యూట్యూబ్ ఇప్పుడు సింగపూర్ లోకల్ వర్సన్‌లో..!

Posted By: Staff

యూట్యూబ్ ఇప్పుడు సింగపూర్ లోకల్ వర్సన్‌లో..!

ప్రముఖ వీడియో షేరింగ్ వెబ్‌సైట్ యూట్యూబ్ అంచెలు అంచెలుగా ఎదుగుతూ ప్రపంచ వ్యాప్తంగా కస్టమర్స్‌ని సంపాదించుకుంది. తన కార్యకలాపాలను మరింతగా పెంపోందించుకునేందుకు గాను ఇటీవలే సింగపూర్‌లో వారియొక్క లోకల్ వర్సన్ వెబ్ సైట్‌కి శ్రీకారం చుట్టింది. సింగపూర్‌కి చెందిన వీడియో కార్యకలాపాల అన్నింటిని ఈ వెబ్ సైట్‌లో పొందుపరచనుంది. యూట్యూబ్ సింగపూర్‌ వెబ్‌సైట్ ఓపెన్ చెయ్యాలంటే యూట్యూబ్ క్రింద సింగపూర్ దేశాన్ని సెలక్ట్ చేసుకొవచ్చు లేదంటే డైరెక్టుగా http://www.youtube.com.sg లింక్ ద్వారా యూట్యూబ్ సింగపూర్ లొనికి ప్రవేశించవచ్చు.

సాధారణంగా సింగపూర్ వాసులకు ఇంటర్నెట్లో యూట్యూబ్ అందుబాటులో ఉన్నప్పటికీ ప్రత్యేకంగా వారికోసం సింగపూర్ లోకల్ వర్సన్ యూట్యూబ్‌ని ప్రవేశపెట్టడం వెనుక కారణం వారి మనసులలో మరింత స్దానం సంపాదించడానికేనని తెలియజేశారు. అంతేకాకుండా ఈ వీడియో షేరింగ్ వెబ్‌సైట్ ద్వారా సింగపూర్ లోకర్ కంటెంట్‌తో పాటు, రీజినల్ పాప్ కల్చర్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించడమే కాకుండా, సౌత్ ఈస్ట్ ఏసియా దేశం అయిన సింగపూర్ విశేషాలను ప్రపంచానికి తెలియజేయవచ్చు.

గత కొన్ని సంవత్సరాలుగా చూసుకుంటే యూట్యూబ్ ఏసియా మార్కెట్లో మంచి డిమాండ్‌ ఏర్పడింది. ఈ నెల మొదట్లో ఫిలిఫ్పెన్స్‌ లోకల్ వర్సన్ విడుదల చేసిన యూట్యూబ్, ఇప్పడు సింగపూర్ లోకల్ వర్సన్‌ని విడుదల చేసింది. ఇక ఇండియా విషయానికి వస్తే గతంలోనే ఇండియాలో యూట్యూత్ తన వర్సన్‌ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇది మాత్రమే కాకుండా బాలీవుడ్‌కు ప్రముఖ హీరోల సినిమాలని బాక్సాఫీసు ద్వారా యూట్యూబ్ ప్రజలకు చేరవేస్తున్న విషయం విదితమే.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot