవసరం అవుతుందో ఆ విషయాన్ని స్వయంగా వీడియో మేనేజర్ తెలియజేస్తుంది.

వీడియోలు చీకటి మాదిరి ఉంటే వాటిని ఎడిట్ చేయవచ్చు. మీరు గనుక మార్పులకు సంతోషించక పోయినట్లేతే తిరిగి మరలా యథాస్దానికి మీ వీడియోని తీసుకు రావచ్చు. మీరు గనుక మీ వీడియోలను మొబైల్ డివైజులైనటువంటి స్మార్ట్ ఫోన్, టాబ్లెట్ల ద్వారా అప్లోడ్ చేస్తే, డెస్క్‌టాప్‌ని ఉపయోగించి వీడియో మేనేజర్‌లో వీడియోలను ఎడిట్ చేయవచ్చు.

యూట్యూబ్ వీడియో ఎడిటర్ కాన్పెస్ట్‌ని గతయేడాది ప్రవేశపెట్టింది. తద్వారా యూజర్స్ వీడియోలకు మెరుగులు దిద్దవచ్చు. వీడియోలు షేక్ అవుతుంటే ఇందులో ఉన్న స్టబిలైజ్ బటన్ ద్వారా షేకింగ్‌ని తీసివేయవచ్చు. వీడియో ఎడిటర్ ద్వారా వీడియోలకు కలర్స్, ఎఫెక్ట్స్‌ని జత చేయవచ్చు. వీడియో మేనేజర్ నిజానికి ఒక సత్వర స్థిరీకరణగా ఉంటుంది. ఇది చాలా సులభ మరియు ముక్కుసూటి ఉంది.

మీరు ఒక వీడియోని అప్లోడ్ చేసినప్పుడు దానికి  పరిష్కారం అవసరం అనుకుంటే, అప్లోడ్ పేజీలో మరియు వీడియో మేనేజర్ లో ఒక ప్రకటన బార్ కనిపిస్తుంది. మీరు చెయ్యవలసిందల్లా అది కరెక్టుగా ఉంటే బటన్‌పై క్లిక్ చేయడమే. ఆ తర్వాత ప్రివ్యూ వర్సన్‌ని అప్‌లోడ్ చేయడమే.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting