Youtube నుంచి కొత్త వీడియో ఎడిటింగ్ యాప్.. ఎన్ని ప్రత్యేకతలో..!
ప్రముఖ వీడియో ప్లాట్‌ఫాం Youtube కీలక ప్రకటన చేసింది. యూజర్లు తమ ఫోన్ల నుంచే వీడియోలను ఎడిటింగ్ చేసుకొనేందుకు వీలుగా కొత్త వీడియో ఎడిటింగ్ యాప్ Youtube Createను తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. ఈ వీడియో ఎడిటింగ్ యాప్ ద్వారా సులభంగా వీడియోలను రూపొందించడం సహా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఆధారంగా ఎడిటింగ్ చేసుకోవచ్చు.
యూట్యూబ్ క్రియేట్ : అయితే ఇప్పటికే చైనాకు చెందిన షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్.. కట్ కట్ పేరిట చాలా రోజుల క్రితమే వీడియో ఎడిటింగ్ యాప్‌ను తీసుకొచ్చింది. ఆ బాటలోనే గూగుల్ కూడా యూట్యూబ్ షాట్స్ కోసం యూట్యూబ్ క్రియేట్ యాప్‌ను తీసుకొచ్చింది.

యూట్యూబ్ క్రియేట్ వీడియో ఎడిటింగ్ యాప్ అనేక ఆప్షన్లను కలిగి ఉంటుంది. ప్రిసిసన్ ఎడిటింగ్, ట్రిమ్మింగ్, ఆటో క్యాప్షన్, వాయిస్ ఓవర్ ఆప్షన్‌లు కూడా ఉంటాయి. దీంతోపాటు లైబ్రరీ ఫిల్టర్, ట్రాన్స్‌షన్, ఎఫెక్ట్ వంటి అనేక కీలక ఫీచర్లను ఈ కొత్త యాప్ కలిగి ఉంది.
ఎన్నో ఫీచర్లు : యూట్యూబ్ కొత్త వీడియో ఎడిటింగ్ యాప్ ద్వారా రూపొందించే వీడియోలకు అదనపు హంగులు చేర్చడంలో భాగంగా ఉచిత మ్యూజిక్ సహా మరిన్ని ఫీచర్లను జతచేసినట్లు సంస్థ తెలిపింది. వీడియోలను సులభంగా ఎడిటింగ్ చేసేందుకు కావాల్సిన అన్ని ఫీచర్లు ఈ యాప్‌లో ఉండనున్నాయి.
యూట్యూబ్ క్రియేట్ వీడియో ఎడిటింగ్ యాప్ ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ యాప్ ఆండ్రాయిడ్ బీటా వినియోగదారులు కొందరికి ప్రస్తుతం అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని దేశాల్లో యూట్యూబ్ క్రియేట్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌ను విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ జాబితాలో భారత్, అమెరికా, యూకే, జర్మనీ, ప్రాన్స్, ఇండోనేషియా, కొరియా, సింగపూర్ వంటి దేశాల్లో ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌ను విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే యూట్యూబ్ క్రియేట్ వీడియో ఎడిటింగ్ యాప్ iOS వెర్షన్‌ను వచ్చే సంవత్సరం విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
డ్రీమ్ స్క్రీన్ : దీంతోపాటు యూట్యూబ్ మరిన్ని కీలక ప్రకటనలు చేసింది. డ్రీమ్ స్క్రీన్ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫీచర్లపై ప్రకటన చేసింది. ఈ ఫీచర్ ద్వారా వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లను క్రియేట్ చేయవచ్చని తెలుస్తోంది. భవిష్యత్‌లో మరిన్ని ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తామని యూట్యూబ్ చెబుతోంది.
డ్రీమ్ స్క్రీన్ ఫీచర్ ద్వారా నచ్చిన వీడియోలు, ఇమేజ్ బ్యాక్‌గ్రౌండ్ సృష్టించడానికి వినియోగదారులను అనుమతి ఇస్తుంది. ఈ ఫీచర్ గురించి యూట్యూబ్ సీఈవో మేడ్ ఆన్ యూట్యూబ్ కార్యక్రమంలో వివరించారు. ఉహాజనిత చిత్రాలు, వీడియోలు, థీమ్‌లను కూడా క్రియేట్ చేసుకోవచ్చన్నారు. ప్రస్తుతం ఎంపిక చేసిన క్రియేటర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. వచ్చే సంవత్సరం ప్రారంభం నాటికి అందరికీ అందుబాటులోకి వస్తుందని సమాచారం.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications