Youtube Shorts ఎక్కువగా చూస్తుంటారా.. ఈ కొత్త మార్పులు గురించి తెలుసా..? వివరాలు
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం యూట్యూబ్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్లాట్‌ఫాంలో యూజర్లను ఎక్కువ ఆకట్టుకొనే ఫీచర్‌లలో ఒకటైన షార్ట్స్ నిడివి (Lenth) పెంచింది. యూట్యూబ్‌లో ప్రస్తుతం షార్ట్స్‌ను 60 సెకెన్ల వరకు మాత్రమే (Youtube Shorts) అప్‌లోట్ చేసే అవకాశం ఉంది. ఈ నిడివిని 3 నిమిషాల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త నిర్ణయం అక్టోబర్ 15 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. గత నెలలో చిన్నారుల భద్రతను దృష్టిలో పెట్టుకొని, తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండేలా యూట్యూబ్ ఫ్యామిలీ సెంటర్ ఫీచర్‌ను తీసుకొచ్చింది.
ఈ ఫీచర్‌పై క్రియేటర్ల నుంచి ఎక్కువగా అభ్యర్థనలు వచ్చినట్లు తెలిపింది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌కు పోటీగా 2020 లో యూట్యూబ్ షార్ట్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతోపాటు రానున్న నెలల్లో పెద్ద వీడియోలు మరింత మంది చేరేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపింది. దీంతోపాటు యూట్యూబ్ షార్ట్స్‌ను స్ట్రీమ్‌లైన్డ్ లుక్‌తో అప్‌డేట్ చేసింది.

దీంతోపాటు షార్ట్స్‌ను టెంప్లేట్‌లుగా మార్చేందుకు అవకాశం ఉంది. మరియు ఆడియోను కూడా జతచేయవచ్చు. రీమిక్స్ బటన్‌ను ట్యాప్ చేయడం ద్వారా క్రియేట్ చేయవచ్చు. వీడియో, మ్యూజిక్ నుంచి షార్ట్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. దీంతోపాటు యూట్యూబ్ క్లిప్స్ నుంచి కూడా వీడియోలు రూపొందించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతోపాటు గూగుల్ డీప్‌మైండ్‌కు చెందిన వీడియో జనరేటింగ్ మోడల్ Veo కూడా యూట్యూబ్ షార్ట్స్‌ను అందుబాటులోకి రానుంది.
అయితే టిక్‌టాక్ వంటి ప్లాట్‌ఫాంలకు గట్టిపోటీ నిచ్చేలా ఈ తరహా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. టిక్‌టాక్ 2021 లోనే 3 నిమిషాల నిడివి ఉన్న వీడియోలను అనుమతించింది. ప్రస్తుతం 10 నిమిషాల నిడివి ఉన్న వీడియోలను అనుమతిస్తోంది. అయితే టిక్‌టాక్ ప్రస్తుతం భారత్‌లో అందుబాటులో లేదు.

ఇటీవల యూట్యూ్బ్‌లో చిన్నారుల యూట్యూబ్ వినియోగంపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండేలా అప్‌గ్రేడ్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. యూట్యూబ్ ఫ్యామిలీ సెంటర్ పేరుతో అందుబాటులోకి వచ్చింది. చిన్నారులు అప్‌లోడ్ చేసే వీడియోలు, చూసే వీడియోలు, కామెంట్‌లపైన తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉంటుంది. చిన్నారుల ఖాతాలను తల్లిదండ్రులు లింక్ చేసుకోవాల్సి ఉంటుంది.
చిన్నారుల ఖాతాలను తమ యూట్యూబ్ అకౌంట్లకు లింక్ చేసిన తర్వాత.. చిన్నారులు తమ అకౌంట్లలో వీడియోలు అప్‌లోడ్ చేసినా, లైవ్ స్ట్రీమింగ్ ప్రారంభించినా.. వారి తల్లిదండ్రులకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. ఫలితంగా చిన్నారుల ఎటువంటి తప్పులు చేసినా తెలుస్తుంది. మరియు వెంటనే సరిదిద్దేందుకు అవకాశం ఉంటుంది. తల్లిదండ్రుల వారి యూట్యూబ్ యాప్‌లోని సెట్టింగ్స్‌లోకి ఫ్యామిలి సెంటర్ పేజీని క్లిక్ చేసి, ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవాలి.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








