జాబ్ కోసం యూట్యూబ్ పిలుస్తోంది, ఇక ఛానళ్లపై దాడులు షురూ

Written By:

ఈ రోజుల్లో యూట్యూబ్ ప్రపంచం అమిత వేగంతో ముందుకు దూసుకుపోతోంది. ఎప్పటికప్పుడు సరికొత్త అప్ డేట్లతో యూ ట్యూబ్ కొత్త కళను సంతరించుకుంటోంది. అయితే అదే నేపథ్యంలో అనేక విమర్శలను ఎదుర్కుంటోంది. యూజర్లను తప్పుదోవ పట్టించే అనేక వీడియోలు అందులో దర్శనమిస్తున్నాయి. అయితే అలాంటి వారిపై యూట్యూబ్ ఇప్పుడు దాడిచేయనుంది.

4జిబి ర్యామ్‌తో రెడ్‌మి 5, లీకయిన ఇమేజ్, డిసెంబర్ 7న లాంచ్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యూట్యూబ్‌లో ఏది పడితే అది పోస్టు చేయడానికి..

యూజర్లు ఇకపై యూట్యూబ్‌లో ఏది పడితే అది పోస్టు చేయడానికి వీలు లేదు. యూజర్లను తప్పుదోవ పట్టించేలా, తీవ్రవాద భావజాలాలున్న వీడియోలను యూట్యూబ్‌ ఇప్పుడు బ్యాన్ చేయనుంది.

కొత్తగా 10 వేల మంది ఉద్యోగులను

ఇందుకోసం కొత్తగా 10 వేల మంది ఉద్యోగులను యూట్యూబ్ కొత్తగా నిర్మించుకోనుంది. వీరంతా యూజర్లను తప్పుదోవ పట్టించే వీడియోలను చిన్నారులపై తీవ్ర ప్రభావాన్ని కలిగించే వీడియోలను పసిగట్టి ఆ వీడియోలపై తగు చర్యలు తీసుకునేలా పనిచేయనున్నారు.

ఉగ్రవాదాన్ని ప్రేరేపించేందుకు కొన్ని ఉగ్రవాద సంస్థలు ..

ఇటీవలి కాలంలో సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుని ఉగ్రవాదాన్ని ప్రేరేపించేందుకు కొన్ని ఉగ్రవాద సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి వాటిని నివారించేందుకు ఫేస్‌బుక్‌, గూగుల్‌, ట్విటర్‌ చర్యలు చేపట్టాయి. తాజాగా యూట్యూబ్‌ కూడా ఆ జాబితాలో చేరింది.

50 ఛానళ్లు, వేలసంఖ్యలో వీడియోలు..

యూట్యూబ్‌ ఇప్పటికే 50 ఛానళ్లు, వేలసంఖ్యలో వీడియోలు, 5లక్షల అభ్యంతరకర యాడ్‌లను తమ డేటాబేస్‌ నుంచి తొలగించింది. కాగా చిన్నారులపై ప్రభావం చూపేలా ఉండే వీడియోలను తమ డేటాబేస్‌ నుంచి తొలగిస్తున్నట్లు గత నెలలో ప్రకటించింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
YouTube hires moderators to root out inappropriate videos more News at gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot