Youtube, Gmail, గూగుల్ డ్రైవ్ సర్వీసులలో అధిక సమస్యలు

|

ప్రపంచం మొత్తం ప్రస్తుతం ఇంటర్నెట్ ను అధికంగా వినియోగిస్తున్నారు. జనాలు ఎక్కువ మంది వినోదం కోసం ఎక్కువగా వెతికే అతిపెద్ద వీడియో స్ట్రీమింగ్ సర్వీసులలో ఒకటైన యూట్యూబ్ యొక్క సేవలు ప్రపంచవ్యాప్తంగా పడిపోయింది. ఈ వార్త వినియోగదారులను కొద్దిగా ఆశ్చర్యపరుస్తుంది కానీ ఇది నిజం. యూట్యూబ్ మాత్రమే కాకుండా ఎక్కువ మంది వినియోగదారులు ఉపయోగించే Gmail మరియు గూగుల్ డాక్యూమెంట్స్ వంటి ఇతర గూగుల్ సేవలను కూడా ప్రస్తుతం యాక్సెస్ చేయలేరు.

 

గూగుల్ ఉత్పత్తులలో సమస్యలు

గూగుల్ ఉత్పత్తులలో సమస్యలు

గూగుల్ యొక్క చాలా ఉత్పత్తులు ప్రస్తుతం అదే విధంగా బాధపడుతున్నట్లు కనిపిస్తోంది. అయితే ప్రస్తుత ఈ సమస్యకు గల కారణాల మీద ఎటువంటి స్పష్టమైన సమాచారం లేదు. యూట్యూబ్, జిమెయిల్ మరియు గూగుల్ డ్రైవ్ యొక్క తాజా పరిస్థితికి సంబంధించి ప్రజలు తమ అనుభవాలను షేర్ చేసుకోవడానికి ట్విట్టర్ మరియు ఫేస్‌బుక్ వంటి ప్లాట్‌ఫారమ్‌లను అధికంగా ఉపయోగిస్తున్నారు.

యూట్యూబ్‌ సమస్యలు

యూట్యూబ్‌ సమస్యలు

యూట్యూబ్‌ యొక్క వెబ్ వెర్షన్ మరియు యాప్ సంస్కరణలు రెండూ ప్రస్తుతం గో డౌన్ పరిస్థితులలో ఉన్నాయి. ఇది నిజామా కాదా అని తెలుసుకోవడానికి మేము ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ మరియు ఐఫోన్‌లో యూట్యూబ్‌ను ఓపెన్ చేయడానికి ప్రయత్నించాము. అయితే రెండు సందర్భాల్లోను మేము యూట్యూబ్‌ను యాక్సెస్ చేయలేకపోయాము. అదేవిధంగా మా వద్ద గల విండోస్ కంప్యూటర్‌లోని వెబ్ బ్రౌజర్‌ను ఉపయోగించి యూట్యూబ్‌ను యాక్సెస్ చేయడానికి కూడా ప్రయత్నించాము. అయితే బ్రౌజర్‌లో కూడా ఏదో తప్పు జరిగిందని చూపుతున్నది. ఇప్పటికి యూట్యూబ్‌ను యాక్సెస్ చేయడానికి మార్గం లేదు.

గూగుల్ మ్యాప్స్, డ్రైవ్ సేవల సమస్యలు
 

గూగుల్ మ్యాప్స్, డ్రైవ్ సేవల సమస్యలు

యూట్యూబ్‌ ఒక్కటే కాకుండా గూగుల్ మ్యాప్స్, గూగుల్ డ్రైవ్ వంటి సేవలు కూడా ప్రస్తుతం పనిచేయడం లేదు. ఈ సేవలను కూడా మేము చాలా రకాల ఫోన్‌లు మరియు కంప్యూటర్‌లలో పరీక్షించాము. అయితే మేము పరీక్షించిన వేటిలోను ఈ గూగుల్ యొక్క ఉత్పత్తులను యాక్సెస్ చేయలేకపోయాము.

గూగుల్ సెర్చ్ బాగా పనిచేస్తోంది

గూగుల్ సెర్చ్ బాగా పనిచేస్తోంది

ఇండియాలో ప్రస్తుతం Google.com లో ఎటువంటి సమస్యలు కనిపించడం లేదు. ఈ సెర్చ్ ఇంజిన్‌ను సులభంగా యాక్సెస్ చేయవచ్చు మరియు వాటి ఫలితాలను సులభంగా కనుగొనవచ్చు. అయినప్పటికీ గూగుల్ హోమ్ పేజీ నుండి గూగుల్ మ్యాప్స్, యూట్యూబ్, గూగుల్ డ్రైవ్, జిమెయిల్ లేదా గూగుల్ ప్లే స్టోర్ వంటి కొన్ని సర్వీసులను మాత్రం యాక్సెస్ చేయలేరు. టెక్ సంస్థ గూగుల్ ఈ సమస్యపై వీలైనంత త్వరగా పరిష్కారాలను తీసుకురాగలదు అని భావించవచ్చు.

Best Mobiles in India

English summary
Youtube, Gmail, Drive, Maps and Google Services Not Working in Globally

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X