యూట్యూబ్‌లో కొత్తగా ఆటోమేటిక్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్!! స్థానిక భాషలో వీడియోలను బ్రౌజ్ చేయడానికి అనుమతి

|

యూట్యూబ్ గురించి ప్రస్తుతం తెలియని వారు ఉండరు. కొన్ని నివేదికల ప్రకారం యూట్యూబ్ లోని వీడియో టైటిల్స్, డిస్క్రిప్షన్ మరియు క్యాప్షన్ లను స్వయంచాలకంగా వారి మాతృభాషలోకి అనువదించడం ద్వారా యూజర్లు వీడియోలను బ్రౌజ్ చేయడాన్ని మరింత సులభతరం చేస్తుంది. జనాదరణ పొందిన వీడియో-షేరింగ్ ప్లాట్‌ఫామ్‌ యూట్యూబ్ లోని ఈ క్రొత్త ఫీచర్ గూగుల్ యొక్క స్వంత అనువాద యాప్ ద్వారా ఆధారిపడి పనిచేస్తుంది. కొంతమంది వినియోగదారులు ఈ కొత్త ఫీచర్ ను గుర్తించడంతో ఇది సర్వర్ వైపు మార్పు ద్వారా ప్రారంభించబడిందని తెలుస్తోంది. ఇది త్వరలోనే వినియోగదారులందరికి అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. ఏదేమైనా పోర్చుగీస్ మరియు టర్కిష్ భాషల వరకు మాత్రమే ఇప్పటివరకు అనువాదాలను గుర్తించబడ్డాయి.

ఆటొమ్యాటిక్ ట్రాన్సలేషన్ ఫీచర్

కొంతమంది వినియోగదారుల కోసం మాత్రమే యూట్యూబ్ లో కొత్తగా ప్రారంభించిన ఆటొమ్యాటిక్ ట్రాన్సలేషన్ ఫీచర్ గురించి మొట్టమొదటిసారిగా ఆండ్రాయిడ్ పోలీసులు నివేదించారు. నివేదిక ప్రకారం కొంతమంది వినియోగదారు వీడియో టైటిల్స్, డిస్క్రిప్షన్ మరియు క్యాప్షన్ల వంటి వాటిని ఇంగ్లీష్ నుండి పోర్చుగీస్ కు మరియు ఇంగ్లీష్ నుండి టర్కి భాషకు అనువదించడం చూడగలిగారు. ఈ క్రొత్త ఫీచర్ టెక్స్ట్‌ను స్వయంచాలకంగా అనువదించడానికి గూగుల్ ట్రాన్స్‌లేట్ సహాయం తీసుకుంటుంది. ఇది వినియోగదారులకు వీడియోలను మరింత సులభంగా బ్రౌజ్ చేయడానికి సహాయపడుతుంది. యూట్యూబ్ వెబ్ మరియు మొబైల్ యాప్ లలో వినియోగదారులకు ఈ ఫీచర్ అందుబాటులో ఉందని నివేదిక తెలిపింది.

యూట్యూబ్

యూట్యూబ్ సంస్థ ఇటీవల తన ప్లాట్‌ఫామ్‌లోని కంటెంట్ సృష్టికర్తలను వారి గూగుల్ అకౌంట్లోని వివరాలను మార్చకుండా యూట్యూబ్ స్టూడియో ద్వారా వారి పేర్లు మరియు ప్రొఫైల్ ఫోటోలను మార్చడానికి అనుమతించడం ప్రారంభించింది. ఇది కంటెంట్ సృష్టికర్తల నుండి అభ్యర్థించబడిన ఫీచర్ కావున ఏప్రిల్ 22 నుండి సర్వర్-సైడ్ అప్‌డేట్ ద్వారా ఇది ప్రారంభమైంది. అయితే ధృవీకరించబడిన బ్యాడ్జ్ ఉన్న సృష్టికర్తలు యూట్యూబ్‌లో వారి వివరాలను మార్చిన తర్వాత దాని కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి.

వీడియో షేరింగ్ ప్లాట్‌ఫాం

యూట్యూబ్‌కు సంబంధిత ఇతర వార్తల విషయానికి వస్తే ఈ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫాం భారతదేశంలో యాప్ ని పరీక్షించిన తర్వాత యుఎస్‌లోని యూట్యూబ్ షార్ట్‌ల బీటా వెర్షన్‌ను విడుదల చేస్తోంది. యూట్యూబ్ యొక్క షార్ట్ క్విక్-క్లిప్‌ల ఫీచర్ టిక్‌టాక్‌కు ప్రత్యర్థిగా విడుదలైనది. పరీక్షా దశలో ఇది రోజుకు 6.5 బిలియన్లకు పైగా వీక్షణలను సంపాదించడం ద్వారా భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందింది. "షార్ట్స్ ద్వారా ప్రేక్షకుల నుండి డబ్బు సంపాదించడానికి యూట్యూబ్ కూడా పనిచేస్తోంది" అని యూట్యూబ్ షార్ట్స్ వద్ద ప్రొడక్ట్ మేనేజర్ టాడ్ షెర్మాన్ తెలిపారు.

Best Mobiles in India

English summary
YouTube New Automatic Translation Feature Allows to Browse Videos in The Local Language

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X