ఆ వీడియోలను మొబైల్‌‌లోనే చూసేస్తున్నారట!

Posted By:

ఆ వీడియోలను మొబైల్‌‌లోనే చూసేస్తున్నారట!
యూట్యూబ్ అప్లికేషన్ ప్రపంచవ్యాప్తంగా సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్న నేపధ్యంలో యూట్యూబ్ ఇండియా ఆసక్తికర వివరాలను వెల్లడించింది. యూట్యూబ్ వీడియోలను దేశీయంగా స్మార్ట్ ఫోన్ ల ద్వారానే అత్యధిక శాతం వీక్షిస్తున్నట్లు గూగుల్ ఓ నివేదికలో వెల్లడించింది. యూట్యూబ్ వీడియోలను 30 శాతం మంది స్మార్ట్ ఫోన్ ల ద్వారా తిలకిస్తుండగా, 20 శాతం మంది ట్యాబ్లెట్ పీసీల ద్వారా ఎంపిక చేసుకుంటున్నట్లు సదరు నివేదిక ద్వారా తెలుస్తోంది. యూట్యూబ్ వీడియోలను తిలకించే భారతీయులలో 70శాతం మంది 35ఏళ్ల లోపు వారేనని సర్వే పేర్కొనటం విశేషం. వీడియోలను చూస్తున్న ప్రతి ఐదుగురిలో ఒకరు కొత్త వీడియో కంటెంట్ ను క్రమంగా అప్ లోడ్ చేస్తున్నారట.

యూట్యూబ్ వీడియోలను సలువుగా డౌన్‌లోడ్ చేసే సాఫ్ట్‌వేర్!

ప్రముఖ ఆన్‌లైన్ వీడియో షేరింగ్ సైట్ ‘యూట్యూబ్'ద్వారా మిలియన్‌ల సంఖ్యలో వీడియోలను వీక్షించటంతో పాటు షేర్ చేసుకుంటున్నాం. అయితే వీటిని డౌన్‌లోడ్ చేసుకునేందుకు సరైన ఆప్షన్ లేదు. ఉన్నప్పటికి అది చాలా సమయాన్ని వృధా చేస్తుంది. ఈ సమస్యకు ‘యూట్యూబ్ డౌన్‌లోడర్'అనే ప్రోగ్రామ్ సాఫ్ట్‌వేర్ చక్కటి పరిష్కారాన్ని చూపుతుంది. ఈ ఉచిత సాప్ట్‌వేర్‌ను ఆన్‌లైన్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అంతే కాదండోయ్... ఈ ప్రోగ్రామ్ మ్యూజిక్ ఫైళ్లను ఎంపీ4, ఎంపీత్రీ, 3జీపీ, ఎమ్‌వోవీ, ఏవీఐ తదితర ఫార్మాట్లలోకి మార్చుకోవచ్చు. యూట్యూబ్ డౌన్ లోడర్ ద్వారా కేవలం యూట్యూబ్ వీడియోలనే కాకుండా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలోని వీడియోలను సైతం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

యూట్యూబ్ డౌన్ లోడర్ ద్వారా వీడియోలను డౌన్‌లోడ్ చేసుకునే విధానాన్ని చూద్దాం:

- ముందుగా యూట్యూబ్ డౌన్‌లోడర్‌ను ఓపెన్ చేసుకోవాలి.

- సంబంధిత వీడియో పేజ్ యూఆర్ఎల్‌ను కాపీ చేసిన వెంటనే యూట్యూబ్ డౌన్‌లోడర్ ప్రోగ్రామ్ సంబంధిత స్థానంలో ఆ యూఆర్‌ఎల్‌ను పేస్ట్ చేసుకుంటుంది.

- క్వాలిటీ అదేవిధంగా ఫైల్ చేరాల్సిన ఫోల్డర్‌ను ఎంపిక చేసుకోవాలి,

- ఈ ప్రక్రియ పూర్తి కాగానే డౌన్‌లోడ్ పై క్లిక్ చేయండి.

- డౌన్‌లోడింగ్ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే, ప్లే ఆప్షన్‌ను క్లిక్ చేసి వీడియోను వీక్షించండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot