ఇండియాలో మొదలైన మ్యూజిక్ వార్, సవాల్ విసిరిన యూట్యూబ్
ఇండియాలో ఇప్పుడు మ్యూజిక్ వార్ మొదలైంది. Spotify తన మ్యూజిక్ ను లాంచ్ చేసిన కొద్ది నెలల్లోనే యూట్యూబ్ తన మ్యూజిక్ తో దూసుకొచ్చింది. యూట్యూబ్ యూజర్లకు శుభవార్తను మోసుకొచ్చింది. యూట్యూబ్ మ్యూజిక్, యూట్య
ఇండియాలో ఇప్పుడు మ్యూజిక్ వార్ మొదలైంది. Spotify తన మ్యూజిక్ ను లాంచ్ చేసిన కొద్ది నెలల్లోనే యూట్యూబ్ తన మ్యూజిక్ తో దూసుకొచ్చింది. యూట్యూబ్ యూజర్లకు శుభవార్తను మోసుకొచ్చింది. యూట్యూబ్ మ్యూజిక్, యూట్యూబ్ ప్రీమియం ఇండియాలో రిలీజయ్యాయి.

ఇప్పటికే గూగుల్ నుంచి గూగుల్ ప్లే మ్యూజిక్, గూగుల్ ప్లే మూవీస్ ఉన్నాయి. ఇప్పుడు గూగుల్ నడిపించే యూట్యూబ్‌కు చెందిన మరో రెండు సర్వీసులు చేరాయి.

ఉచితం
యూట్యూబ్ మ్యూజిక్ యాప్‌ను ఎవరైనా ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. కాకపోతే యాడ్స్ ఉంటాయి. ఒకవేళ మీరు యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం తీసుకుంటే యాడ్స్ ఉండవు.

మూడు నెలలపాటు ఉచితం
ఇతర దేశాలతో పోలిస్తే ప్రీమియం ధరలు కాస్త తక్కువగానే ఉన్నాయి. లాంచింగ్ సందర్భంగా మొదటి 3 నెలల పాటు యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తున్నారు.

5 మంది కుటుంబ సభ్యులు
ఆ తరువాత నెలకు రూ.99 చెల్లించాలి. లేదా రూ.149 చెల్లించి ఫ్యామిలీ ప్లాన్ తీసుకుంటే 5 మంది కుటుంబ సభ్యులు యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం సేవలను పొందవచ్చు. ఇక ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలపై యూజర్లకు లభిస్తున్నది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్10 కొంటే
ఒకవేళ మీరు శాంసంగ్ గెలాక్సీ ఎస్10 కొంటే యూట్యూబ్ ప్రీమియం, యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం లేదా గూగుల్ ప్లే మ్యూజిక్ సబ్‌స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నాలుగు నెలల పాటు యూట్యూబ్ ప్రీమియం వాడుకోవచ్చు.

పూర్తి ప్రీమియం వివరాలు
యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం మెంబర్‌షిప్- నెలకు రూ.99
యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం మెంబర్‌షిప్(iOS)- నెలకు రూ.129
యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం ఫ్యామిలీ మెంబర్‌షిప్(ఆరుగురికి)- నెలకు రూ.149
యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం ఫ్యామిలీ(ఆరుగురికి) మెంబర్‌షిప్(iOS)- నెలకు రూ.199
యూట్యూబ్ ప్రీమియం- నెలకు రూ.129
యూట్యూబ్ ప్రీమియం(iOS)- నెలకు రూ.169
యూట్యూబ్ ప్రీమియం ఫ్యామిలీ(ఆరుగురికి) ప్లాన్- నెలకు రూ.189
యూట్యూబ్ ప్రీమియం ఫ్యామిలీ(ఆరుగురికి) ప్లాన్(iOS)- నెలకు రూ.249


Click it and Unblock the Notifications








