Home
News

యూట్యూబ్‌ షాకింగ్‌ నిర్ణయం.. యాడ్స్‌ లేకుండా వీడియోలు చూసేందుకు యాడ్‌ బ్లాకర్‌లను వినియోగిస్తున్నారా...?

ప్రముఖ వీడియో ప్లాట్‌ఫాం యూట్యూబ్‌ (Youtube ad blockers) ఇటీవల కాలంలో తన ఆదాయాన్ని పెంచుకోవడంలో భాగంగా యాడ్స్‌ సంఖ్యను పెంచింది. తొలుత 30 సెకన్ల యాడ్‌ను స్కిప్‌ చేసే విధంగా తర్వాత యాడ్‌ పూర్తిగా చూశాకనే వీడియో ప్లే అయ్యే విధంగా ఆల్గారిథమ్‌ను రూపొందించింది. అయితే యాడ్స్‌ చూడడం ఇష్టం లేని వారు థర్డ్‌ పార్టీ యాడ్‌ బ్లాకర్‌లను వినియోగిస్తున్నారు. ఫలితంగా యాడ్స్‌ చూడకుండా వీడియో కంటెంట్‌ను ఆస్వాదిస్తున్నారు. అయితే ఈ యాడ్‌ బ్లాకర్‌లను నియంత్రించేందుకు యూట్యూబ్‌ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

గత సంవత్సరం నుంచి యూట్యూబ్‌ ఈ యాడ్‌ బ్లాకర్ల్‌ను నియంత్రించేందుకు అనేక చర్యలు తీసుకుంటోంది. యాడ్‌ బ్లాకర్‌లను నిలిపేయాలని కోరుతూ నోటిఫికేషన్‌లను పంపింది. అప్పటికీ కూడా వినియోగిస్తుంటే మూడు వీడియోల ద్వారా ఎటువంటి వీడియోలు కూడా ప్లే కానుండా నిలిపేయడం వంటి చర్యలు తీసుకుంది.

youtube will skip video to the end to control ad blockers usage

తాజాగా యూట్యూబ్‌లో యాడ్స్‌ లేకుండా కంటెంట్‌ చూసేందుకు యాడ్‌ బ్లాకర్‌లను వినియోగిస్తున్న వారికి షాక్‌ ఇచ్చింది. కొత్తగా యూట్యూ్‌బ్‌ తీసుకున్న నిర్ణయం ద్వారా.. ఇప్పటికీ యూడ్‌ బ్లాకర్‌లను వినియోగిస్తున్న వారు అసలు వీడియోలను చూసే అవకాశం లేకుండా చేసింది.

అంటే యూట్యూబ్‌లో యాడ్‌ బ్లాకర్‌ల సాయంతో వీడియోలను ప్లే చేస్తుంటే వీడియోలను ఆటోమేటిక్‌గా చివరి వరకు వచ్చేస్తాయి. అంటే వీడియో పూర్తయినట్లు చూపిస్తాయి. దీని ద్వారా యాడ్‌ బ్లాకర్‌లు వినియోగించే యూజర్లు అసలు వీడియోలు చూసే అవకాశం కోల్పోనున్నారు.

ఇప్పటికే ఈ తరహా పరిస్థితి తమకు ఎదురవుతుందని కొందరు సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు. యాడ్స్‌ లేకుండా యూట్యూబ్‌ లో వీడియోలు చూడాలంటే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాలని యూట్యూబ్‌ సూచించింది. యూట్యూబ్‌ లోని కంటెంట్‌ క్రియేటర్ల ఆదాయం కోసం యాడ్స్‌ అవసరమని సంస్థ చెబుతోంది.

అయితే గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో యూట్యూబ్‌లో యాడ్స్‌ సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో అనేక మంది యాడ్‌ బ్లాకర్‌ లు వంటి థర్ట్‌ పార్టీ యాప్‌ లను వినియోగిస్తున్నారు. ఎప్పటి నుంచి ఈ తరహా సాఫ్ట్‌వేర్‌లను వినియోగిస్తున్న వారికి నోటిఫికేషన్‌ లు సహా ఇతర ప్రత్యామ్నాయాలను చూపుతున్న సంస్థ తాజాగా కఠిన నిర్ణయం తీసుకుంది.

దీంతో యాడ్స్‌ లేకుండా యూట్యూబ్‌ చూసేందుకు ప్రీమియం సబ్‌స్క్రిషన్‌ తీసుకోవడం మినహా ప్రస్తుతం మరే ఇతర అవకాశం లేకుండా పోయింది. అయితే ప్రస్తుతం ఏయే ప్రాంతాల్లో యూట్యూబ్‌ నిర్ణయం అమల్లోకి వచ్చిందో తెలియలేదు. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా దీనిపై అనేక మంది స్పందిస్తున్నారు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
youtube key decision that will skip entire video to the end users who are using with ad blockers
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X