Home
News

రూ.89 ధరకే యూట్యూబ్‌ ప్రీమియం లైట్ ప్లాన్‌.. ఎన్నో ప్రయోజనాలు..!

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం యూట్యూబ్‌ (Youtube) భారత్‌ యూజర్ల కోసం ప్రీమియం లైట్‌ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌ ను ఈ సంవత్సరం మార్చి నెలలో అమెరికాలో లాంచ్‌ చేసింది. తాజాగా ఇండియా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌ లో యాడ్స్‌ లేకుండానే యూట్యూబ్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ పూర్తి ప్రయోజనాల వివరాలు.

ఇప్పటికే యూట్యూబ్‌ ప్రీమియం ప్లాన్‌, స్టూడెంట్ ప్లాన్‌ ఉండగా.. తాజాగా యూట్యూబ్‌ ప్రీమియం లైట్‌ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఇండియాలో యూట్యూబ్‌ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ధర సంవత్సరానికి రూ.1490 గా ఉంది. అయితే విద్యార్థులు డిస్కౌంట్ ధరకు ఈ ప్లాన్‌ను ఉపయోగించుకోవచ్చు.

Youtube premium lite plan launched in india

రూ.89 ప్లాన్ :
అయితే తాజాగా తీసుకొచ్చిన లైట్‌ ప్లాన్ (Youtube Premium Lite Plan) ప్రారంభ ధర నెలకు రూ.89 గా ఉంది. ఈ ప్లాన్‌లో భాగంగా యూజర్లు గేమింగ్, ఫ్యాషన్‌, బ్యూటీ, న్యూస్ సహా మరిన్ని కేటగిరీలకు చెందిన వీడియోలను యాడ్స్‌ లేకుండానే వీక్షించవచ్చు. యూట్యూబ్‌ బ్లాగ్‌లో రాసుకొచ్చిన వివరాల ఆధారంగా Most Videos అనే పదాన్ని ఉపయోగించింది.

అయితే Most Videos అనే పదానికి కచ్చితమైన అర్థాన్ని వివరించలేదు. త్వరలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అదే యూట్యూబ్‌ ప్రీమియం లైట్‌ లో యూట్యూబ్‌ మ్యూజిక్‌ సబ్‌స్క్రిప్షన్‌ను పొందలేరు. ఈ లైట్‌ ప్లాన్‌ను మొబైల్స్‌, స్మార్ట్‌ టీవీ, ల్యాప్‌టాప్‌లోనూ ఉపయోగించుకోవచ్చు. లైట్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్న యూజర్లకు Youtube Shorts, యూట్యూబ్‌ మ్యూజిక్‌ లో యాడ్స్‌ కనిపించనున్నాయి.

సాధారణంగా ప్రీమియం ప్లాన్‌ లో ఏం ఉంటాయ్ :
అదే ప్రీమియం ప్లాన్‌ యూజర్లు యూట్యూబ్‌ లో వీడియోలను బ్యాగ్రౌండ్‌లో వీక్షించవచ్చు. దీంతోపాటు ఆఫ్‌లైన్‌లో వీడియోలను చూసేందుకు వీలుగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. యూట్యూబ్‌ మ్యూజిక్‌ ను కూడా ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు మరిన్ని ప్రయోజనాలున్నాయి.

ప్రీమియం వార్షిక ప్లాన్ ధరలు :
యూట్యూబ్‌ ప్రీమియం వార్షిక ప్లాన్ ధర రూ.1490 గా ఉంది. అదే నెలవారీ వ్యక్తిగత ప్లాన్‌ ధర రూ.149 గా ఉంది. 2 సభ్యులు వినియోగించుకొనేందుకు వీలున్న నెలవారీ ప్లాన్ ధర రూ.219 గా ఉంది. మరియు 5 మంది వినియోగించుకొనేందుకు వీలున్న ఫ్యామిలీ ప్లాన్ నెలవారీ ధర రూ.299 గా ఉంది.

గత నెలలో యూట్యూ్‌బ్‌ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌తో ఫ్లిప్‌కార్ట్ బ్లాక్‌ :
గత నెలలో ఫ్లిప్‌కార్ట్ బ్లాక్‌ ప్లాన్‌ను తీసుకొచ్చింది. వార్షిక ప్లాన్ ధర రూ.1499 గా ఉంది. ప్రారంభంలో రూ.990 కే అందించింది. ఈ ప్లాన్‌లో భాగంగా యూట్యూబ్‌ ప్రీమియం వార్షిక సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందిస్తోంది. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్, ఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ ఆర్డర్‌లపై 5 శాతం సూపర్‌కాయిన్స్‌ క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు.

ఫ్లిప్‌కార్ట్ బ్లాక్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్న యూజర్లు ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌ సమయాల్లో ముందుగా పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. వేగవంతమైన డెలివరీలను పొందుతారు. ఫ్లిప్‌కార్ట్ కస్టమర్‌ సపోర్టులో ప్రాధాన్యత ఉంటుంది. మరియు క్లియర్‌ట్రిప్‌లో ఫ్లైట్‌ క్యాన్సిలేషన్, రీషెడ్యూల్‌ ను అత్యంత తక్కువ ఖర్చుతో చేయవచ్చు.

Best Mobiles in India

English summary
Youtube premium lite plan launched in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X