డెస్క్‌టాప్‌లో యూట్యూబ్ వీడియో డౌన్‌లోడ్‌లను ఎలా యాక్టివేట్ చేయాలి??

|

యూట్యూబ్ ప్రస్తుతం తన ప్రీమియం చందాదారుల కోసం సరికొత్త ఫీచర్‌ని పరీక్షిస్తోంది. ఇది వారి డెస్క్‌టాప్ వెబ్ బ్రౌజర్‌లో వీడియోలను నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం ప్రయోగాత్మక ఫీచర్‌గా అందుబాటులో ఉంది. ఇది ప్రస్తుతం క్రోమ్, ఎడ్జ్ మరియు ఒపెరా వెబ్ బ్రౌజర్‌ల తాజా వెర్షన్‌లకు మాత్రమే మద్దతును ఇస్తుంది.

 
డెస్క్‌టాప్‌లో యూట్యూబ్ వీడియో డౌన్‌లోడ్‌లను ఎలా యాక్టివేట్ చేయాలి??

యూట్యూబ్ తన ప్రీమియం చందాదారులను మొబైల్ పరికరాలలో ఆఫ్‌లైన్ వీక్షణ కోసం కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. అయితే ఆ వీడియో ప్రైవేట్‌గా గుర్తించబడదు మరియు సృష్టికర్త వారి వీక్షకులకు డౌన్‌లోడ్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. డెస్క్‌టాప్‌లో ఆఫ్‌లైన్‌లో యూట్యూబ్ వీడియోలను డౌన్‌లోడ్ చేయడానికి కింద గల మార్గదర్శిని అనుసరించండి.

డెస్క్‌టాప్‌లో యూట్యూబ్ ఆఫ్‌లైన్ వీడియో డౌన్‌లోడ్‌లను యాక్టివేట్ చేసే విధానం

డెస్క్‌టాప్‌లో యూట్యూబ్ వీడియో డౌన్‌లోడ్‌లను ఎలా యాక్టివేట్ చేయాలి??

** యాక్టివ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ని కలిగి ఉన్న మీ గూగుల్ అకౌంటుతో యూట్యూబ్ లో లాగిన్ చేయండి.

** YouTube యొక్క "ప్రయోగాత్మక ఫీచర్‌లను ప్రయత్నించండి" పేజీకి వెళ్లండి.

** "మీ బ్రౌజర్ నుండి వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోండి" ఎంపికను చూసే వరకు క్రిందికి స్క్రోల్ చేయండి.

** "Try it out" బటన్‌పై క్లిక్ చేయండి.

** ఇప్పుడు ఏదైనా ఒక వీడియోను చూస్తున్నప్పుడు మీరు ఆ వీడియోను డౌన్‌లోడ్ చేయడానికి డౌన్‌లోడ్ బటన్‌పై క్లిక్ చేయవచ్చు. (డౌన్‌లోడ్ బటన్ లైక్ మరియు షేర్ బటన్‌ల పక్కన ఉంటుంది).

** వీడియో డౌన్‌లోడ్ అయిన తర్వాత వినియోగదారులు వాటిని డౌన్‌లోడ్ విభాగంలో చూడవచ్చు. ఇది స్క్రీన్ ఎడమ వైపున "వాచ్ లేటర్" ఐకాన్ క్రింద ఉంటుంది. లేదా యూజర్స్ youtube.com/feed/downloads కు వెళ్లవచ్చు.

అర్హత కలిగిన వినియోగదారులు సెట్టింగ్‌ల మెనూకు వెళ్లి, వీడియోలు డౌన్‌లోడ్ చేయబడే నాణ్యతను ఎంచుకోవచ్చు. ఫుల్ HD (1080p) గరిష్టంగా ఉంటుంది. హై (720p), మీడియం (480p), మరియు తక్కువ (144p) కూడా అందుబాటులో ఉన్నాయి. యూజర్లు తమ డెస్క్‌టాప్‌లో స్పేస్ ను ఖాళీ చేయడానికి ఒక బటన్‌తో బ్రౌజర్ నుండి అన్ని స్థానిక డౌన్‌లోడ్‌లను తొలగించే ఎంపికను కూడా ఉపయోగించవచ్చు. ఈ కొత్త ఫీచర్ ప్రస్తుతం అక్టోబర్ 19 వరకు పరీక్ష దశలో ఉంది. అయితే వినియోగదారులందరికీ ఈ ఫీచర్‌ని ఎప్పుడు అందుబాటులోకి తెస్తారో విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు.

Most Read Articles
Best Mobiles in India

English summary
YouTube Begins Testing Video Downloads Feature For Desktop Users: How to Activate

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X