యూట్యూబ్ ఇండియా యూజర్లకు షాక్.. భారీగా ధరలు పెంపు.. పూర్తి వివరాలు..!
ప్రీమియం యూజర్లకు యూట్యూబ్ ఇండియా (Youtube India) షాక్ ఇచ్చింది. ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లా్న్ ధరలను పెంచింది. individual, ఫ్యామిలీ, స్టూడెంట్ ప్లాన్ ధరలను సవరించింది. కొన్ని ప్లాన్ల ధరల పెరుగుదల తక్కువగా ఉండగా.. మరి కొన్ని ప్లాన్ల ధరల పెరుగుదల ఎక్కువగా ఉంది. యూడ్స్ లేకుండా యూట్యూబ్ కంటెంట్ ను వీక్షించేందుకు ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు మరికొన్ని ప్రయోజనాలు కూడా ఉంటాయి.
యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రైబర్లు యాడ్స్ లేకుండా (Youtube Increases Premium Subscription Plan Price) కంటెంట్ ను వీక్షించవచ్చు. దీంతోపాటు వీడియోలు, మ్యూజిక్ ను యాప్ బ్యాగ్రౌండ్ లో చూసేందుకు వీలుంటుంది. మరియు పిక్చర్ ఇన్ పిచ్చర్ (PiP) మోడ్, అధిక నాణ్యత కలిగిన వీడియోలను చూసేందుకు వీలుంటుంది.

యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ సవరించిన ధరల వివరాలు ప్రస్తుతం సంస్థ వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేయబడ్డాయి. గతంలో Individual ప్లాన్ నెలవారీ ధర రూ.129 ఉండగా.. ధరల పెంపుతో రూ.149 గా మారింది. అదే విధంగా ఫ్యామిలీ ప్లాన్ గతంలో రూ.189 ఉండగా.. ప్రస్తుతం రూ.299 గా మారింది. ఫ్యామిలీ ప్లాన్‌లో ఐదుగురు వినియోగించుకొనేందుకు వీలుంది.
అయితే యూట్యూబ్ ప్రీమియం స్టూడెంట్ ప్లాన్ ధరలో మాత్రం చిన్నపాటి మార్పులు వచ్చాయి. గతంలో ఈ ప్లాన్ ధర గతంలో రూ.79 ఉండగా.. ధరల పెంపు అనంతరం రూ.89 గా ఉంది. ప్రీపెయిడ్ ప్లాన్‌లతోపాటు రెన్యూవల్ సబ్‌స్క్రిప్షన్ ధరలను కూడా యూట్యూబ్ సవరించింది. కొత్త ధరలు ఇవాళ్టి నుంచి అందుబాటులోకి వచ్చాయి.
ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ల ధరల పెంపుపై యూట్యూబ్ స్పందించింది. మరింత మెరుగైన సేవలను అందించడం సహా యూట్యూబ్ క్రియేటర్లను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే ధరల పెంపుపై పలువురు వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గరిష్ఠంగా ఫ్యామిలీ ప్లాన్‌పై 58 శాతం ధరలు పెంచారు.
యూట్యూబ్ ప్రీమియం ప్లాన్ కొత్త ధరల వివరాలు
Individual ప్లాన్ నెలవారీ ధర రూ. 129 నుంచి రూ. 149 కి పెరిగింది.
ఫ్యామిలీ నెలవారీ ప్లాన్ ధర రూ. 189 నుంచి రూ. 299 కి పెరిగింది.
స్టూడెంట్ ప్లాన్ నెలవారీ ధర రూ .79 నుంచి రూ. 89 కి పెరిగింది.
వ్యక్తిగత ప్రీపెయిడ్ నెలవారీ ప్లాన్ రూ. 139 నుంచి రూ.159 కి పెరిగింది.
వ్యక్తిగత ప్రీపెయిడ్ త్రైమాసిక ప్లాన్ రూ. 399 నుంచి రూ. 459 కి పెరిగింది.
వ్యక్తిగత ప్రీపెయిడ్ వార్షిక ప్లాన్ ధర రూ. 1290 నుంచి రూ.1490 కి పెరిగింది.
గిజ్ బాట్ తెలుగు వెబ్ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








