Youtube Premium యూజర్లకు శుభవార్త, డౌన్లోడ్ మరింత సులువు
Youtube Premium తమ యూజర్లకు కొత్త సదుపాయం కల్పిస్తోంది. ఆన్ లైన్ యూజర్లు మాత్రమే కాకుండా ఆఫ్ లైన్ యూజర్ల కోసం ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇకపై ఆఫ్ లైన్ వీడియోలను 1080p రెజుల్యుషన్‌తో ఈజీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.ఇప్పటివరకూ ఆఫ్ లైన్ యూజర్లు 720p వీడియోలను మాత్రమే డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంది. యూట్యూబ్ వీడియో యూజర్లను ఆకర్షించేందుకు షేరింగ్ వీడియో దిగ్గజం గూగుల్. Youtube iOS, ఆండ్రాయిడ్ యాప్స్ ద్వారా నెమ్మదిగారెజుల్యుషన్ అప్ గ్రేడ్ సపోర్ట్ పెంచుతూ వస్తోంది.

వెర్గే రిపోర్టు ప్రకారం.. గూగుల్ తమ ప్రీమియం యూజర్ల అందరి కోసం క్రమంగా కొత్త అప్‌డేట్ విస్తరించే అవకాశం ఉంది.నాన్ ప్రీమియం యూట్యూబ్ యూజర్లకు ఈ కొత్త ఫీచర్ అందుబాటులో ఉంటుందా? లేదా అనేది క్లారిటీ లేదు. ప్రీమియం యూట్యూబ్ యూజర్ల అందరికి అన్ని ప్రీమియం సర్వీసులను అందించేందుకు యూట్యూబ్ ప్లాన్ చేస్తోంది. Youtube మ్యూజిక్ ప్రీమియంలో భాగంగా యాడ్ ఫ్రీ మ్యూజిక్ స్ట్రీమింగ్‌ను యూట్యూబ్ సర్వీసు ఆఫర్ చేస్తోంది. గూగుల్ ప్లే మ్యూజిక్ సర్వీసు కూడా అందిస్తోంది. మొబైల్ యాప్‌పై మ్యూజిక్, వీడియోలు బ్యాగ్ గ్రౌండ్‌లో కూడా ప్లే అవుతాయి.

యూట్యూబ్ మ్యూజిక్
ఇదిలా ఉంటే ఇండియాలో ఇప్పుడు మ్యూజిక్ వార్ మొదలైంది. Spotify తన మ్యూజిక్ ను లాంచ్ చేసిన కొద్ది నెలల్లోనే యూట్యూబ్ తన మ్యూజిక్ తో దూసుకొచ్చింది. యూట్యూబ్ యూజర్లకు శుభవార్తను మోసుకొచ్చింది. యూట్యూబ్ మ్యూజిక్, యూట్యూబ్ ప్రీమియం ఇండియాలో రిలీజయ్యాయి.ఇప్పటికే గూగుల్ నుంచి గూగుల్ ప్లే మ్యూజిక్, గూగుల్ ప్లే మూవీస్ ఉన్నాయి. ఇప్పుడు గూగుల్ నడిపించే యూట్యూబ్‌కు చెందిన మరో రెండు సర్వీసులు చేరాయి.

ఉచితం
యూట్యూబ్ మ్యూజిక్ యాప్‌ను ఎవరైనా ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. కాకపోతే యాడ్స్ ఉంటాయి. ఒకవేళ మీరు యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం తీసుకుంటే యాడ్స్ ఉండవు.ఇతర దేశాలతో పోలిస్తే ప్రీమియం ధరలు కాస్త తక్కువగానే ఉన్నాయి. లాంచింగ్ సందర్భంగా మొదటి 3 నెలల పాటు యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తున్నారు.

5 మంది కుటుంబ సభ్యులు
ఆ తరువాత నెలకు రూ.99 చెల్లించాలి. లేదా రూ.149 చెల్లించి ఫ్యామిలీ ప్లాన్ తీసుకుంటే 5 మంది కుటుంబ సభ్యులు యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం సేవలను పొందవచ్చు. ఇక ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలపై యూజర్లకు లభిస్తున్నది.

పూర్తి ప్రీమియం వివరాలు
యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం మెంబర్‌షిప్- నెలకు రూ.99 యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం మెంబర్‌షిప్(iOS)- నెలకు రూ.129 యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం ఫ్యామిలీ మెంబర్‌షిప్(ఆరుగురికి)- నెలకు రూ.149 యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం ఫ్యామిలీ(ఆరుగురికి) మెంబర్‌షిప్(iOS)- నెలకు రూ.199 యూట్యూబ్ ప్రీమియం- నెలకు రూ.129 యూట్యూబ్ ప్రీమియం(iOS)- నెలకు రూ.169 యూట్యూబ్ ప్రీమియం ఫ్యామిలీ(ఆరుగురికి) ప్లాన్- నెలకు రూ.189 యూట్యూబ్ ప్రీమియం ఫ్యామిలీ(ఆరుగురికి) ప్లాన్(iOS)- నెలకు రూ.249


Click it and Unblock the Notifications








