యూట్యూబ్‌లోకి మన తెలుగు వచ్చేసింది...!

Posted By: Prashanth

యూట్యూబ్‌లోకి మన తెలుగు వచ్చేసింది...!

 

సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ వీడియో షేరింగ్ వెబ్‌సైట్ యూట్యూబ్ కొత్తగా నాలుగు ఇండియన్ భాషలను యూట్యూబ్‌లో ప్రవేశపెట్టింది. ఈ నాలుగు భారతీయ భాషలు ఏంటంటే గుజరాతీ, కన్నడ, మళయాళం, తెలుగు. ఈ నాలుగు భాషలను యూట్యూబ్‌లో ప్రవేశపెట్టనున్న విషయాన్ని గూగుల్ బ్లాగ్‌ ద్వారా తెలియజేసింది.  యూట్యూబ్‌లో అంతక ముందు హిందీ, ఇంగ్లీషు భాషలలో లభ్యమవుతున్న విషయం తెలిసిందే.

వీటితో పాటు ఉర్దూ, మరాఠీ, బెంగాలీ, తమిళంలో యూట్యూబ్ ఉన్న విషయం తెలిసిందే. మే 2008 నుండి యూట్యూబ్ ఇండియన్ భాషలను ఒకదాని తర్వాత ఒకటి జత చేస్తుంది. కొత్తగా జత చేసిన నాలుగు భాషలను కలుపుకుంటే యూట్యూబ్ ప్రపంచ వ్యాప్తంగా 58 భాషలలో లభ్యమవుతుంది. రాబోయే కాలంలో మరిన్ని మార్పులకు అవకాశం ఉంటుందని యూట్యూబ్ ప్రతినిధులు తెలియజేశారు.

ఈ నాలుగు భాషలను జత చేయడం వల్ల సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ 200 మిలియన్ యూజర్స్‌కు దగ్గరవుతుంది. వీటితో పాటు ఈ భాషలకు సంబంధించిన కంటెంట్‌ని కూడా యూట్యూబ్ జత చేయడం వల్ల గూగుల్ వైపు ఎక్కువ మంది యూజర్స్ ఆసక్తిని చూపుతున్నారు. షీమారో మరియు హంగామా లాంటి పాట్నర్స్ నుండి లైసెన్సు క్లిప్స్‌తో పాటు, వంటకు సంబంధించిన న్యూస్, టిప్స్‌ని యూట్యూబ్ అందిస్తుంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting