యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్న ‘థ్రిల్లింగ్ వీడియో టేప్’!

Posted By: Prashanth

యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్న ‘థ్రిల్లింగ్ వీడియో టేప్’!

 

కొరియన్ పాప్‌ స్టార్ ‘సై హూ’(Psy who) తన వైరల్ మ్యూజిక్ వీడియో ‘గ్యాంగ్‌నమ్‌ స్టైల్’తో రికార్డులు సృష్టిస్తున్నారు. ఈ సెలబ్రెటీ వీడియో టేప్ యూట్యూబ్ ప్రపంచంలో సరికొత్త మైలురాయిని అధిగమించి గిన్నీస్ ప్రపంచ రికార్డ్ దిశగా దూసుకువెళుతోంది. ఇప్పటి వరకు ఈ వీడియోకు యూట్యూబ్‌లో 2.2 మిలియన్లు ‘లైక్స్’ లభించాయి. దింతో ‘పార్టీ రాక్ యాంథమ్’(1.5 మిలియన్ల లైక్స్) పేరిట ఉన్న గత రికార్డును కొరియన్ పాప్ స్టార్ వీడియో అధిగమించిగలిగింది.

యూట్యూబ్‌లో రెండు నెలల క్రితం అప్‌లోడ్ చేయబడిన ఈ మ్యూజిక్ వీడియోను ఇప్పటి వరకు 232మిలియన్ల కంటే ఎక్కువ సార్లు వీక్షించారు. భవిష్యత్‌లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల నుంచి ఈ మ్యూజిక్ వీడియోకు మిశ్రమ స్పందన లభిస్టోంది. గ్లోబల్ మ్యూజిక్ పరిశ్రమలో సరికొత్త ఒరవడికి నాంది పలికిన సై హూ మ్యూజిక్ వీడియో ‘గ్యాంగ్ నమ్‌స్టైల్’ ముందు ముందు ఎటువంటి రికార్డులను సృష్టిస్తుందో వేచి చూడాలి. ఇదిలా ఉండగా...780 మిలియన్ల వీక్షణ సంఖ్యతో ‘జస్టిన్ బైబర్స్ బేబీ’ అగ్ర స్థానంలో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

Read In English

గ్యాంగ్‌నమ్‌ స్టైల్ వీడియో లింక్:

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot