Youtube కఠిన నిర్ణయం.. ఇక నుంచి అలాంటి వీడియోలు అప్‌లోడ్ చేస్తే..!!
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం యూట్యూబ్ (Youtube) నుంచి కీలక ప్రకటన వెలువడింది. భారతీయ యూజర్లు మరియు కంటెంట్ క్రియేటర్ లపై కఠినమైన నిర్ణయాన్ని ప్రకటించింది. క్లిక్‌బైట్ టైటిల్ లేదా థంబ్‌నెయిల్ తో వీడియోలను అప్‌లోడ్ చేసే క్రియేటర్ లు, యూజర్ లపై చర్యలు తీసుకోనుంది. డిసెంబర్ 18వ తేదీన తన బ్లాగ్ స్పాట్ లో ఈ వివరాలను వెల్లడించింది.
బ్రేకింగ్ న్యూస్ లేదా ఇతర కరెంట్ ఈవెంట్‌ల సమయంలో :
వీడియోలో లేని కంటెంట్‌ను టైటిల్ లేదా థంబ్‌నైయిల్‌లో వినియోగిస్తే తీసుకొనే చర్యలపై తన బ్లాక్‌లో యూట్యూబ్ స్పష్టంగా రాసుకొచ్చింది. బ్రేకింగ్ న్యూస్ లేదా ఇతర కరెంట్ ఈవెంట్‌ల సమయంలో ఈ తరహా పరిస్థితులు ఎక్కువగా ఉంటాయంటూ తెలిపింది. ఏదైనా అత్యవసర లేదా ముఖ్యమైన సమయాల్లో పూర్తి వివరాలు తెలుసుకొనేందుకు యూట్యూబ్‌కు వచ్చిన యూజర‌్లకు ఈ తరహా టైటిల్స్, థంబ్‌నైయిల్స్‌తో మోసగించినట్లు అవుతుందని తెలిపింది.

యూజర్‌లను తప్పుదారి పట్టించేలా :
మరియు ఈ తరహా కంటెంట్ తో యూజర్‌లను తప్పుదారి పట్టించేలా చేస్తుందని యూట్యూబ్ తన బ్లాగ్ లో పేర్కొంది. బ్రేకింగ్ లేదా కరెంట్ ఈవెంట్స్ కు సంబంధించిన వార్తలను కవర్ చేసే యూట్యూబ్ ఛానళ్లు ఈ కొత్త నిర్ణయం కిందకు వస్తాయని యూట్యూబ్ తెలిపింది.
ఎలాంటి రూల్స్ ను పాటించాలి :
సెన్సేషనల్ టైటిల్ మరియు థంబ్‌నెయిల్స్ తో యూట్యూబ్ వీడియోలను రూపొందించి, యూజర్లను మభ్యపెట్టడం యూట్యూబ్ కొత్త విధానానికి విరుద్ధమని తాజా నిర్ణయంతో తెలుస్తోంది. అయితే బ్రేకింగ్ లేదా కరెంట్ ఈవెంట్స్‌ను కవర్ చేసే సమయంలో ఎలాంటి రూల్స్‌ను పాటించాలో మాత్రం ప్రస్తుతానికి ఎటువంటి విధివిధానాలను ప్రకటన చేయలేదు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
యూట్యూబ్ ఆటో డబ్బింగ్ ఫీచర్ వివరాలు ఇటీవల వెల్లడయ్యాయి. ఈ ఫీచర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేస్తుంది. ఈ ఫీచర్ ద్వారా ఇతర భాషల్లోని కంటెంట్‌ను కూడా చూసేందుకు వీలుంటుందని తెలుస్తోంది. ఆటో డబ్బింగ్ ఫీచర్ ద్వారా కంటెంట్ క్రియేటర్లు అప్‌లోడ్ చేసిన వీడియోలు ఆటోమేటిక్‌గా ఇతర భాషల్లోకి అనువాదం అవుతాయి.
ఫలితంగా ఏదైనా వీడియోను యూట్యూబ్ సపోర్టు చేసిన భాషల్లోని యూజర్లు చూడవచ్చు. ఇలాంటి వీడియోలపై ఆటో డబ్బుడ్ అనే ప్రత్యేక లేబుల్ కనిపిస్తుంది. యూట్యూబ్ ఆటో డబ్బింగ్ ఫీచర్ ప్రస్తుతం ఫ్రెంచ్, జర్మన్, హిందీ, స్పానిష్, పోర్చుగీస్, జపనీస్, ఇటాలియన్, ఇంగ్లీష్ భాషలను సపోర్టు చేస్తుంది. ఈ భాషల్లో పరస్పరం కంటెంట్ ఆటో డబ్బింగ్ అవుతుంది. వీడియో అప్‌లోడ్ చేసే సమయంలోనే ఈ ఫీచర్ ఆటోమేటిక్‌గా వాయిస్‌ను గుర్తిస్తుంది. సపోర్టు చేసే భాషల్లోకి ఆటోమేటిక్‌గా మారుస్తుంది.
భవిష్యత్‌లో అత్యంత కచ్చితత్వంతో :
అయితే ఈ ఫీచర్ వాయిస్‌ను గుర్తించకుంటే.. అందుకు సంబంధించిన వివరాలను కూడా డిస్‌ప్లే చేస్తుంది. అంటే అప్‌లోడ్ చేస్తున్న వీడియోను ఆటో డబ్బింగ్ ఫీచర్ ద్వారా ఇతర భాషల్లోకి ట్రాన్సిలేట్ చేయడం వీలుకాదని చెబుతుంది. తొలిదశలో తప్పులు వచ్చే అవకాశం ఉందని, భవిష్యత్‌లో అత్యంత కచ్చితత్వంతో అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది.


Click it and Unblock the Notifications








