3డి వీడియో ఆఫ్షన్‌ని విడుదల చేసిన 'యూ ట్యూబ్'

Posted By: Staff

3డి వీడియో ఆఫ్షన్‌ని విడుదల చేసిన 'యూ ట్యూబ్'

న్యూఢిల్లీ: ప్రపంచంలో ఎక్కువ పాపులారిటీ కలిగిన వీడియో షేరింగ్ వెబ్ సైట్ 'యూ ట్యూబ్' త్వరలో వీడియో 3డి ఆఫ్షన్‌ని ప్రవేశపెట్టనుందని సమాచారం. యూ ట్యూబ్ ప్రవేశపెట్టనున్న ఈ 3డి వీడియో వల్ల ఉపయోగం ఏమిటంటే యూజర్స్ అప్ లోడ్ చేసిన కంటెంట్‌ని 3డి వీడియో ఫార్మెట్లోకి మారుస్తుంది. ఒక్కసారి కంటెంట్‌ని 3డి ఫార్మెట్లోకి మార్పు చేసిన తర్వాత యూజర్స్ ఆ వీడియోని వీక్షించాలంటే తప్పనిసరిగా 3డి గ్లాస్‌లను దగ్గర పెట్టుకోవాల్సిందే.

గతంలో యూజర్స్ అప్ లోడ్ చేసిన 2డి వీడియోలను డైరెక్టుగా 3డి వీడియోలుగా మార్చడం కోసం యూ ట్యూబ్ వెబ్ సైట్ ప్రత్యేకంగా 'ఎడిట్ ఇన్ఫో' అనే బటన్‌ని రూపోందించడం జరిగింది. గతంలో ఈ 3డి వీడియో మీద యూ ట్యూబ్ ప్రయోగాలు చేసినప్పటికీ ఇంత ఆలస్యం కావడానికి కారణం 3డి రికార్డింగ్ డివైజెస్‌యేనని నిపుణులు తెలిపారు. 3డి ఇమేజిలను రికార్డ్ చేసేందుకు గాను మోషన్ ఫిక్చర్ కెమెరాని సిస్టమ్‌ని ఉపయోగించడం జరిగింది.

2009వ సంవత్సరంలో యూ ట్యూబ్ టెక్నికల్ సాప్ట్ వేర్ ఇంజనీర్ పీటర్ బ్రాడ్ షా 3డి ఆఫ్షన్‌ని యూజర్స్ కోసం విడుదల చేయడం జరుగుతుందని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన ప్రకటించిన ఇన్ని సంవత్సరాలకు యూ ట్యూబ్ అధికారకంగా యూ ట్యూబ్ 3డి వీడియోని విడుదల చేయనుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot