YouTube ప్రీమియం యొక్క వార్షిక సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లు విడుదలయ్యాయి!!

|

సోషల్ మీడియా దిగ్గజం యూట్యూబ్ ఎట్టకేలకు ఇండియాలో యూట్యూబ్ ప్రీమియం మరియు యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం కోసం వార్షిక ప్లాన్‌లను తీసుకువస్తోంది. దీని ద్వారా వినియోగదారులు 12 నెలల చెల్లుబాటు కాలానికి సబ్స్క్రిప్షన్ కోసం తక్షణమే చెల్లించవచ్చు. కంపెనీ నెలవారీ మరియు త్రైమాసిక సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను ప్రారంభించినప్పటి నుండి చాలా కాలం తర్వాత వార్షిక ప్లాన్ లను తీసుకురావడం జరిగింది. అయితే కొత్తగా ప్రారంభించబడిన వార్షిక ప్లాన్ లు భారతదేశం మరియు USA నిర్దిష్ట దేశానికి మాత్రమే పరిమితం చేయబడ్డాయి. ఇంకా కంపెనీ వార్షిక సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను తగ్గింపు ధరతో అందిస్తోంది. వినియోగదారులు తమ ఆండ్రాయిడ్ పరికరాలు లేదా వెబ్ ద్వారా కూడా ఈ ప్లాన్‌లను పొందవచ్చు.

 

యూట్యూబ్ వార్షిక సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లు

యూట్యూబ్ వార్షిక సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లు

ఆన్ లైన్ లో విడుదలైన కొన్ని నివేదికల ప్రకారం యూట్యూబ్ ప్రీమియం మరియు యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం ఇప్పుడు వ్యక్తిగత వినియోగదారుల కోసం వార్షిక సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లతో అందుబాటులోకి వచ్చాయి. వ్యక్తిగత వినియోగదారుల కోసం ఈ ప్లాన్ ప్రారంభించబడినందున విద్యార్థులు మరియు కుటుంబ సభ్యులతో ఉన్న వినియోగదారులు వారి అకౌంటులలో వార్షిక ప్లాన్‌లను పొందలేరు. YouTube తన వార్షిక సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లపై ప్రారంభించిన పరిచయ ఆఫర్ జనవరి 23 వరకు అందుబాటులో ఉంటుంది.

యూట్యూబ్ ప్రీమియం
 

యూట్యూబ్ ప్రీమియం మరియు యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం యొక్క వార్షిక ప్లాన్‌ల ధరల విషయానికి వస్తే యూట్యూబ్ ప్రీమియం భారతదేశంలోని వినియోగదారులకు సంవత్సరానికి రూ.1,159 ధర వద్ద పొందవచ్చు. అదే USలో దీని ధర $107.99. మరోవైపు భారతదేశంలో యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం యొక్క వార్షిక ప్లాన్ రూ.889 ధర వద్ద లభిస్తుంది. USలో దీని ధర $89.99. పరిచయ ఆఫర్ ముగిసిన తర్వాత USలో యూట్యూబ్ ప్రీమియం వార్షిక చందా ధర $119.99 గాను మరియు యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం వార్షిక ప్లాన్ $99.99 ధర వద్ద లభిస్తుంది. ప్రమోషనల్ ఆఫర్ ముగిసిన తర్వాత ఇండియా యొక్క వార్షిక ప్లాన్‌ల ధరలు ఇంకా వెల్లడించలేదు. భారతదేశంలో యూట్యూబ్ ప్రీమియం యొక్క నెలవారీ ధర రూ.129 అయితే USలో దీని ధర $11.99. ఇంకా యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం కోసం నెలవారీ ప్లాన్ భారతదేశంలో రూ.99 అయితే USలో $9.99.

YouTube

భారతదేశం, బ్రెజిల్, కెనడా, జర్మనీ, జపాన్, రష్యా, థాయిలాండ్, టర్కీ మరియు యుఎస్ వంటి ఎంపిక చేసిన దేశాలలో YouTube ప్రీమియం మరియు YouTube Music Premium కోసం వార్షిక ప్లాన్ అందుబాటులో ఉంటుందని YouTube నుండి మద్దతు పేజీ పేర్కొంది. Android పరికరాలు మరియు వెబ్ యొక్క వినియోగదారులు YouTube ప్రీమియం మరియు YouTube Music Premium యొక్క వార్షిక ప్లాన్‌కు సైన్ అప్ చేయవచ్చు, అయితే iOS పరికరాల కోసం యాప్‌లో సైన్-అప్ ఎంపిక అందుబాటులో లేదు.

Best Mobiles in India

English summary
YouTube Premium and YouTube Music Premium Annual Plans Launched in India and US

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X