యూట్యూబ్ సరిక్రొత్త రికార్డు '4 బిలియన్ల'..?

Posted By: Super

యూట్యూబ్ సరిక్రొత్త రికార్డు '4 బిలియన్ల'..?

 

సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ వీడియో షేరింగ్ వెబ్‌సైట్ యూట్యూబ్ ప్రతి రోజూ 4 బిలియన్ల వీడియోస్‌ని తిలకిస్తున్నారని అధికారకంగా తెలిపింది. గత ఎనిమిది నెలలో యూట్యూబ్‌ని వీక్షించే ప్రేక్షకుల సంఖ్య సుమారు 25 శాతానికి పెరిగినట్లు కంపెనీ వర్గాలు ధృవీకరించాయి. అత్యధిక భాగం వీడియోలను పర్సనల్ కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్స్, టెలివిజన్స్ నుండి వీక్షించారని సమాచారం. ఇటీవల కాలంలో ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ ఫోన్స్ ఎక్కువగా రావడం గూగుల్‌కి కలసి వచ్చే అంశం.

ఇది మాత్రమే కాకుండా ప్రతి ఒక్క నిమిషానికి యూట్యూబ్‌‌లో 60 గంటలు పాటు వీక్షించే వీడియోలను అప్ లోడ్ చేస్తున్నట్లు యూట్యూబ్ తెలిపింది. గత మే నెలలో గనుక గమనించినట్లేతే ఒక్క నిమిషానికి యూట్యూబ్‌‌లో 48 గంటలు పాటు వీక్షించే వీడియోలను అప్ లోడ్ చేస్తున్నట్లు యూట్యూబ్ ప్రకటించిన విషయం తెలిసిందే. 2006వ సంవత్సరంలో యూట్యూబ్‌ని సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ $1.65 బిలియన్లకు కొనుగోలు చేసింది. దీని ద్వారా గూగుల్ అడ్వర్టెజింగ్ రంగంలో కొత్త పుంతలు తొక్కుతూ తనదైన శైలిలో అదాయాన్ని సృష్టించుకుంటుంది.

గూగుల్‌కి వీడియో షేరింగ్ వెబ్‌ సైట్ యూట్యూబ్ ద్వారా సంవత్సర ఆదాయం $5 బిలియన్లు వస్తుందని పోయిన వారం తెలిపారు. ఈ ఆదాయం యూట్యూబ్ లో డిస్ ప్లే చేసేటటువంటి యాడ్స్ ద్వారా వస్తుందని తెలియజేశారు. ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకీ ఆదరణ పెరుగుతుండడంతో యూట్యూబ్ ఇటీవల కంటెంట్‌ని ఆధారం చేసుకోని కొత్త ఛానల్స్‌గా విభజించిన సంగతి తెలిసిందే. గత అక్టోబర్‌లో యూట్యూబ్ పాప్ స్టార్స్ మడోన్నా, జే జడ్‌లకు సంబంధించిన 100 ఒరిజినల్  ప్రోగ్రామ్స్ వీడియోలను యూట్యూబ్‌లో వీక్షనకు ఉంచనున్నట్లు తెలిపింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot