యూట్యూబ్ మ్యూాజిక్ యాప్ వచ్చేసింది
ప్రముఖ వీడియో స్ట్ర్రీమింగ్ సర్వీస్ యూట్యూబ్ శుక్రవారం తన యూట్యూబ్ మ్యూజిక్ యాప్‌ను ఎట్టకేలకు మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ మ్యూజిక్ యాప్ ద్వారా మొబైల్ యూజర్లు మ్యూజిక్‌ను మరింత సలువుగా బెటర్ ఎక్స్‌పీరియన్స్‌తో ఆస్వాదించవచ్చు.
Read More : పోయిన ఫోన్‌లో డేటాను చేరిపేయటం ఏలా..?
సంగీత ప్రియులకు యూట్యూబ్ సైట్ ఓ పాపులర్ హాట్- స్టాప్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది యూట్యూబ్ సైట్‌ను యాక్సెస్ చేసుకుంటున్నారు. యూట్యూబ్ మ్యూజిక్ యాప్‌లోని 5 ప్రత్యేకతలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు....
యూబ్యూట్ మ్యూజిక్ యాప్ గూగుల్ ప్లే మ్యూజిక్ యాప్‌కు దగ్గర పోలికలను కలిగి ఉంటుంది. సరికొత్త యూజర్ ఇంటర్‌ఫేస్‌తో వస్తోన్న యూట్యూబ్ మ్యూజిక్ యాప్‌ను సులువుగా ఉపయోగించుకోవచ్చు. యూట్యూబ్ లైబ్రరీ, క్విక్ సెర్చ్, స్విచ్ టు ఆడియో - ఓన్లీ ప్లే వంటి ఫీచర్లు యాప్ కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. యూబ్యూట్ మ్యూజిక్ యాప్‌లో భాగంగా యూజర్లు My Mix క్యాటగిరి క్రింద రోజువారి ప్లే లిస్ట్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. అందుబాటులో యాడ్ ఫ్రీ సబ్‌స్ర్కిప్షన్ సర్వీస్ యూట్యూబ్ రెడ్ పేరుతో యూట్యూబ్ అందిస్తోన్న కొత్త సర్వీస్ ద్వారా యాడ్స్ లేని అన్‌లిమిటెడ్ మ్యూజిక్ ఆల్బమ్స్‌ను ఆస్వాదించవచ్చు. నెలవారీ 9.99డాలర్ల (మన కరెన్సీ ప్రకారం రూ.650)ను చెల్లించటం ద్వారా ఈ పెయిడ్ సబ్‌స్టేషన్‌ను నెటిజనులు యాక్టివేట్ చేసుకోవచ్చు. యూట్యూబ్ మ్యూజిక్ యాప్ బేసిక్ genre స్టేషన్స్‌తో కూడిన పర్సనలైజిడ్ హోమ్ పేజ్ ఫీచర్‌ను కలిగి ఉంది. యూజర్ అభిరుచులను బట్టి పర్సనలైజిడ్ స్టేషన్‌లను క్రియేట్ చేసుకోవచ్చు. యూట్యూబ్ మ్యూజిక్ యాప్ ప్రస్తుతానికి యూఎస్ మార్కెట్లో అందుబాటులో ఉంది ఇండియన్ మార్కెట్లో అందుబాటుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావల్సి ఉంది.
యూట్యూబ్ మ్యూజిక్ యాప్‌లోని 5 ప్రత్యేకతలు

యూట్యూబ్ మ్యూజిక్ యాప్‌లోని 5 ప్రత్యేకతలు

యూట్యూబ్ మ్యూజిక్ యాప్‌లోని 5 ప్రత్యేకతలు

యూట్యూబ్ మ్యూజిక్ యాప్‌లోని 5 ప్రత్యేకతలు

యూట్యూబ్ మ్యూజిక్ యాప్‌లోని 5 ప్రత్యేకతలు


Click it and Unblock the Notifications








