స్కూల్ పిల్లలు కోసం 'యూట్యూబ్ ఫర్ స్కూల్ సైట్‌'

Posted By: Prashanth

స్కూల్ పిల్లలు కోసం 'యూట్యూబ్ ఫర్ స్కూల్ సైట్‌'

 

సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్‌కి చెందిన పాపులర్ వీడియో షేరింగ్ వెబ్ సైట్ యూట్యూబ్ కొత్తగా స్కూల్స్ పిల్లలు, స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా వీడియోలను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ వీడియోలలో ఎడ్యుకేషన్‌కి సంబంధించిన కంటెంట్ మాత్రమే పిల్లలకు లభ్యమవుతుంది. దీని కోసం యూట్యూబ్ ఓ టూల్‌ని ప్రవేశపెట్టింది. దీని సహాయంతో వారికి ఎడ్యుకేషన్‌కి సంబంధించిన కంటెంట్‌కి మాత్రమే యాక్సెస్ ఇవ్వడం జరిగింది.

కేవలం పిల్లలను దృష్టిలో పెట్టుకోని యూట్యూబ్ కొత్తగా విడుదల చేసిన ఎడ్యుకేషన్ కంటెంట్‌ని స్కూల్ పిల్లలు www.youtube.com/schools లింక్ ద్వారా పోందవచ్చు. ఈ వెబ్ సైట్‌లో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే టీచర్స్ వారి స్టూడెంట్స్‌కి కావాల్సిన కంటెంట్‌ని మాత్రమే చూపవచ్చు. యూట్యూబ్ ఎడ్యుకేషన్ ద్వారా ఎడ్యుకేషన్‌కి సంబంధించిన వీడియోలను వీక్షించవచ్చు.

'యూట్యూబ్ ఎడ్యుకేషన్' వెబ్‌సైట్‌లో ఇప్పటి వరకు ఎడ్యుకేషన్‌కి సంబంధించి 4.5 లక్షల వీడియోలను పోందుపరిచారు. ఈ వీడియోలను అన్నింటిని కూడా యూట్యూబ్ స్కూల్స్‌కి ట్రాన్ఫర్ చేశారు. ఇలా ట్రాన్ఫర్ చేయడం వల్ల య్యూటూబ్ స్కూల్స్ సైట్‌లో కామెంట్స్ చేసేందుకు గాను ఆఫ్ఫన్స్‌ని తొలగించారు. ప్రస్తుత రోజుల్లో చాలా స్కూల్స్ స్మార్ట్ క్లాసులను మరలుతుండగా ఈ య్యూటూబ్ స్కూల్స్ సైట్‌ ప్రాముఖ్యత సంతరించుకుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot